టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ల అస్తిత్వ పోరాటం!
అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తెలుగులో కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. `ఓదెల 2` చిత్రం తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో కొత్త ఆఫర్లు తగ్గాయి. దీంతో అమ్మడు ఫోకస్‌ను పూర్తిగా బాలీవుడ్ ప్రాజెక్టుల వైపు మళ్లించింది.
By: Srikanth Kontham | 30 May 2026 8:30 AM ISTచిత్ర పరిశ్రమలో మార్పు అనేది నిరంతర ప్రక్రియ. గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల జనరేషన్ షిఫ్ట్ చాలా వేగంగా జరుగుతుంది. టాలీవుడ్‌లో గత దశాబ్ద కాలంగా స్టార్ హోదాను అనుభవిస్తూ అగ్ర హీరోల సరసన చక్రం తిప్పిన సీనియర్ నటీమణులకు ఇప్పుడు సరికొత్త సవాల్ ఎదురవుతోంది. మమితా బైజు, రుక్మిణి వసంత, భాగ్యశ్రీ బోర్సే వంటి నవతరం భామలు వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్ కి దూసుకొస్తున్నారు. ఈ న్యూ జనరేషన్ బ్యూటీల ఎంట్రీతో పరిశ్రమను ఏలిన స్టార్ హీరోయిన్లు తమ ఉనికిని చాటుకోవడానికి.. మార్కెట్‌ను కాపాడుకోవడానికి శ్రమించాల్సి వస్తోంది. ఈ పోటీ నడుమ లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి సిద్ధమైంది సమంత.
ఈసారి అమ్మడు నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి సొంత నిర్మాణంలో విభిన్నమైన ప్రయత్నం చేస్తోంది. రచయిత రాజు నిడుమూరు అందించిన ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న `మా ఇంటి బంగారం` అనే చిత్రంతో సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా విజయం సమంత కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌కు -ఆమె ప్రొడక్షన్ హౌస్ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారబోతోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో శాసించిన `జెజమ్మ` అనుష్క శెట్టి ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఇంపాక్ట్ చూపించలేకపోతోంది. ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన `ఘాటీ` ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో వైఫల్యం చెందింది.
అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తెలుగులో కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. `ఓదెల 2` చిత్రం తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో కొత్త ఆఫర్లు తగ్గాయి. దీంతో అమ్మడు ఫోకస్‌ను పూర్తిగా బాలీవుడ్ ప్రాజెక్టుల వైపు మళ్లించింది.
ఇక టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ లక్కీ చార్మ్‌గా వెలుగు వెలిగిన పూజా హెగడే పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే మారింది. కొన్ని వివాదాలు.. పరాజయాలు కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పడిపోయేలా చేశాయి. సరైన సక్సెస్ లేకపోవడం.. దానికి తోడు కొత్త తరం నటీమణుల డిమాండ్ పెరగడంతో పూజాకు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గాయి.ఇండస్ట్రీలో మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోవాలంటే బుట్టబొమ్మకు ఇప్పుడు సాలిడ్ బ్లాక్‌బస్టర్ అవసరం ఎంతైనా ఉంది.
ఈ సీనియర్ హీరోయిన్ల అస్తిత్వ పోరాటంలోనూ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం మినహాయింపు. దశాబ్దాలు దాటినా చెరగని క్రేజ్‌తో సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్నారు నయనతార త్రిష. వయసుతో పని లేకుండా నటనతో నవతరం భామలకు పోటీగా నిలుస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలలో వరుస ఆఫర్లను దక్కించుకుం టున్నారు. ఇద్దరి కెరీర్ ప్లానింగ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మిగతా సీనియర్ నటీమణులకు భిన్నంగా సాగుతుందని చెప్పొచ్చు.
