ఆ ముగ్గురు భామలు కంబ్యాక్!
అగ్ర తారలుగా వెలిగిన కీర్తి సురేష్, సమంత, తమన్నా కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు.
By: Srikanth Kontham | 25 March 2026 8:15 AM ISTఅగ్ర తారలుగా వెలిగిన కీర్తి సురేష్, సమంత, తమన్నా కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, కొత్త హీరోయిన్ల రాకతో పెరిగిన పోటీ మధ్య ఈ ముగ్గురు భామలు కంబ్యాక్ చిత్రాలతో మళ్ళీ పట్టు సాధించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ త్రయం ఎంచుకున్న ప్రాజెక్టులు చూస్తుంటే? గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథాబలం ఉన్న పాత్రల ద్వారా ఉనికిని చాటుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ మల్టీ-టాస్కింగ్ స్ట్రాటజీని అనుసరిస్తోంది. విజయ్ దేవరకొండతో నటిస్తోన్న రౌడీ జనార్ధన , వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే సంక్రాంతి చిత్రం అమ్మడికి అత్యంత కీలకం.
అనీల్ రావిపూడి సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎంతో వినోదాత్మకంగా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాయి. కీర్తి తన సహజ సిద్ధమైన నటనతో మెప్పించగలిగితే, కమర్షియల్ హీరోయిన్‌గా అమ్మడు మళ్ళీ టాప్ లీగ్‌లోకి దూసుకుపోవడం ఖాయం. కొత్త అవకాశాలు మళ్లీ క్యూ కడుతాయి. స్టార్ హీరోయిన్ సమంత రూటును పూర్తిగా మార్చేసింది.
అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో కొంత విరామం తీసుకున్న సామ్ తన సొంత బ్యానర్‌లో మా ఇంటి బంగారం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతోంది. ఇది ఆమెకు మేక్ ఆర్ బ్రేక్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం గనుక `ఓ బేబీ' తరహాలో హిట్ సాధిస్తే సమంత హీరోయిన్‌గానే కాక పవర్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుంది.
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ప్రయాణం విభిన్నంగా సాగుతోంది. రవితేజ - శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న `ఇరుముడి`లో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తోంది. సాధారణంగా శివ నిర్వాణ సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక ఎమోషనల్ వెయిటేజ్ ఉంటుంది. తమన్నా తన అనుభవంతో ఈ పాత్రకు న్యాయం చేయగలిగితే సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. సీనియర్ హీరోల సరసన ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్న తమన్నా నిలవడానికి ఈ సినిమా ఒక బలమైన పునాది కానుంది.
అయితే ఈ ముగ్గురు మళ్ళీ నిలదొక్కుకుంటారా? అంటే? వారు ఎంచుకున్న కథల నేటివిటీ , కంటెంట్ పైనే ఆధా రపడి ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల హవా నడుస్తున్నప్పటికీ ఈ ముగ్గురి వద్ద ఉన్న అపారమైన అనుభవం , భారీ ఫ్యాన్ బేస్ వారికి అదనపు బలం. ముఖ్యంగా కీర్తి సురేష్ కమర్షియల్ సక్సెస్‌పై, సమంత ఎమోష నల్ కనెక్ట్, తమన్నా వెర్సటాలిటీపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకమే బయటకు తేగలగాలి 2026-27 సీజన్ ఈ ముగ్గురు భామల కంబ్యాక్ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తే, టాలీవుడ్ అగ్ర సింహాసనం కోసం మళ్ళీ ముగ్గురి మధ్య పోటీ ఉండటం ఖాయం. అభిమా నులు సైతం తమ ఫేవరెట్ హీరోయిన్లను మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లో చూడాలని ఆశిస్తున్నారు.
