ఇలాగైతే ఐటం భామల పరిస్థితి ఏంటి?
ఎక్కువగా బాలీవుడ్ నుంచే ఐటం గాళ్స్ ని దించేవారు. కానీ ఇప్పుడా సన్నివేశం అన్ని సినిమాల్లో కనిపించలేదు. చాలా సినిమాల శైలి మారిందిప్పుడు. గ్లామర్ సన్నివేశాలకు..పాటలకు ప్రాధాన్యత తగ్గింది.
By: Srikanth Kontham | 8 Jan 2026 11:00 AM ISTఒకప్పుడు సినిమా అంటే? అందులో కచ్చితంగా ఓ ఐటం పాట ఉండాల్సిందే. ఆ పాట కోసం ప్రత్యేకంగాఐటం పాటల్లో పేరున్న స్పెషలిస్ట్ ను రంగంలోకి దించేవారు. పారితోషికం ఆఫర్ చేయడంలో ఎంత మాత్రం రాజీ పడేవారు కాదు. కోట్ల రూపాయలు గుమ్మరించేవారు. ఎంతో రిచ్ గా సెట్లు వేసి ఆపాట షూట్ చేసేవారు. దీంతో ఐటం భామలకు డిమాండ్ అలాగే ఉండేది. ఎక్కువగా బాలీవుడ్ నుంచే ఐటం గాళ్స్ ని దించేవారు. కానీ ఇప్పుడా సన్నివేశం అన్ని సినిమాల్లో కనిపించలేదు. చాలా సినిమాల శైలి మారిందిప్పుడు. గ్లామర్ సన్నివేశాలకు..పాటలకు ప్రాధాన్యత తగ్గింది.
ఐటం పాటలు అవసరమైతేనే పెడుతున్నారు. లేదంటే? అనవసరమైన ఖర్చుగా భావించి వాటిని స్కిప్ కొడుతున్నారు. ఒకవేళ ఐటం సాంగ్ పెట్టాలనుకున్నా? ఐటం గాళ్ కోసం పెద్దగా సెర్చ్ చేయడం లేదు. తమ సినిమాల్లో నటిస్తోన్న హీరోయిన్లనే ఆ పాటల్లో భాగం చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన `థామా` లో రష్మికా మందన్నా స్పెషల్ గా తోనూ అలరించింది. అందులో అమ్మడు హీరోయిన్ అయినా? ఐటం పాట కోసం ప్రత్యేకంగా మరో నటిని తీసుకోలేదు. రష్మికాతోనే ఆ పాటను చుట్టేసారు. రష్మిక ఇమేజ్ తో పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రష్మికా మందన్నా బాలీవుడ్ డెబ్యూ `గుడ్ బై` లో కూడా నేషనల్ క్రష్ స్పెషల్ సాంగ్ తో అలరించింది. `స్త్రీ 2` లో శ్రద్దా కపూర్ మెయిన్ లీడ్ అయినా? స్పెషల్ సాంగ్ కోసం శ్రద్దా కపూర్ నర్తకిగానూ మారింది. `బేడియా` చిత్రంలో కృతిసనన్ కూడా డ్యూయెల్ రోల్ పోషించింది. హీరోయిన్ గా నటిస్తూనే ఐటం భామగానూ అలరించింది. తేజ సజ్జా హీరోగా నటించిన `మిరాయ్` సినిమాలో రితికా నాయక్ హీరోయిన్. కానీ అదే సినిమాలో వైబ్ ఉంది సాంగ్ కోసం అమ్మడు స్పెషల్ బ్యూటీగా మారింది. తాజాగా రిలీజ్ అవుతున్న `ది రాజాసాబ్` సినిమాలో రిద్దీ కుమార్ కూడా ఐటం పాటలో అలరిస్తుంది.
ఇందులో అమ్మడు ఓ పాత్రలో కనిపించనుంది. ఆ పాత్రతో పాటు అదనంగా స్పెషల్ సాంగ్ లోనూ కనిపించనుంది. ఇలా చేయడం వల్ల నిర్మాతకు కొంత డబ్బు ఆదా కూడా అవుతోంది. సినిమా ప్రచార శైలి మారిందిప్పుడు. అవస రమైతే? డైరెక్టర్లు...హీరోలే యాంకర్లగా, హోస్టులుగా మారిపోతున్నారు. ఆ ప్రభావం యాంకర్ల ఉఫాదిపై కోల్పోవడం పడుతోంది. పెద్ద సినిమాలు ప్రచార సమయంలో? అందులో నటించిన నటీనటులంతా ఒకే గ్రూప్ గా ఏర్పడి సినిమాను ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కారణంగా యాంకర్ కు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ నిర్మాతకు తగ్గుతుంది.
