క్రికెటర్లు అవ్వాలనుకున్నారు..కానీ హీరోలయ్యారు!
అక్కినేని అఖిల్ కి చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తి. దీంతో పెద్ద క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనుకున్నాడు.
By: Srikanth Kontham | 22 Dec 2025 8:00 AM ISTఅక్కినేని అఖిల్ కి చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తి. దీంతో పెద్ద క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనుకున్నాడు. దేశానికి తానో గొప్ప బ్యాట్స్ మెన్ గా ప్రూవ్ చేసుకోవాల నుకున్నాడు. ఈ విషయంలో డాడ్ నాగార్జున కూడా ఎంతో ఎంకరేజ్ చేసారు. తనయుడి క్రికెట్ ఫ్యాషన్ ని చిన్న వయసులోనే గమనించిన అకిల్ ని స్పోర్స్ట్ స్కూల్లో జాయిన్ చేసారు. ఆటలో మంచి ప్రావీణ్యం కూడా సంపాదించాడు. కానీ జాతీయ జట్టులో స్థానమంటే అంత సులభం కాదు. ఎంతో కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అఖిల్ సమయంలో ఆటతో పాటు రాజకీయాలు కూడా క్రికెట్ లో కీలక పాత్ర పోషించేవి. అలా అఖిల్ క్రికెట్ కు దూరమయ్యాడు. అనంతరం నటనా రంగం వైపు రావడం సక్సెస్ అవ్వడం తెలిసిందే. అలాగే శ్రీకాంత్ కూడా తన పెద్ద కుమారుడు రోషన్ ని క్రికెటర్ ని చేయాలనుకున్నాడు. కానీ అతడి కల కలగానే మిగిలిపోయింది. రోషన్ కూడా కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడాడు. కానీ అంతిమంగా తండ్రి మార్గంలో సినిమానే ఎంచుకున్నాడు. కాలేజీకి వెళ్లిన తర్వాత రోషన్ కాన్సంట్రేషన్ కూడా తగ్గింది. అక్కడ నుంచి రోషన్ మనసు సినిమాలు కోరుకుంది.
దీంతో చిన్న నాటి కల క్రికెట్ ను వదిలేసి మ్యాకప్ వేసుకున్నాడు. శ్రీకాంత్ కూడా నటుడు కావడంతో? రోషన్ కి సినిమాల్లోకి రావడం ఈజీ అయింది. అలాగే విజయ్ దేవరకొండ కూడా క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. ఈ మధ్యనే విషయం లీకైంది. ఓ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ సీక్రెట్ రివీల్ చేసాడు. అప్పటి తన పరిస్థితుల కారణంగా బ్యాట్స్ మెన్ కాలేకపోయినా? టాలీవుడ్ లో పెద్ద స్టార్ మాత్రం అయ్యాడు. ఇలా నటుడు అవ్వడం కోసం కూడా విజయ్ ఎంతో కష్టపడ్డాడు. పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు.
సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. కానీ నటుడయ్యాడు. కానీ క్రికెట్ పై అభిమానంతో ఇప్పటికీ ఇండియా ఆడే ఏ మ్యాచ్ ను మిస్ అవ్వరు. ప్రపంచంలో ఎక్కడ మ్యాచులు జరిగినా ఆ దేశం వెళ్లి ఇండియాను ఎంకరేజ్ చేయడం ఆయన ప్రత్యేకత. అదే ఫ్యాషన్ తో అప్పట్లో `వసంతం` అనే సినిమా కూడా చేసారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కాలక్రమంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఏర్పడటంతో? ఆ ఫ్యాషన్ ని ఆ రూపంలో తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం అఖిల్, రోషన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
