Begin typing your search above and press return to search.

గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న గ్లామర్ క్వీన్స్

ప్రస్తుతం సామ్ రెండు ర‌కాల ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తుంది. న‌టి కంట నిర్మాత‌గా ప‌నిచేస్తోంది. నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన `మా ఇంటి బంగారం` మే 15న విడుదల అవుతుంది.

By:  Srikanth Kontham   |   25 April 2026 6:00 PM IST
గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న గ్లామర్ క్వీన్స్
X

చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ల స్థానం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి శుక్రవారం మారుతోన్న బాక్సాఫీస్ ఫలితాలు భవిష్యత్తును శాసిస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల కెరీర్ కీలకమైన దశలో క‌నిపిస్తుంది. పూజా హెగ్డే, శ్రీలీల, కీర్తి సురేష్, సమంత వంటి భామలు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కొంత‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 2026 సీజన్ ఫలితాలే వీరు రేసులో ఉంటారా లేదా అన్నది తేల్చనున్నాయి. టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోంది. బాలీవుడ్ ఆశలతో ఇక్కడి భారీ ప్రాజెక్టులను వదులుకోవడం ఆమె కెరీర్‌పై ప్రభావం ప‌డింది.

ప్రస్తుతం ఆమె ఆశలన్నీ తలపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం అవుతోన్న `జన నాయకుడు` పైనే ఉన్నాయి. అలాగే నాని సరసన `బ్లడీ రోమియో`లోనూ న‌టిస్తోంది. ఈ సినిమాలు కమర్షియల్‌గా క్లిక్ అయితేనే పూజాహెగ్డే మళ్ళీ టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దుల్కార్ స‌ల్మాన్ తో ఓ తెలుగు సినిమా చేస్తోంది కానీ ఆ సినిమా విజ‌యం అమ్మ‌డి కెరీర్ మార్చ‌డం క‌ష్ట‌మ‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. యంగ్ సెన్సేషన్ శ్రీలీల పరిస్థితి ప్ర‌తికూలంగానే ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు సైన్ చేయడం ఆమెకు శాపంగా మారింది.

శ్రీలీల‌ నటించిన `జూనియర్`, `రాబిన్‌హుడ్`, `మాస్ జాతర` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ డెబ్యూ `పరాశక్తి` కూడా ఫెయిల్ అవ్వడం తాజా రిలీజ్ `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా అంచనాలను అందుకోకపోవడం ఆమె కెరీర్‌ను సంక్షోభంలో నెట్టాయి. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. బాలీవుడ్ కెరీర్ పైనే సొగ‌స‌రి దృష్టంతా ఉంది. ఇక‌ సమంత కెరీర్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. కమర్షియల్ సినిమాలకు దూరమై లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు మొగ్గు చూపినా `శాకుంతలం`, `యశోద` వంటి చిత్రాలు నిరాశనే మిగిల్చాయి.

ప్రస్తుతం సామ్ రెండు ర‌కాల ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తుంది. న‌టి కంట నిర్మాత‌గా ప‌నిచేస్తోంది. నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన `మా ఇంటి బంగారం` మే 15న విడుదల అవుతుంది. ఈ సినిమా ఫలితం సమంత సోలో మార్కెట్ స్టామినాను ఈ చిత్రం నిర్ణ‌యించే అవ‌కాశం ఉంది. మంచి ఫ‌లితాలు సాధిస్తే సామ్ లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌పై మ‌రింత ఫోక‌స్ పెట్టే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం పరిశ్రమలో `హీరోయిన్ల షెల్ఫ్ లైఫ్` తగ్గిపోయింది. స్టార్ హీరోలు ప్రతి మూడు నాలుగేళ్లకు కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతున్నారు.

అందుకే సీనియర్స్, క్రేజ్ తగ్గిన హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తమను తాము రీ-ఇన్వెంట్ చేసుకోవాల్సిన అవసరం అంతే ఉంది. కథలో కీలకమైన మలుపులు ఉండే పాత్రలను ఎంచుకుంటేనే సుదీర్ఘ కాలం ఇండస్ట్రీలో కొనసాగగలరన్న‌ది కాద‌న‌లేని నిజం. అలాగే ఒక తరం హీరోయిన్ల నుండి మరో తరం హీరోయిన్లకు అధికారం బదిలీ అయ్యే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్ వంటి ఫెయిర్ ఫేసెస్ వ‌స్తోన్న తరుణంలో పాత తరం తారలు నిలదొక్కుకోవాలంటే కంటెంట్ ఉన్న సినిమాలపైనే దృష్టి పెట్టాలి.