Begin typing your search above and press return to search.

ఆ ఒక్క పాట నా కెరీర్ కు పున‌రుజ్జీవం పోసింది

అనంత్ శ్రీరామ్. టాలీవుడ్ లోని ప్ర‌ముఖ సినీ గేయ ర‌చయిత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Jan 2026 9:00 AM IST
ఆ ఒక్క పాట నా కెరీర్ కు పున‌రుజ్జీవం పోసింది
X

అనంత్ శ్రీరామ్. టాలీవుడ్ లోని ప్ర‌ముఖ సినీ గేయ ర‌చయిత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు. ఇప్ప‌టికే ఎన్నో సాంగ్స్ ను ర‌చించి లిరిసిస్ట్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనంత్ శ్రీరామ్. ఆయ‌న రాసిన పాట‌ల్లోని సాహిత్యం విన‌డానికి ఎంతో ఇంపుగా ఉంటుంద‌ని ఎన్నో ప్ర‌శంస‌లందుకున్న అనంత్ శ్రీరామ్ ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్స్ చాలానే ఉన్నాయి.

అయితే ఎవ‌రి లైఫ్ లో అయినా కెరీర్ ను మ‌లుపు తిప్పే స‌న్నివేశాలు కొన్ని ఉంటాయి. న‌టీన‌టుల‌కు, డైరెక్ట‌ర్ల‌కు, నిర్మాత‌లకు కొన్ని సినిమాల ద్వారా త‌మ కెరీర్ మ‌లుపు తిరిగితే, పాట‌ల ర‌చ‌యిత‌ల‌కు మాత్రం తాము రాసిన ఒక పాట ద్వారా వారి లైఫ్ ట‌ర్న్ అవుతుంది. అలా అనంత్ శ్రీరామ్ కెరీర్ ను మ‌లుపు తిప్పిన సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి.

కెరీర్ ను మ‌లుపు తిప్పింది

2013లో త‌న కెరీర్ నెమ్మ‌దించిందని, పెద్ద సినిమాల ఆఫ‌ర్లు ఏమీ రాలేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అలాంటి స‌మ‌యంలో ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాలోని ఏం సందేహం లేదు సాంగ్ రిలీజై, త‌న కెరీర్ ను మ‌లుపు తిప్పింద‌ని అనంత్ శ్రీరామ్ చెప్పుకొచ్చారు. పెద్ద సినిమాలోని సాంగ్ రిలీజైతే ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో అలాంటి రెస్పాన్సే ఈ పాట‌కు కూడా వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పారు.

1000కి పైగా పాట‌లు రాసిన అనంత్ శ్రీరామ్

ఆ పాట త‌ర్వాత త‌న‌కు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌చ్చాయ‌ని, ఆ పాట త‌న కెరీర్ లైఫ్ ను మార్చేసిందని, ఇంకా చెప్పాలంటే త‌న కెరీర్ కు ఆ సాంగ్ పున‌రుజ్జీవం పోసింద‌ని చెప్పొచ్చ‌న్నారు అనంత్. 2005లో లిరిక్ రైట‌ర్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనంత్ శ్రీరామ్ ఆ త‌ర్వాత ఎన్నో పాటలు రాశారు. ఆర‌డుగుల బుల్లెట్టు లాంటి పాట‌లెన్నో అనంత్ కు మంచి లిరిసిస్ట్ అనే పేరుని తెచ్చిపెట్టాయి. అనంత్ కలం నుంచి ఇప్ప‌టికే వెయ్యికి పైగా పాట‌లొచ్చాయి.