గతమెంతో ఘనమంటే కుదరదిక్కడ!
ఒకప్పుడు డైరెక్టర్ ఫెయిలైనా సెకెండ్ ఛాన్స్ ఉండేది. గత విజయాలను చూసి స్టార్ హీరోలు అవకాశాలిచ్చేవారు.
By: Srikanth Kontham | 15 Dec 2025 9:00 PM ISTఒకప్పుడు డైరెక్టర్ ఫెయిలైనా సెకెండ్ ఛాన్స్ ఉండేది. గత విజయాలను చూసి స్టార్ హీరోలు అవకాశాలిచ్చేవారు. అతడితో ఉన్న ర్యాపో కూడా కీలక పాత్ర పోషించేది. గతంలో సక్సెస్ ఇచ్చాడు? అన్న కృతజ్ఞతా భావం కూడా చాలా మంది హీరోల్లో కనిపించేది. దర్శకులు కూడా హీరోలపై అంతే నమ్మకం పెట్టుకునే వారు. కొన్ని కారణాలతో లైన్ లో ఉన్న ప్రాజెక్ట్ ఫెయిలైనా? ఆ హీరో నాతో సినిమా చేస్తాడు కదా అన్న ధీమా దర్శకుల్లో కనిపించేది. అందుకు తగ్గట్లు ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ లో ఉండగానే ఫలితాలతో సంబంధం లేకుండా అగ్రిమెంట్లు జరిగేవి.
కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. సక్సెస్ లో లేకపోతే ఏ స్టార్ హీరో ఆ డైరెక్టర్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎదుట పడితే ఎక్కడ స్టోరీ చెబుతానంటాడో? అన్న భయంతో కంట పడకుండా తప్పించుకు పోతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ ఓ స్టార్ హీరో ద్దగ్గరకు వెళ్లి స్టోరీ చెప్పాలంటే బోలెడంతం ప్రోసస్ ఉంది. అతడి గత విజయాలు ఎలా ఉన్నాయి? కమర్శియల్ గా అవెంత వసూళ్లు సాధించాయి? ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడా? లేదా? ఎంత క్రియేటివ్ గా థింక్ చేయగలడు? ఇలా ఎన్నో విషయాలను విశ్లేషించుకుని హీరో పిలుస్తున్నాడు.
హీరో అనుకున్న దాంట్లో ఏ ఒక్కటి లేకపోయినా? కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. మరి హీరోలంతా ఇలాగే ఉన్నారా? అంటే ఒకర్ని చూసి ఒకరు తయారవుతున్నారు? అన్నది తాజా సమాచారం. గతంలో ఓ స్టార్ హీరో పేరు ఎక్కువగా ఇలాంటి విషయాల్లో చర్చకు వచ్చేది. ఎంత పెద్ద హిట్ ఇచ్చినా? సరే ఇప్పుడతని స్టేటస్ ఏంటి? అని అడిగి తెలుసుకుని..పక్కా సమాచారం సేకరించి అతడికి డేట్లు ఇవ్వాలా? లేదా? అని నిర్ణయం తీసుకునేవారు. ఈ విషయం ఓ స్టార్ డైరెక్టర్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని బట్టి అర్దమైంది.
ఆ హీరోకన్నా? ఆ హీరో అభిమానులే తనని ఎక్కువగా నమ్ముతున్నారని అన్నారు. అప్పటి నుంచి ఆ హీరో కంటే? ఆ హీరో అభిమానులంటేనే తనకు ఎక్కువ ఇష్టమన్నారు. మిగతా హీరోల సంగతేంటి? అంటే దాదాపు అందరూ అలాగే ఉన్నారు? అన్నది మరికొంత మంది దర్శకుల మాటల్ని బట్టి అర్దమైంది. నానా పాట్లు పడి స్టోరీ చెప్పినా? చేద్దాంలే అని డిలే చేసే వారు మరికొంత మంది హీరోలు. ఏడాది పాటు కాలం వెల్లదీసే సరికి ఆ ప్రాజెక్ట్ పై ఆసక్తి సన్నగిల్లి డైరెక్టర్ కూడా మరో హీరోని ప్రత్యామ్నాయంగా చూసుకుంటున్నాడు. ముందు ముందు ఈ పరిస్థితి మరింత జఠిలమవుతుందని...హీరోలు చాలా అంశాలను ప్రామాణికంగా తీసుకుని అపాయింట్ మెంట్ ఇచ్చే రోజులు న్నాయంటున్నారు.
