Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో ట్రెండింగ్ లేడీ నిర్మాత‌లు వీళ్లేనా?

టాలీవుడ్ లో లేడీ ప్రొడ్యూస‌ర్లు పెరుగుతున్నారా? ప్ర‌తిభావంతులైనా మ‌హిళా నిర్మాత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగ‌లు వేస్తున్నారా? అంటే అవున‌నే అనాలి.

By:  Srikanth Kontham   |   26 Jan 2026 12:00 AM IST
ఇండ‌స్ట్రీలో ట్రెండింగ్ లేడీ నిర్మాత‌లు వీళ్లేనా?
X

టాలీవుడ్ లో లేడీ ప్రొడ్యూస‌ర్లు పెరుగుతున్నారా? ప్ర‌తిభావంతులైనా మ‌హిళా నిర్మాత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగ‌లు వేస్తున్నారా? అంటే అవున‌నే అనాలి. ఇప్ప‌టికే అశ్వీనీద‌త్ వార‌సత్వాన్ని పుణికి పుచ్చుకుని కుమార్తెలు ప్రియాంక ద‌త్, స్వ‌ప్నాద‌త్ లు నిర్మాత‌లుగా స‌క్సెస్ అయ్యారు. ఇన్నోవేటివ్ చిత్రాల్నినిర్మిస్తూ త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రు రెగ్యుల‌ర్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు దూరంగా ఉంటారు. వైవిథ్య‌మైన క‌థాబ‌లం ఉన్న చిత్రాల్నే నిర్మిస్తారు. పాన్ ఇండియాలో సినిమాలు నిర్మించ‌డం సైతం ఈ ద్వ‌యానికే చెల్లింది.

మ‌హిళ‌లు అయినా నిర్మాణంలో ఎన్నో డేరింగ్ నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నారు. ఆర‌కంగా ప్రియాంక‌, స్వప్నాదత్ తండ్రిని మించిన త‌న‌యురాళ్లే అనొచ్చు. అలాగే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వార‌స‌త్వాన్ని అందుకుని నిహ‌రిక కూడా నిర్మాత‌గా మంచి స‌క్సెస్ అయింది. న‌టిగా ఫెయిలైనా? నిర్మాత‌గా మాత్రం అభిరుచుని చాటు కుంటుంది. కొత్త వాళ్ల‌ను ప్రోత్సహించ‌డంలో ముందుంటుంది. స్క్రిప్ట్ ను ప‌ర్పెక్ట్ గా జ‌డ్జ్ చేయ‌గ‌ల‌దు. ప్ర‌తిభా వంతులైన వారిని వెతికి ప‌ట్టుకోవ‌డంలో నిష్ణాతురాలే. సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ ల్ని నిర్మించ‌డం నిహారిక

ప్ర‌త్యేక‌త‌.

తాజాగా అదే కుటుంబం నుంచి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా `మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` చిత్రంతో నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ స‌క్స‌స్ అయింది. తొలి సినిమాతోనే క‌మర్శయ‌ల్ గా మంచి విజ‌యాన్ని అందు కుంది. త‌క్కువ బ‌డ్జెట్ లోనే నిర్మించిన సినిమా వంద‌ల కోట్లు వ‌సూళ్లు సాధించింది. అలాగే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సౌజన్య కూడా కొంత కాలంగా నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. నాగ‌వంశీ తో క‌లిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా భ‌ర్త ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చాలా సినిమాల‌కు ఆమె నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌రాలు సుప్రియ యార్ల‌గ‌డ్డ కూడా అభిరుచి గ‌ల నిర్మాత‌. ఇన్నో వేటివ్ క‌థ‌ల్ని నిర్మిస్తూ స‌క్సెస్ అందుకుంటున్నారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ ల‌ను జ‌డ్జి చేయ‌డంలో సుప్రియను స్పెష‌లిస్ట్ గా చెప్పొచ్చు. అలాగే నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న కుమార్తె తేజ‌స్విని కూడా నిర్మాణం రంగంలోకి అడుగు పెడుతున్నారు. బాల య్య న‌టిస్తోన్న111వ సినిమాతో లాంచ్ అవుతు న్నారు. ఈ చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్నారు.భ‌విష్య‌త్ లో తేజ‌స్వీ పెద్ద నిర్మాతగా ఎదుగుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. అలాగే దిల్ రాజు కుటుంబం నుంచి కొంత మంది లేడీ నిర్మాత‌లున్నారు. నితిన్ సోద‌రి కూడా చాలా కాలంగా నిర్మాణంలో రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భ‌విష్య‌త్ లో మ‌రింత మంది నిర్మాణ రంగం వైపు వ‌చ్చే అవ‌కాశం ఉంది.