ట్రెడిషనల్ ఇమేజ్ నుంచి బోల్డ్ పాత్రల వైపు అడుగులు వేసిన హీరోయిన్స్
ఇదే అవకాశంగా భావించిన మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి, ఏమాత్రం మొహమాటం లేకుండా బోల్డ్ పాత్రలతో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు.
By: Madhu Reddy | 30 Sept 2026 1:07 PM ISTఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒకప్పుడు హీరోయిన్ అంటే కేవలం పద్ధతిగా, చీరకట్టులో, పక్కింటి అమ్మాయిలా ఉండాలనే రూల్ ఉండేది. కానీ కాలం మారింది, ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో సెన్సార్ అడ్డంకులు తొలగిపోవడంతో, కంటెంట్ మరింత సహజంగా మరియు బోల్డ్‌గా మారుతోంది. ఇదే అవకాశంగా భావించిన మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి, ఏమాత్రం మొహమాటం లేకుండా బోల్డ్ పాత్రలతో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు. ఆ టాప్ బ్యూటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
సమంత రూత్ ప్రభు బోల్డ్ ట్రాన్స్‌ఫార్మేషన్:
ఇక 'ఏ మాయ చేసావె', 'మనం' వంటి చిత్రాలతో తెలుగులో క్యూట్ అండ్ హోమ్లీ హీరోయిన్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సమంత. అయితే కాలంతో పాటు ఆమె తన నిర్ణయాలను మార్చుకుంది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో తనలోని సరికొత్త బోల్డ్ అండ్ యాక్షన్ యాంగిల్‌ను బయటపెట్టి పాన్-ఇండియా లెవెల్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే 'పుష్ప' సినిమాలో ఆమె చేసిన "ఊ అంటావా" స్పెషల్ సాంగ్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసింది.
తమన్నా నో-కిస్ పాలసీకి గుడ్‌బై:
టాలీవుడ్‌లో 'మిల్కీ బ్యూటీ'గా పేరు తెచ్చుకున్న తమన్నా '100% లవ్', 'బాహుబలి' సినిమాలతో సుదీర్ఘ కాలం పాటు తెరపై ముద్దు సీన్లకు, నో-కిస్ పాలసీకి కట్టుబడి ఉంది. కానీ 'లస్ట్ స్టోరీస్ 2' మరియు 'జీ కర్దా' వంటి వెబ్ సిరీస్‌లలో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా హద్దులు చెరిపేస్తూ అత్యంత బోల్డ్ అండ్ లిప్‌లాక్ సీన్స్‌లో నటించి అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది.
అనుపమ పరమేశ్వరన్ రూట్ మార్పు:
సంప్రదాయబద్ధమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది అనుపమ 'ప్రేమమ్', 'అ ఆ' వంటి సినిమాలతో పద్దతిగా నటించింది. కానీ 'రౌడీ బాయ్స్' సినిమాలో మొదటిసారి లిప్‌లాక్ సీన్‌తో అందరికీ షాక్ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాలో గ్లామర్ డోస్ పెంచడమే కాకుండా, ఊహించని రేంజ్‌లో బోల్డ్ రొమాంటిక్ సీన్స్‌లో నటించి ట్రెండింగ్‌లో నిలిచింది.
ప్రియమణి డిజిటల్ వైవిధ్యం:
జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రియమణి తెలుగులో 'యమదొంగ', 'నవ వసంతం' వంటి సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించి మెప్పించింది. అయితే కాలం మారుతున్న కొద్దీ ఆమె కూడా తన రూటు మార్చింది. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో పాటు పలు ఓటీటీ ప్రాజెక్ట్‌లలో ఆమె చేసిన బోల్డ్ సన్నివేశాలు, వైవిధ్యమైన పాత్రలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.
రాశి ఖన్నా గ్లామరస్ మలుపు:
ఇక 'ఊహలు గుసగుసలాడే', 'తొలిప్రేమ' వంటి సినిమాలతో బొద్దుగా, క్యూట్ అండ్ బబ్లీ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది రాశి ఖన్నా. ఆ తర్వాత తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుంటూ అజయ్ దేవగన్ నటించిన 'రుద్ర' మరియు షాహిద్ కపూర్ నటించిన 'ఫర్జీ' వంటి వెబ్ సిరీస్‌లలో గ్లామరస్‌గా నటిస్తూనే కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కనిపించి మెప్పించింది.
ఇప్పుడు సినిమా రంగంలో హీరోయిన్ అంటే కేవలం హీరో పక్కన గ్లామర్ బొమ్మలా ఉండటం మాత్రమే కాదు. కథ డిమాండ్ చేస్తే, పాత్రకు ప్రాధాన్యత ఉంటే బోల్డ్ రోల్స్ చేయడానికి కూడా మన హీరోయిన్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా తమను తాము మలచుకుంటూ ఈ నటీమణులు దూసుకుపోవడం విశేషం.
