వన్ నేనొక్కడినే, రంగస్థలం, దసర మూవీస్ లో ఫస్ట్ సీన్ లోనే సినిమా స్టోరీ చెప్పేశారు...ఈ డీటెయిల్ గమనించారా?
అవి కొన్నిసార్లు వర్కౌట్ అయితే మరి కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. నిజానికి కొంతమంది దర్శకులు సినిమా మీద పాషన్ తో సినిమాలు చేస్తూ ఉంటారు.
By: Gopi Velupala | 30 Sept 2026 11:35 AM ISTప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అది లేకపోతే దర్శకులు హీరోలు సినిమాని చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రతి సినిమాలో దర్శకుడు కొత్తగా ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అవి కొన్నిసార్లు వర్కౌట్ అయితే మరి కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. నిజానికి కొంతమంది దర్శకులు సినిమా మీద పాషన్ తో సినిమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ రైటప్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంటుంది. ప్రతి సీన్ ను పర్ఫెక్ట్ గా రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలావరకు సక్సెస్ లను సాధిస్తుంటారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం మొదటి సీన్ లోనే సినిమా మొత్తంలో ఏం జరగబోతుందనేది ఆ ఒక్క సీన్ లో చూపిస్తూ ఉంటారు. అలాంటి దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి సినిమాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన 'వన్ నేనొక్కడినే', 'రంగస్థలం' సినిమాల్లో చాలా మైక్రో విజువల్ డిటెలింగ్ ను చూపించారు. కొన్ని క్లూ లను మనకు దర్శకుడు ముందుగానే ఇచ్చేసి ప్రేక్షకులు దానిని పట్టుకుంటారా లేదా అనే ఒక సవాలైతే విసిరాడు. ఇక అలాగే దసర సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీకాంత్ ఓదెల సైతం ఈ సినిమాలో మొదటి సీన్ తోనే మూవీలో ఏం జరగబోతుందనేది క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఆ సీన్స్ ఏంటి వాళ్లు అలా ఆలోచించి రాయడానికి గల కారణం ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...
వన్ నేనొక్కడినే
ఈ మూవీని సుకుమార్ చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని చేశాడు. ఈ సినిమాలోని పాయింట్ చిన్నదే అయినప్పటికీ దానిని సైకలాజికల్ గా చెప్పాలనే ఉద్దేశ్యంతో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమాను ప్రజెంట్ చేశాడు. కానీ అది అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించలేదు. నిజానికి ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ లో మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన గౌతమ్ కృష్ణ పరిగెడుతూ ఉంటాడు. అతని చేతిలో ఉన్న టెడ్డి బేర్ కింద పడిపోతుంది. ఇక అతన్ని వెంటాడుతూ వచ్చిన రౌడీల్లో ఇద్దరు ఆ టెడ్డి బేర్ ను మధ్యలో కాలేసి తొక్కుతారు. ఒకరు మాత్రం చివరన కొంచెం తొక్కుతాడు. దీని అర్థం ఏంటంటే సినిమా స్టార్టింగ్ లోనే ఆ ముగ్గురిలో ఇద్దరు గౌతమ్ ను చంపడానికి వస్తుంటే ఒకరు మాత్రం తనని కాపాడడానికి వస్తున్నారనేది మనకు ముందుగానే దర్శకుడు చెప్పేశాడు. అయితే ఈ సినిమా స్టార్టింగ్ లో వాళ్ళు ముగ్గురూ అతన్ని చంపడానికే వస్తున్నారని మనం అనుకుంటాం కానీ సినిమా ముందుకెళ్తున్న కొద్ది ఒక క్యారెక్టర్ అతన్ని సేవ్ చేయడానికి వచ్చాడనే విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సుకుమార్ సినిమాలోని మేజర్ సీన్స్ గురించి మొదటి సీన్ లోనే డిస్కస్ చేశాడు మనకు ఒక క్లూ ఇచ్చాడు. అదొక బ్రిలియంట్ రైటింగ్ అనే చెప్పాలి...
రంగస్థలం
ఇక రంగస్థలం సినిమా విషయానికి వస్తే ఇందులో రామ్ చరణ్ 'చిట్టిబాబు' గా చెవిటి వాడి పాత్రలో కనిపించాడు. మొదటి సీన్ లో రామ్ చరణ్ కనిపించినప్పుడే అతనికి ఎదురుగా కమెడియన్ సత్య సైకిల్ మీద వెళ్తూ ఏదో బూతు మాట అంటాడు. చిట్టిబాబు చెవిటివాడు అయినప్పటికి వాళ్ళు మాట్లాడిన లిప్స్ సింక్ ను బట్టి సత్య ఏం మాట్లాడాడో తెలుసుకొని అతన్ని పిలిచి మరి కొడతాడు. చిట్టిబాబు లిప్స్ ను బట్టి మాటలు అర్థం చేసుకోగలడు అనేది మనకు ముందుగానే ఎస్టాబ్లిష్ చేశాడు. కాబట్టి చివర్లో శ్రీమన్నారాయణ అనే వ్యక్తి చిట్టిబాబు వాళ్ళ అన్నయ్యను చంపేశాడు అనేది కూడా లిప్ సింక్ ద్వారానే కనిపెట్టగలిగాడు. మొత్తానికైతే సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ అనేది భారీగా పేలడానికి అది చాలావరకు హెల్ప్ అయింది. ఇక సినిమా మొత్తం దానిమీదనే డిపెండ్ అయి ఉంది. కాబట్టి మొదటి సీన్ లోనే లిప్ సింక్ ద్వారా మాటలను కనిపెట్టిన హీరో చివర్లో ఇలాంటిదేదో పట్టుకుబోతున్నాడు అనేది ప్రేక్షకులకు ముందుగానే ఎస్టాబ్లిష్ చేసి చూపించాడు...
దసర
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కించిన దసర సినిమా సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీలో వెన్నెల చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పక్కన బతుకమ్మ ను తీసుకొని నడుచుకుంటూ వస్తుంటుంది. అప్పుడే ధరణి ఆమెను చూస్తూ అలాగే ఉండిపోతాడు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వెన్నెల బతుకమ్మ మీద ఉన్న దీపాన్ని ఊదుతుంది దాంతో అది ఆరిపోతుంది. అప్పుడు వెన్నెల వాళ్ళ అమ్మ ఆమెను తిట్టి పక్కనే ఉన్న ధరణి ని పిలిచి అగ్గిపెట్టి ఇచ్చి ఆ దీపం వెలిగించమంటుంది ధరణి ఆ దీపాన్ని వెలిగిస్తాడు. ఇందులో ఉన్న డీటేలింగ్ ను మనం అర్థం చేసుకున్నట్లయితే సినిమా ముందుకెళ్లే కొద్ది వెన్నెల సూరి ని పెళ్లి చేసుకుంటుంది. ఇక ఇంటర్వెల్ టైమ్ లో సూరి చనిపోవడం తో ధరణి వెన్నెల మెడలో తాళి కడతాడు. వెన్నెల భర్త చనిపోతే ధరణి తనను పెళ్లి చేసుకొని ఆమె జీవితానికి ఒక అర్ధాన్ని ఇస్తాడు అనేది మనకు ఆ దీపం వెలిగించే సన్నివేశంలోనే క్లారిటీ ఇచ్చేశాడు... ఇలాంటి రైటింగ్ తో సినిమాను ముందుకు తీసుకెళ్తే ప్రేక్షకుడు వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు దర్శకుడిలో ఎంత డెప్త్ ఉందో అర్థమవుతుంది...
