Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కంబ్యాక్ -కొత్త సవాళ్లు!

ఓవైపు సీనియారిటీ, మరోవైపు మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్ మధ్య స్టార్ నటీమణులు ఉనికిని కాపాడుకోవడానికి సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

By:  Srikanth Kontham   |   22 May 2026 7:00 AM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కంబ్యాక్ -కొత్త సవాళ్లు!
X

హీరోయిన్ల మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏటా సరికొత్త గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను నటనతో, అందచందాలతో దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన స్టార్ హీరోయిన్ల కెరీర్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ప్రస్తుతం సీనియర్ స్టార్ భామల తదుపరి చిత్రాల ఎంపిక, వారి కంబ్యాక్ ప్రాజెక్టులపై ఇండస్ట్రీ వర్గాలలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఓవైపు సీనియారిటీ, మరోవైపు మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్ మధ్య స్టార్ నటీమణులు ఉనికిని కాపాడుకోవడానికి సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

ఈ లీగ్‌లో అందరికంటే ముందు వరుసలో నిలుస్తారు అనుష్క‌. అమ్మ‌డు టాలీవుడ్ లో సినిమాలు త‌గ్గించినా? స్వీటీ డిమాండ్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. స‌రైన లేడీ ఓరియేంటెడ్ స్క్రిప్ట్ ప‌డితే ఒంటి చేత్తో 100 కోట్ల వ‌సూళ్లు తేగ‌ల న‌టి. కానీ ఆ ఛాన్స్ ను అమ్మ‌డు ఛాలెంజ్ గా తీసుకునే ధైర్యం చేయ‌డం లేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ ని హోల్డ్ లో పెట్టి మాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. స్వీటీ తెలుగు అభిమానుల మాత్రం అమ్మ‌డి కంబ్యాక్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు వరుస స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా, ఫిట్‌నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ ల పరిస్థితి టాలీవుడ్‌లో సందిగ్ధంలో పడింది.

ఇద్ద‌రు నటిగా వైవిధ్యమైన పాత్రలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నా? తెలుగు వెండితెరపై పక్కా కమర్షియల్ హీరోయిన్ పాత్రల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. బాలీవుడ్ ప్రాజెక్టులలో బిజీగా ఉంటూనే స్టార్స్‌గా నిలబెట్టిన సౌత్ ఇండస్ట్రీలో మళ్లీ లీడ్ రోల్స్‌తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి ఇద్దరు ముద్దుగుమ్మలు ప్లాన్ చేస్తున్నారు. అయితే సీనియర్ స్టార్ హీరోయిన్ల కంబ్యాక్ ప్రయాణం అనుకున్నంత సులువుగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ స్క్రీన్‌ను రూల్ చేయడానికి బాలీవుడ్ నుండి సరికొత్త నయా బ్యూటీలు క్యూ కడుతున్నారు.

ఇప్ప‌టికే అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ పాన్ ఇండియా స్టార్లు అంద‌ర్నీ లైన్ లో పెట్టి ఛాన్సులందుకుంటుంది. రవీనా టాండన్ కుమార్తె నయా సెన్సేషన్ రాషా థడాని కూడా టాలీవుడ్ లో లాంచ్ అవుతుంది. ఈ బ్యూటీ గ‌నుక క్లిక్ అయితే చాలా అవ‌కాశాలు వ‌శం చేసుకుంటుంది. ప్ర‌స్తుత‌ జనరేషన్ నటీమణులు గ్లామర్ పరంగా, యూత్ క్రేజ్ పరంగా సోషల్ మీడియాను ఊపేస్తుండటంతో పాత హీరోయిన్లకు గట్టి పోటీ ఎదుర వుతోంది. మారుతోన్న టాలీవుడ్ సమీకరణాల ప్రకారం ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా బడ్జెట్ ,ఫ్రెష్ కాంబినేషన్ల కోసం నయా ఇంపోర్ట్స్‌ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 90ల నాటి తరం స్టార్ హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా క్యారెక్టర్ డ్రైవెన్ పాత్రలను ఎంచుకుంటేనే ఇండస్ట్రీలో లాంగ్ రన్ లో నిలబడగలరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటనలో ఎంత అనుభవం ఉన్నా? బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ రేట్ ఉంటేనే ఇక్కడ అవకాశాలు క్యూ కడతాయి.