Begin typing your search above and press return to search.

సొంత సెటప్ వైపు టాలీవుడ్.. ఇదొక కొత్త బిజినెస్ ట్రెండ్!

టాలీవుడ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఇప్పుడు రూట్ మారుస్తోంది. కేవలం సినిమాలు తీయడమే కాకుండా, ఓన్ ప్రొడక్షన్ సెటప్ క్రియేట్ చేసుకోవడం మీద పెద్ద బ్యానర్లు గట్టిగా ఫోకస్ పెడుతున్నాయి.

By:  M Prashanth   |   11 Aug 2026 9:00 PM IST
సొంత సెటప్ వైపు టాలీవుడ్.. ఇదొక కొత్త బిజినెస్ ట్రెండ్!
X

టాలీవుడ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఇప్పుడు రూట్ మారుస్తోంది. కేవలం సినిమాలు తీయడమే కాకుండా, ఓన్ ప్రొడక్షన్ సెటప్ క్రియేట్ చేసుకోవడం మీద పెద్ద బ్యానర్లు గట్టిగా ఫోకస్ పెడుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ నిజమైతే, ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ వందల ఎకరాల్లో పెద్ద స్టూడియో కట్టే ప్లాన్ లో ఉంది. ఈ న్యూస్ నిజమైతే తెలుగు సినిమా షూటింగ్ ప్లానింగ్ లో ఉహించని మార్పులు రావచ్చు.

ఒక పెద్ద బ్యానర్ నిజంగానే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు పెడితే, అది జస్ట్ షూటింగ్ స్పాట్ లా మిగిలిపోదు. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే డిఫరెంట్ షూటింగ్ సెట్స్, ఇండోర్ ఫ్లోర్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ ఒకే దగ్గర చేసుకునేలా సొంత ఈకోసిస్టమ్ రెడీ అవుతుంది. దీనివల్ల ప్రతి చిన్న అవసరానికి బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడే అవసరం కొంత తగ్గుతుంది.

ఇప్పుడున్న పాన్ ఇండియా క్రేజ్ తో భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది మేకర్స్ కు మామూలు టెన్షన్ కాదు. అదే ఓన్ సెటప్ ఉంటే, ఏ సినిమా ఎప్పుడు చేయాలో ఈజీగా షెడ్యూల్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా వాడే సెట్స్ అలాగే ఉంచుకోవడం, లొకేషన్స్ దొరకలేదని వెయిట్ చేసే ప్రాబ్లమ్ లేకుండా షూటింగ్స్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి ఇది వర్కౌట్ అవుతుంది.

ఇది మాత్రమే కాదు, ఒకే బ్యానర్ నుంచి ఒకేసారి మూణ్ణాలుగు ప్రాజెక్టులు రన్ అవుతున్నప్పుడు ఈ మోడల్ సూపర్ గా హెల్ప్ అవుతుంది. ఒకే టైమ్ లో మల్టిపుల్ సినిమాల షూటింగ్స్ ఒకే చోట కన్ఫ్యూజన్ లేకుండా హ్యాండిల్ చేయడం ప్రొడ్యూసర్స్ కి ఈజీ అవుతుంది. కంటెంట్ క్వాలిటీ ఎక్కడా తగ్గకుండా, అనుకున్న టైమ్ కి సినిమాలు కంప్లీట్ చేయడానికి ఇలాంటి ప్రైవేట్ ప్రాపర్టీస్ బాగా యూజ్ అవుతాయి.

సినిమా తీయడం అంటే ఇప్పుడు జస్ట్ కెమెరా పెట్టి యాక్షన్ చెప్పడం కాదు. గ్లోబల్ లెవెల్ లో మన సినిమాలు కాంపిటీషన్ తట్టుకోవాలంటే స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ అవసరం. ఇప్పటిదాకా కేవలం ప్రొడక్షన్ హౌసెస్ గా ఉన్న బ్యానర్లు, ఇప్పుడు ప్రొడక్షన్ హబ్స్ గా మారడం టాలీవుడ్ కి పెద్ద ప్లస్. బిజినెస్ యాంగిల్ లో చూసుకున్నా సరే, ఫ్యూచర్ లో ఈ సంస్థలకు ఇదొక సాలిడ్ అసెట్ లా మారుతుంది. ఇదంతా చూస్తుంటే తెలుగు సినిమాలో కంటెంట్ తో పాటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఏ రేంజ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయో క్లియర్ గా అర్థమవుతోంది. టాలీవుడ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లడంలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కీలకంగా మారే అవకాశం ఉంది.