కాకా..దాదా..రాకా టైటిల్స్ తోనే దడ పుట్టిస్తున్నారుగా!
సినిమా విజయానికి కథ, కథనాలతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకునే టైటిల్ కూడా అంతే ముఖ్యం.
By: Srikanth Kontham | 7 Sept 2026 9:00 PM ISTసినిమా విజయానికి కథ, కథనాలతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకునే టైటిల్ కూడా అంతే ముఖ్యం. మేకర్స్ క్యాచీగా ఉండే టైటిళ్ల కోసం ప్రత్యేకంగా అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రసీమలో రెండు అక్షరాల టైటిళ్ల హవా నడుస్తోంది. తాజాగా ముగ్గురు కథానాయకుల సినిమాలకు `కాకా`, `దాదా`, `రాకా` అనే వినూత్నమైన టైటిళ్లు ఖరారు కావడం.. అవన్నీ ఒకే రకమైన ప్రాసతో ఉండటం సినీ ప్రియుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
యాదృచ్ఛికంగా కుదిరిన మూడు టైటిళ్లు ప్రకటించినప్పటి నుంచే నెట్టింట సందడి చేస్తున్నాయి. రెండు అక్షరాల ప్రాసతో కూడిన పేర్లు పలకడానికి సులువుగా, వినడానికి అత్యంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉన్న టైటిల్స్ అనౌన్స్‌మెంట్‌తోనే చిత్రాలపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. సాధారణంగా ఇలాంటి రైమింగ్ టైటిల్స్ ఒకే సమయంలో రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
ఈ చిత్రాల్లోని మాస్ ఎలిమెంట్స్, కథా నేపథ్యాలు కూడా ఆ టైటిళ్లకు తగ్గట్లే అత్యంత ఆసక్తికరంగా ఉండబో తున్నట్లు తెలుస్తోంది. `కాకా`, `దాదా`, `రాకా` అనే పదాలు సాధారణంగా స్థానిక (మాస్) భాషలో పవర్‌ఫుల్ క్యారెక్టర్లను.. నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులను సూచించడానికి ఉపయోగిస్తారు. దీంతో ఈ చిత్రాల్లో హీరోల పాత్రలు ఎంతో రగ్గడ్‌గా, యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయనే సంకేతాలను టైటిల్స్ ద్వారానే దర్శకులు హింట్0 ఇచ్చేశారు.
నేటి తరం ప్రేక్షకులు సుదీర్ఘమైన పేర్ల కంటే కూడా గుర్తుంచుకోవడానికి వీలుగా ఉండే క్యాచీ టైటిళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో హ్యాష్‌ట్యాగ్‌లు క్రియేట్ చేయడానికి, ప్రచార చిత్రాలకు ఈ తరహా చిన్న టైటిళ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ వ్యూహంతోనే నిర్మాతలు, దర్శకులు మునుపటి కంటే భిన్నంగా రెండు అక్షరాల పేర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
`కాకా` తో చిరంజీవి....`దాదా`తో బాలయ్య...`రాకా`తో బన్నీ ఇప్పటికే పట్టాలెక్కేసిన సంగతి తెలిసిందే. మూడు సినిమా సినిమా షూటింగ్ లు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ వరుసలో ముందుగా బన్నీ-అట్లీ అండ్ కో.. తమ సైన్స్ ఫిక్షన్ కథకు `రాకా`గా ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు చిరంజీవి అండ్ కో `కాకా` గా ఫిక్స్ అయ్యారు. తాజాగా నటసింహ బాలయ్య-గోపీచంద్ మలినేని అండ్ కో `దాదా`గా ఫిక్స్ అయ్యారు.మరి బాక్సాఫీస్ వద్ద ఈ `కాకా`, `దాదా`, `రాకా`ల హవా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అభిమాన కథానాయకులు పవర్‌బఫుల్ టైటిళ్లతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు సినిమాల నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్లు, గ్లింప్స్‌లు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచాయి.
