ముగ్గురు భామలు.. మెల్లగా తగ్గుతున్న లెక్కలు..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త అందాలు పరిచయమవుతూనే ఉంటాయి. అయితే తొలి ప్రయత్నంలోనే కొందరు బ్యూటీలు క్లిక్ అయిపోతుంటారు.
By: M Prashanth | 15 Nov 2025 9:00 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త అందాలు పరిచయమవుతూనే ఉంటాయి. అయితే తొలి ప్రయత్నంలోనే కొందరు బ్యూటీలు క్లిక్ అయిపోతుంటారు. మరికొందరు మొదట్లో తడబడ్డా.. ఆ తర్వాత హిట్స్ సొంతం చేసుకుంటారు. ఇంకొందరు స్టార్టింగ్ లో అలరించినా.. అనంతరం అనుకున్న స్థాయిలో అలరించలేకపోతుంటారు.
అలా జరగడం వల్ల వారి మార్కెట్ కచ్చితంగా తగ్గిపోతూ ఉంటోంది. కమ్ బ్యాక్ ఇస్తే పర్లేదు కానీ.. లేకుంటే వారు నటించిన సినిమాలు క్లిక్ అవ్వకపోతే.. మార్కెట్ తగ్గడం కచ్చితం. అప్పుడు వారి రెమ్యూనరేషన్ లెక్కలు కూడా ఛేంజ్ అవుతుంటాయి. మొదట్లో కాస్త ఎక్కువగా అందుకున్నా.. ఆ తర్వాత మెల్లగా డిమాండ్ తగ్గిపోతుంటోంది.
ఇప్పుడు ఆ కోవకే చెందుతారు యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, శ్రీలీల, భాగ్యశ్రీ బొర్సే. ప్రస్తుతం వారి రెమ్యూనరేషన్ లెక్కలు తగ్గుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం వారి మూవీ ఫలితాలే. ఇటీవల వారు ముగ్గురు పలు సినిమాల్లో నటించినా.. అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. భారీ హోప్స్ పెట్టుకుంటున్నా.. వారికి నిరాశ మిగులుతుంది.
ఉప్పెన మూవీతో తెలుగులోకి వచ్చిన కృతి శెట్టి.. డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. భారీ విజయం సాధించడంతో ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ హిట్లు మాత్రం అందడం లేదు. రిలీజ్ కు ముందు హైప్ క్రియేట్ అవుతున్నా.. ఆ తర్వాత సీన్ మారిపోతుంది. అయితే రూ.కోటి వరకు పారితోషికం తీసుకున్న అమ్మడికి ఇప్పుడు అంత మొత్తంలో ఇచ్చేందుకు సిద్ధంగా లేరట.
అదే సమయంలో పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి శ్రీలీల.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. అనేక ఆఫర్స్ వచ్చాయి. వాటిని ఓకే చేసిన నటించిన ఆమెకు.. గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు అన్ని చిత్రాలు ఫ్లాప్ గా మారాయి. రీసెంట్ గా మాస్ జాతర మూవీతో మరో ఫ్లాప్ ఖాతాలో చేరింది. ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్నా.. రెమ్యూనరేషన్ తగ్గినట్లు టాక్.
ఇక మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లోకి వచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా అందుకోలేదు. అందం, అభినయం సమపాళ్ళలో ఉన్నా.. విజయం వరించడం లేదు. వరుసగా మూడు డిజాస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తున్న బ్యూటీ.. హిట్స్ కోసం వెయిట్ చేస్తోంది. ఏదేమైనా మొదట్లో ఎలివేషన్స్ ఇచ్చినా.. ఇప్పుడు కలిసి రావడం లేదని చెప్పాలి. దీంతో ఆమె పారితోషికం కూడా తగ్గిందని వినికిడి.
