హీరోయిన్లపై లేడీ ప్రొడ్యూసర్ల ఎఫెక్ట్ పడుతుందా?
టాలీవుడ్ లో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య కొంతకాలంగా పెరుగుతుందనే చెప్పాలి. బడా సినీ ఫ్యామిలీలకు చెందిన కొందరు.. నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
By: M Prashanth | 23 March 2026 10:51 PM ISTటాలీవుడ్ లో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య కొంతకాలంగా పెరుగుతుందనే చెప్పాలి. బడా సినీ ఫ్యామిలీలకు చెందిన కొందరు.. నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ కొత్త ట్రెండ్ ఇప్పుడు హీరోయిన్లకు సవాలుగా మారుతోందన్న టాక్ ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తోంది. అసలేం జరుగుతోంది? హీరోయిన్లకు ఎందుకు సవాలు ఎదురవుతోంది?
సాధారణంగా ఏ సినిమా ప్రమోషన్లలో అయినా ఎప్పుడు కూడా హీరో, హీరోయిన్లకే ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది లేడీ ప్రొడ్యూసర్లు స్వయంగా ముందుకు వచ్చి సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. దర్శకులు, హీరోలతో కలిసి మీడియా ముందుకు ఎక్కువగా వస్తుండటంతో, హీరోయిన్లకు వచ్చే స్పేస్ తగ్గిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇటీవల ఓ యంగ్ హీరోయిన్ కు సంబంధించిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె నటించిన తాజా సినిమా ద్వారా మంచి గుర్తింపు వస్తుందని ఆశపడింది. కథలో కూడా ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉందని భావించింది. కానీ సినిమా ప్రమోషన్ల సమయంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ హీరోయిన్ కన్నా ప్రొడ్యూసర్ డామినేషన్ ఎక్కువ కనిపించిందని టాక్ వినిపిస్తోంది.
ఆ మూవీ ప్రమోషన్స్ లో సదరు లేడీ లేడీ ప్రొడ్యూసర్ చాలా యాక్టివ్ గా వ్యవహరించడం, మీడియా ఇంటర్వ్యూలలో ముందుండటం, సోషల్ మీడియాలో కూడా ఫుల్ హ ప్రచారం చేయడం వంటివి జరిగాయి. ఆమె వ్యక్తిత్వం, మాట్లాడే తీరు, అట్రాక్టివ్ ప్రెజెన్స్ కారణంగా ప్రేక్షకులు, మీడియా దృష్టి ఎక్కువగా ఆమెపైనే నిలిచిపోయిందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన యువతి కొంత నిరాశకు గురైనట్టు సమాచారం. ప్రమోషన్లలో తాను కూడా భాగమవుతున్నప్పటికీ, తనకు రావాల్సిన గుర్తింపు రావడం లేదని కాస్త బాధపడుతోందట. సినిమా రిలీజ్ కు ముందు ఎక్స్పెక్ట్ చేసిన పబ్లిసిటీ దక్కకపోవడంతో ఆమె అసంతృప్తిగా ఉందని వినికిడి. దీంతో ఇప్పుడు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాతలు తమ సినిమా కోసం ఎంతగానో కష్టపడతారని, అందుకే వారు ప్రమోషన్లలో ముందుకు రావడం సహజమని చెబుతున్నారు. అయితే అదే సమయంలో హీరోయిన్ కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మరోవైపు, సోషల్ మీడియా యుగంలో ఎవరు ఆకర్షణీయంగా కనిపిస్తే వాటిపైనే దృష్టి నిలుస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. కేవలం పాత్రపైనే కాకుండా, ప్రెజెన్స్ కూడా ఇప్పుడు ముఖ్యమైందని అంటున్నారు. ఏదేమైనా.. లేడీ ప్రొడ్యూసర్ల పెరుగుదల ఒక కొత్త మార్పుకు నాంది పలికింది. అయితే ఆ మార్పు హీరోయిన్ల కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది ముందున్న రోజుల్లో స్పష్టమవుతుంది.
