దేశంలో ప్రంట్ రన్నర్ టాలీవుడ్డే!
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోలే దిగొచ్చి టాలీవుడ్ నటులతో కలిసి పని చేస్తున్నారు.
By: Srikanth Kontham | 6 Oct 2025 5:00 PM ISTభారతీయ చిత్ర పరిశ్రమల్లో అగ్ర స్థానం ఏ పరిశ్రమది అంటే? ఇప్పుడు అంతా చెప్పేది..వెలెత్తి చూపించేది టాలీవుడ్ వైపే. అందులో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు సత్తా చాటడంతో ఈ గుర్తింపు దక్కింది. అప్పటి వరకూ నెంబర్ వన్ అంటే బాలీవుడ్ పేరు చెప్పేవారు. ఇప్పుడా స్థానం కోల్పోయి రెండవ స్థానంలో బాలీవుడ్ కొనసాగుతుంది? అన్నది కాదనలేని నిజం. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్', 'కార్తికేయ-2', 'హనుమాన్', 'పుష్ప' ప్రాంచైజీ లాంటి సక్సెస్ లతో టాలీవుడ్ కి ఈ స్థానం దక్కిందన్నది అందరికీ తెలిసిన వాస్తవం.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోలే దిగొచ్చి టాలీవుడ్ నటులతో కలిసి పని చేస్తున్నారు. తెలుగు దర్శకులతో పని చేయాలని అక్కడ స్టార్స్ అంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకన్నా టాలీవుడ్ సక్సెస్ అయిందని చెప్పడానికి మరో కారణం అవసరం లేదు. తాజాగా ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ రవి. కె. చంద్రన్ కూడా ఇదే విషయాన్ని గంటా పధంగా చెప్పారు. తెలుగు సినిమా..ఇక్కడి కథల గురించి మీరేం చెబుతారంటే? ఆయన నొట వచ్చిన సమాధానమది.
టాలీవుడ్ లో వచ్చిన మార్పులివన్నీ:
తెలుగు సినిమా అంటే పాత రోజుల్లో డ్రామా, యాక్షన్ పాటల గురించి చెప్పుకునేవారన్నారు. ఇప్పుడు మూలాల్లోకి వెళ్లి కథలు గొప్పగా చెబుతున్నారు. ఎంతో విశ్లేషణ కనిపిస్తుంది. ప్రయోగాలకు ఏమాత్రం వెనుకడగు వేయడం లేదు. టాలీవుడ్ లో ఇంత వరకూ చూడనది ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి దేశంలో ప్రంట్ రన్నర్ ఎవరు. అంటే తెలుగు సినిమా అని కచ్చితంగా చెప్పాలన్నారు. `టాలీవుడ్ ఇప్పుడు భారతీయ సినిమానే ప్రభావితం చేసింది. మూలా లున్న కథలు, పీరియాడిక్ కథలు విరివిగా చేస్తున్నారన్నారు
పవన్ తో రెండు..మహేష్ ఒకటి:
యువ దర్శకుల కథలు, వాళ్ల ఆలోచనా విధానం ఎంతో బాగుందన్నారు. కొత్త వాళ్లకి మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు. ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా `ఓజీ`కి ఈయనే సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. అంతకు ముందు పవన్ నటించిన మరో చిత్రం `భీమ్లా నాయక్` కి కూడా పని చేసారు. అలా పవన్ తోనూ రవి.కె చంద్రన్ కు మంచి బాండింగ్ ఏర్పడింది. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగులో రవి.కె ప్రయాణం మొదలైంది. సినిమాటోగ్రాఫర్ గా రవి.కె. చంద్రన్ కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఎన్నో బాలీవుడ్ సినినమాలకు పనిచేసిన టెక్నీషియన్ ఈయన.
