Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ మూవీస్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం ‘పోకిరి’. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఇలియానా హీరోయిన్‌గా నటించి టాలీవుడ్ టాప్ క్లాస్ బ్యూటీ అయిపోయింది.

By:  Madhu Reddy   |   18 Jun 2026 2:17 PM IST
సూపర్ హిట్ మూవీస్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్స్!
X

సినిమా ఇండస్ట్రీలో ఒకరి అదృష్టం మరొకరిని వరిస్తుంటుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు వివిధ కారణాల చేత డేట్స్ సర్దుబాటు కాకపోవడం, కథ నచ్చకపోవడం లేదా వ్యక్తిగత కారణాలు వదులుకున్న ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆ సినిమాలు గనుక ఆ హీరోయిన్లు చేసి ఉంటే వారి కెరీర్ రేంజ్ ఇంకోలా ఉండేదేమో! మన ముద్దుగుమ్మలు మిస్ చేసుకున్న ఆ క్రేజీ సూపర్ హిట్ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

‘పుష్ప’ శ్రీవల్లిని వదులుకున్న సమంత:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ రేంజ్‌కు వెళ్లడానికి కారణమైన సినిమా ‘పుష్ప: ది రైజ్’. ఈ పాన్-ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేసిన 'శ్రీవల్లి' పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అయితే, ఈ రోల్ కోసం డైరెక్టర్ మొదట సమంత ను అనుకున్నాడుట, కానీ కొన్ని కారణాల వల్ల సామ్ దీనిని తిరస్కరించడంతో ఆ అవకాశం రష్మికను వరించి, ఆమె కెరీర్‌ను మార్చేసింది. అయితే ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ తో అలరించింది.

‘పోకిరి’ ఇలియానా ప్లేస్‌లో బాలీవుడ్ భామలు:

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం ‘పోకిరి’. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఇలియానా హీరోయిన్‌గా నటించి టాలీవుడ్ టాప్ క్లాస్ బ్యూటీ అయిపోయింది. నిజానికి, ఈ రోల్ కోసం మొదట 'సూపర్' ఫేమ్ అయేషా టాకియా, కంగనా రనౌత్ లను అనుకున్నారు. కానీ వారు రిజెక్ట్ చేయడంతో ఆ గోల్డెన్ ఛాన్స్ ఇలియానాకు దక్కింది.

‘అరుంధతి’ జేజమ్మగా అనుష్క వద్దు అనుకున్నదెవరు?:

అనుష్క శెట్టిని టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా నిలబెట్టిన సినిమా ‘అరుంధతి’. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ గ్రాఫిక్ వండర్ అప్పట్లో ఇండ్రస్ట్రీ లో ఒక మైలురాయి. అయితే ఈ జేజమ్మ క్యారెక్టర్ కోసం మొదట మరో స్టార్ హీరోయిన్‌ను సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసిందనే ప్రచారం ఫిలింనగర్ లో గట్టిగా ఉంది. ఆ తర్వాత అనుష్క ఈ రోల్ చేసి చరిత్ర సృష్టించింది.

ఆ మూవీలో నివేదా ప్లేస్‌లో సమంత?:

నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ నటించిన అందమైన ప్రేమకథా చిత్రం నిన్ను కోరి’. ఈ సూపర్ హిట్ మూవీలో హీరోయిన్ పాత్రకు మొదట సమంతను అనుకున్నారట. డైరెక్టర్ కథ సామ్‌కు నచ్చినా, ఇప్పటికే ఇతర సినిమాలకు కమిట్ అవ్వడంతో డేట్స్ లేక ఈ ప్రాజెక్ట్‌ను వదులుకోవాల్సి వచ్చింది. ఇక దాంతో ఆ ఛాన్స్ నివేదాకు వెళ్లి మంచి హిట్ అందుకుంది.

కథలు, అవకాశాలు అనేవి ఎప్పుడు ఎవరిని వరిస్తాయో ఎవరూ ఊహించలేరు. ఒకరు తిరస్కరించిన సినిమా మరొకరి జీవితాన్ని మార్చేసిందని చెప్పడానికి ఈ సూపర్ హిట్ సినిమాలే ఉదాహరణ. ఇక టాలీవుడ్ భామలు మిస్ చేసుకున్న ఈ సినిమాల లిస్ట్ చూశారుగా.. మరి వీరిలో ఎవరు ఆ సినిమా చేసి ఉంటే బాగుండేదని మీకు అనిపించింది?