Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హీరోయిన్స్!

ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో వెండితెర మీదే కాకుండా డిజిటల్ ప్రపంచంలోనూ హవా నడిపించడం ట్రెండ్‌గా మారింది.

By:  Srikanth Kontham   |   31 July 2026 11:00 PM IST
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హీరోయిన్స్!
X

పరిశ్రమలో విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా కొందరు తారలు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో వెండితెర మీదే కాకుండా డిజిటల్ ప్రపంచంలోనూ హవా నడిపించడం ట్రెండ్‌గా మారింది. మృణాల్ ఠాకూర్, శృతి హాసన్, శ్రీలీల వంటి నాయికలు త‌మ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్నారు. గ్లామరస్ లుక్స్, ఎయిర్‌పోర్ట్ విజిట్స్, వర్కౌట్ వీడియోలతో డిజిటల్ స్పేస్‌ను ముద్దుగుమ్మలు ఏలుతున్నారు.

వెండితెరపై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోయినా? ఈ భామల క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఒకప్పుడు తారల ఇమేజ్ వారి సినిమా హిట్స్, ఫ్లాప్స్‌పై మాత్రమే ఆధారపడి ఉండేది. కానీ నేడు సోషల్ మీడియా అల్గారిథమ్స్, ఫ్యాన్ పేజీల హవా నడుస్తున్న తరుణంలో నిరంతరం కంటెంట్ అందిస్తూ అభిమా నులకు టచ్‌లో ఉంటున్నారు. తమదైన స్టైల్ స్టేట్‌మెంట్స్, గ్లామర్ అప్పీల్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను కట్టి పడేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు త‌గ్గినా? ఈ ముద్దుగుమ్మలు బాలీవుడ్ ..ఇతర ఇండస్ట్రీల వైపు దృష్టి సారిస్తున్నారు. గ్లామర్ రోల్స్, సోషల్ మీడియా రీల్స్, ఫ్యాషన్ ఫోటోషూట్ల ద్వారా హిందీ చిత్రసీమలోనూ తమ ఉనికిని చాటుకుంటున్నారు.

ఇండస్ట్రీల సరిహద్దులను చెరిపేస్తూ పాన్-ఇండియా స్థాయిలో బ్రాండ్ వాల్యూను పెంచుకునే వ్యూహంలో సక్సెస్ అవుతున్నారు. ఈ మార్పు వారి కెరీర్‌కు డిజిటల్ రూపంలో సరికొత్త మైలేజీని ఇస్తోంది. ఈ భామలకు సంబంధించిన ప్ర‌తీ విష‌యం నెట్టింట అంతే వైరల్ అవుతుంది. ఉదయం జిమ్ వర్కౌట్స్ నుండి ఎయిర్‌పోర్ట్ లుక్స్ వరకు ప్రతి కదలికను మీడియా ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తోంది. ముంబై పాపరాజీ కల్చర్‌కు ఈ భామలు హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు. ఫోటోషూట్లు, క్యాజువల్ అవుటింగ్‌లు ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధిస్తున్నాయి.

సినిమాల పరంగా బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నా? సోషల్ మీడియా మార్కెట్‌లో నటీమణుల బ్రాండ్ వాల్యూ మాత్రం పడిపోలేదు. ప్రముఖ బ్రాండ్‌లకు ఎండార్స్‌మెంట్లు చేస్తూ భారీ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి. సినిమా హిట్‌తో వచ్చే పాపులారిటీ కంటే డిజిటల్ మీడియా ద్వారా హైలైట్‌లో ఉండటమే నేటి ట్రెండ్‌లో అసలైన విజయంగా మారుతోంది. ఈ మార్కెటింగ్ వ్యూహం వరుస ఆఫర్లను తెచ్చిపెడుతోంది. గ్లామర్ ..పబ్లిక్ రిలేషన్స్ అనేది నేటి సినిమా రంగంలో అత్యంత కీలకమైన భాగమైంది. కేవలం నటనతోనే కాకుండా సోషల్ మీడియా ప్రెజెన్స్‌తోనూ స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవచ్చని భామలు నిరూపిస్తున్నారు. వెండితెర ఫలితాలను పక్కన పెట్టి డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్న తారల జోరు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.