కన్నడ ఇండస్ట్రీకి టాలీవుడ్ లాంఛ్ ప్యాడ్ గా మారినట్లుందే..!
తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీలు పక్కపక్కనే ఉన్నా.. ఒకప్పుడు వాటి మార్కెట్లు మాత్రం వేర్వేరుగా ఉండేవి.
By: M Prashanth | 15 July 2026 11:08 AM ISTతెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీలు పక్కపక్కనే ఉన్నా.. ఒకప్పుడు వాటి మార్కెట్లు మాత్రం వేర్వేరుగా ఉండేవి. ఒక భాషలో స్టార్ అయిన యాక్టర్ మరో భాషలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు టాలీవుడ్ లాంఛ్ ప్యాడ్ గా మారుతోంది. ఇక్కడ అవకాశం దక్కితే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వస్తోందనే అభిప్రాయం బలపడుతోంది.
గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులు భాష కంటే కథ, నటనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పలువురు నటులు టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హీరోల నుంచి విలన్ల వరకు, హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరికీ తెలుగు సినిమా మంచి అవకాశాలను అందిస్తోంది. అందుకే కన్నడ హీరోలకు తెలుగు మార్కెట్ ఇప్పుడు కీలకంగా మారింది. ఒకప్పుడు వారి సినిమాలు డబ్బింగ్ రూపంలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చేవి.
ఇప్పుడు మాత్రం తెలుగులో ప్రత్యేక ప్రమోషన్లు చేయడం, నేరుగా టాలీవుడ్ ప్రేక్షకులను టార్గెట్ చేయడం సాధారణంగా మారిపోయింది. ఇక్కడ మంచి రెస్పాన్స్ లభిస్తే వారి మార్కెట్ ఒక్కసారిగా పెరుగుతోంది. దీంతో చాలా మంది కన్నడ హీరోలు తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హీరోయిన్ల విషయంలో ఆ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో ఉన్న పలువురు హీరోయిన్లది కన్నడ బ్యాక్ గ్రౌండే.
తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కిన తర్వాతే వారి కెరీర్లు భారీ మలుపు తిరిగాయి. టాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించిన తర్వాత వారు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. దీంతో తెలుగు సినిమా వారికి నేషనల్ రేంజ్ గుర్తింపునిచ్చే ప్లాట్ ఫామ్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల తెలుగు సినిమాల్లో కన్నడ నటుల హవా గట్టిగానే కనిపిస్తోంది.
ముఖ్యంగా విలన్ పాత్రల్లో వారు చూపిస్తున్న ఎఫెక్ట్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇటీవలి చిత్రాల్లో కూడా కన్నడ నటుల ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. కొన్ని సినిమాల్లో విలన్లుగా, మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో వారు కనిపిస్తూ కథకు బలం చేకూరుస్తున్నారు. ప్రేక్షకులు కూడా పాత్రకు సరిపోయే నటుడిని మాత్రమే చూస్తుండటంతో లాంగ్వేజ్ వాల్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఆ మార్పు వెనుక తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
టాలెంట్ ఉన్న నటీనటులను ఆదరించే స్వభావం టాలీవుడ్ మార్కెట్ ను మరింత పెద్దదిగా మార్చింది. అందుకే ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది క్యాస్టింగ్ తమ నెక్స్ట్ సినిమాలకు తెలుగు సినిమాలనే మెయిన్ ప్లాట్ ఫామ్ గా భావిస్తున్నారు. అందుకే కన్నడ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ కాస్టింగ్ కు లాంఛ్ ఫ్యాడ్ గా టాలీవుడ్ నిలుస్తోందనే చెప్పాలి. అందుకే శాండల్ వుడ్ లో టాలెంట్ పుడితే.. దానికి నేషనల్ రేంజ్ గుర్తింపు తెచ్చేది టాలీవుడ్ అనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
