పిక్‌టాక్ : 66 కాదు 36 లా కింగ్ నాగార్జున!
టాలీవుడ్ కింగ్ నాగార్జున నాలుగు దశాబ్దాల సినీ ప్రస్తానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Ramesh Palla | 17 Nov 2025 12:20 PM ISTటాలీవుడ్ కింగ్ నాగార్జున నాలుగు దశాబ్దాల సినీ ప్రస్తానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సాధించిన విజయాలు, దక్కించుకున్న స్టార్‌డం, దక్కిన గౌరవం, సొంతం చేసుకున్న అభిమానులు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఇండస్ట్రీలో నాగార్జున సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ హీరోగా ఆయన సినిమాలు చేస్తున్నారు. ఆరు పదుల వయసు దాటి ఆరు ఏళ్లు అయినప్పటికీ నాగార్జున హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సాధారణంగా ఆరు పదుల వయసు దాటిన తర్వాత ఎక్కువ శాతం మంది హీరోలు అందుకు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ఉంటారు. హీరోగా కుర్ర వేషాలు వేయకుండా కాస్త వయసు పైబడిన పాత్రలు చేయడం ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నారు. కానీ నాగార్జున మాత్రం వయసుకు తగ్గ పాత్ర చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు.
నాగార్జున ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్...
నాగార్జున సాధారణంగానే చాలా యంగ్ లుక్‌తో కనిపిస్తాడు. ఆయన అరవైలోనూ నలబై అన్నట్టుగా ఉంటారు. అలాంటిది తాజాగా మేకోవర్, ఔట్ ఫిట్‌తో ఏకంగా ముప్పై లోకి వెళ్లినట్లుగా అనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ అఫిషియల్ సోషల్ మీడియా పేజ్‌లో నాగార్జున తాజా లుక్ ఫోటోలు షేర్ చేశారు. 66 ఏళ్ల నాగార్జునను ఈ ఫోటోల్లో చూస్తూ ఉంటే 36 ఏళ్ల వయసు వ్యక్తి మాదిరిగా కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. నాగార్జునకు మాత్రం ఇలా సాధ్యం అవుతుందని, ఇండస్ట్రీలో మరే హీరోకు కూడా ఇలాంటి యంగ్ లుక్, ఇలాంటి హ్యాండ్సమ్ లుక్ సాధ్యం కాదు అంటూ అక్కినేని ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నాగార్జున లుక్ పరంగా ఎప్పటికప్పుడు కొత్త వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు.
శివ సినిమా రిలీజ్ సందర్భంగా...
అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా, ఆ సినిమా ప్రమోషన్ సమయంలో నాగార్జున ఇలాంటి ఔట్ ఫిట్ లో కనిపించాడు. ఆ సినిమా ప్రమోషన్ కోసం నాగార్జున దాదాపు రెండు వారాల సమయం కేటాయించాడు. తానే స్వయంగా నిర్మాత కావడంతో శివ సినిమా రీ రిలీజ్ బాధ్యత మొత్తం తన మీద వేసుకున్నాడు. చాలా ఖర్చు పెట్టి మరీ కొత్తగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. శివ సినిమాకు మళ్లీ ఇప్పుడు కూడా ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన దక్కింది. కొత్త తరం కు కూడా శివ నచ్చింది అంటూ సోషల్ మీడియ పోస్ట్‌లను చూస్తే అర్థం అవుతుంది. అక్కినేని ఫ్యాన్స్ కి శివ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శివ సినిమా రీ రిలీజ్ హంగామా దాదాపు మూడు వారాలు సాగింది.
నాగార్జున 100వ సినిమా అప్‌డేట్
శివ సినిమా హంగామా పూర్తి కావడంతో నాగార్జున తిరిగి తన కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే ప్రారంభం అయిన నాగార్జున వందవ సినిమా కొత్త షెడ్యూల్‌ను ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా ఎప్పుడు ఎలా అనౌన్స్ చేయాలి అనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు ఎవరు అనే విషయంలోనూ మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు. చాలా సైలెంగ్‌గా నాగ్ 100 సినిమా షూటింగ్ చేస్తున్నారు. హీరోయిన్స్ విషయంలో, విలన్ విషయంలో ఆ మధ్య ప్రచారం జరిగింది. నాగ్ మ్యాజిక్ నెంబర్ మూవీ కనుక అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్ లు గెస్ట్ రోల్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు.
