వీళ్లు క్లిక్ అయితే కష్టాలు తీరినట్లే!
టాలీవుడ్ కి ఎంత మంది హీరోయిన్లు దిగుమతి అయినా కొరత కనిపిస్తూనే ఉంటుంది. ఫాంలో ఉన్న భామలంతా టాలీవుడ్ లో పార్ట్ టైమ్ గా పని చేయడంతో మరింత టైట్ గా కనిపిస్తుంది.
By: Srikanth Kontham | 3 Sept 2025 9:15 AM ISTటాలీవుడ్ కి ఎంత మంది హీరోయిన్లు దిగుమతి అయినా కొరత కనిపిస్తూనే ఉంటుంది. ఫాంలో ఉన్న భామలంతా టాలీవుడ్ లో పార్ట్ టైమ్ గా పని చేయడంతో మరింత టైట్ గా కనిపిస్తుంది. సమంతకు అవకాశాలు వచ్చినా నటించడం లేదు. రష్మికా మందన్నా హిందీ అంటూ అక్కడే ఫోకస్ చేస్తోంది. కీర్తి సురేష్ కూడా నార్త్ పైనే ఆసక్తిగా ఉంది. అనుష్క కథలు బాగా నచ్చితే గానీ కనెక్ట్ అవ్వడం లేదు. శ్రుతి హాసన్, పూజాహెగ్డే లాంటి వారు పరిమితంగానే తెరపై కనిపిస్తున్నారు. నటించాలని ఉన్నా? దర్శక, నిర్మాతలు వాళ్ల వైపు చూడని పరిస్థితి.
సక్సెస్ తో వచ్చేది ఎంత మంది:
ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో హీరోయిన్లు కొరత కొట్టొచ్చినట్లే ఉంది. దీంతో ఇండస్ట్రీ కొత్త భామలకంటే ఒకటి రెండు సినిమాలు చేసినా వారు లీడ్ లోకి వస్తే బాగుండని ఆశపడుతోంది. అందులో భాగ్య శ్రీ బోర్సే, జాన్వీ కపూర్, రుక్మిణీ వసంత్, ఇమ్మాన్వీ ఇస్మైల్, కయాదు లోహార్, మాళవిక మోహన్ లాంటి వారు పుల్ ఫాంలోకి వస్తే బాగుంటుందని పరిశ్రమ ఆశీస్తోంది. భాగ్య శ్రీ బోర్సే మంచి పెర్పార్మర్ అయినా అమ్మడికి ఇంకా సక్సస్ పడలేదు. అగ్ర తారలతో అవకాశాలు వస్తున్నా? వైఫల్యం వెనక్కి నెట్టుతోంది.
సక్సెస్ తోనే బిజీ అయ్యే ఛాన్స్:
అదే సక్సెస్ ట్రాక్ లో ఉంటే స్టార్ హీరోలంతా ఆమెకే ఓటు వేసేవారు. జాన్వీకపూర్ `దేవర`తో లాంచ్ అయినా? లాభం లేకుండా పోయింది. దీంతో `పెద్ది`తో నైనా ఫాంలోకి వస్తుందని పరిశ్రమ ఆశీస్తుంది. జాన్వీ సక్సెస్ అయితే ఓ నలుగురైదుగురు భామల అవకాశాల వరకూ సరిపెట్టగలదు. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తోంది. డ్రాగన్, టాక్సిక్, కాంతార చాప్టర్ వన్ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఇవి సక్సెస్ అయితే రుక్మిణీ వేగాన్ని ఆపడం కష్టమే. అలాగే `పౌజీ`తో పాకిస్తాన్ బ్యూటీ ఇమ్మాన్వీ ఇస్మైల్ పాన్ ఇండియాలో పరిచయమవుతుంది.
యవ నాయికలకు మంచి భవిష్యత్:
ట్యాలెంటెడ్ బ్యూటీ. మంచి డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ బ్యూటీ సక్సెస్ అయితే చాలా మంది స్టార్ హీరోలతో పాటు టైర్ 2 హీరోలకు మంచి ఆప్షన్ గా నిలుస్తుంది. డ్రాగన్ బ్యూటీ కయాదు లోహార్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సక్సెస్ తో ఫాంలోకి రాగలిగితే యంగ్ హీరోలకు మంచి ఆప్షన్ గా నిలు స్తుంది. టైర్-2, టైర్ -3 హీరోలకు అందుబాటులో ఉంటుంది. మరో మాలీవుడ్ నటి మాళవిక మోహనన్ లాంచింగ్ కి ముందే తెలుగింట ఫేమస్ అయింది. `రాజాసాబ్` తో లాంచ్ అవుతుంది. పెర్పార్మర్ అనిపించుకుంటే అవకాశాలకు కొదవుడదు. వీళ్లంతా సక్సెస్ అందుకుంటే? పరిశ్రమ మంచి అవకాశాలు కల్పిస్తుంది.
