Begin typing your search above and press return to search.

ఇప్ప‌టికైనా మార‌తారా? మార‌క‌పోతే క‌ష్టం!

క‌టౌట్ తో కాదు కంటెంట్ తో ఎలా కొట్టి చూపించాలి అన్న టెక్నిక్ టాలీవుడ్ ప‌ట్టుకుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `మిరాయ్`, `కిష్కింద‌పురి` లాంటి సినిమాలు ఎంత పెద్ద స‌క్స‌స్ అయ్యాయో తెలిసిందే

By:  Srikanth Kontham   |   16 Sept 2025 12:44 PM IST
ఇప్ప‌టికైనా మార‌తారా? మార‌క‌పోతే క‌ష్టం!
X

క‌టౌట్ తో కాదు కంటెంట్ తో ఎలా కొట్టి చూపించాలి అన్న టెక్నిక్ టాలీవుడ్ ప‌ట్టుకుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `మిరాయ్`, `కిష్కింద‌పురి` లాంటి సినిమాలు ఎంత పెద్ద స‌క్స‌స్ అయ్యాయో తెలిసిందే. ఈ రెండు సినిమాల బ‌డ్జెట్ 60 కోట్ల లోపు ఉంటుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు సాధిస్తున్నాయి. వీటితో పాటు ప‌ర‌భాషా చిత్రం `లోకా చాప్ట‌ర్ వ‌న్` లాంటి చిత్రం పెద్ద స‌క్స‌స్ అవ్వ‌డంతో ఇప్పుడివే ట్రెండింగ్ మూవీస్ గా నిలిచాయి. చ‌ర్చంతా ఈ మూడు చిత్రాల గురించే జ‌రుగుతోంది. త‌క్కువ బడ్జెట్ లో క్వాలిటీ ఉన్న చిత్ర మందించారు.

హిట్ టాక్ వ‌స్తేనే థియేట‌ర్కి:

కంటెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన చిత్రాలు కావ‌డంతో ఇంత పెద్ద హిట్ అయ్యాయి? అన్న‌ది క్లియ‌ర్ గా క‌ని పిస్తుంది. వీటితో పాటు, రిలీజ్ అయిన అగ్ర హీరోల చిత్రాలు ప్లాప్ అవ్వ‌డంతో? కంటెంట్ మాత్ర‌మే ఏ సినిమానైనా నిల బెడుతుంద‌ని మ‌రోసారి ప్రూవ్ అయింది. ప్రేక్ష‌కులంతా స్టార్ ఉన్న సినిమాల కంటే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల‌కే వెళ్తున్నారు. ఒక‌ప్పుడు హిట్ టాక్ వ‌చ్చినా? ఆ సినిమాలకు వెళ్ల‌డానికి ఆడియన్స్ ఆస‌క్తి చూపించేవారు కాదు. పెద్ద స్టార్ ఏ సినిమా చేస్తే ఆసినిమాకే ఆస‌క్తి చూపించి వెళ్లేవారు.

బ‌ల‌మైన కంటెంట్ తోనే సాధ్యం:

ఇలాంటి రోజులు ఎప్పుడు పోతాయా? హీరో ఇమేజ్ తో సినిమాలు ఆడ‌టం ఏంట‌ని? అప్ప‌ట్లో కంటెంట్ మెచ్చిన అభిమానులు అనుకునేవారు. ఇప్ప‌టికీ ఆ రోజులొచ్చాయ‌ని సాధార‌ణ ప్రేక్ష‌కుడు కూడా కంటెం ట్ ఉన్న సినిమా వైపు వెళ్ల‌డంతో మార్పు స్ప‌ష్టం క‌నిపిస్తుంది. ఈనేప‌థ్యంలో అలెర్ట్ అవ్వాల్సింది ఎవ‌రు? అంటే ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌ల‌ని క్లియ‌ర్ గా తెలుస్తోంది. మూస‌ కంటెంట్..పాత చింత‌కాయ ప‌చ్చ‌డి త‌ర‌హాలో సినిమాలు తీస్తే చూసే రోజులు కావివి. మూడు గంట‌లు సినిమా అయినా...గంట‌న్న‌ర సినిమా అయినా? అందులో బ‌ల‌మైన కంటెంట్ ఉండాలి.

స్టార్ డైరెక్ట‌ర్లు అంతా ఆలోచించాల్సిన విష‌యం:

దాంతో పాటు, సినిమా బ‌డ్జెట్ కూడా అదుపులో ఉండాలి. వంద‌ల కోట్టు ఖ‌ర్చు చేయ‌డం కంటే? ఎక్క‌డ అవస‌ర‌మో అక్క‌డే ఖ‌ర్చు చేయాలి. త‌క్కువ బ‌డ్జెట్ లోనే బెస్ట్ విజువ‌ల్ ఎఫెక్స్ట్ అందించాలి. వీట న్నింటిపై ద‌ర్శ‌కుడికి స‌మ‌గ్ర అవ‌గాహ‌న అవ‌స‌రం. చిన్న సినిమా ద‌ర్శ‌కులు త‌క్కువ బ‌డ్జెట్ లోనే అంత క్వాలిటీ సినిమాలు అందిస్తున్నారంటే? కార‌ణం నాలెడ్జ్ మాత్ర‌మే అన్న‌ది అంతా అర్దం చేసుకోవాలి. అలా జ‌రిగిన‌ప్పుడే బ‌డ్జెట్ అదుపు త‌ప్ప‌దు. నిర్మాణ భారం త‌గ్గుతుంది. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేయించే డైరెక్ట‌ర్లు అంతా ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ప్పుడే సాధ్య‌మ‌వుతుంది.