నితిన్, రవితేజ లిస్ట్ లో అల్లరి నరేష్ కూడా..?
టాలీవుడ్ లో ఓ పక్క యువ హీరోలేమో వరుస హిట్లతో దూసుకెళ్తుంటే ఒక సెపరేట్ ఫ్యాన్ డమ్ ఉన్న వాళ్లేమో సరైన సక్సెస్ లు లేక సతమతమవుతున్నారు.
By: Ramesh Boddu | 22 Nov 2025 10:58 AM ISTటాలీవుడ్ లో ఓ పక్క యువ హీరోలేమో వరుస హిట్లతో దూసుకెళ్తుంటే ఒక సెపరేట్ ఫ్యాన్ డమ్ ఉన్న వాళ్లేమో సరైన సక్సెస్ లు లేక సతమతమవుతున్నారు. ఈ లిస్ట్ లో చాలామంది హీరోలు ఉన్నా సరే ముఖ్యంగా ముగ్గురు హీరోలు వారి ఫ్యాన్స్ ని ఏ మాత్రం సంతృప్తి పరచే సినిమాలు అందించలేకపోతున్నారు. దశాబ్దాల కాలం నుంచి సినిమాలు చేస్తున్న ఈ హీరోలు ప్రేక్షకులను మెప్పించే కథ సెలెక్ట్ చేసుకోవడంలో తర్జన భర్జన అవుతున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు ఏంటా కథ అని ఒకసారి చూస్తే..
రవితేజ ఎనర్జీ స్పెషల్ క్రేజ్..
మాస్ మహారాజ్ రవితేజ తన ఎనర్జీతో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే ఈ మధ్య రవితేజ చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ధమాకా తర్వాత రవితేజ వరుస సినిమాలు చేస్తున్నా ఏ ఒక్కటి కూడా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు.
ఎలాంటి సినిమా చేయాలి.. ఎలాంటి కథతో రావాలి అన్న సందిగ్ధంలో రవితేజ ఉన్నాడు. నెక్స్ట్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వస్తున్నాడు రవితేజ. ఆ సినిమా అయినా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందేమో చూడాలి.
నితిన్ బ్యాడ్ లక్ కొనసాగుతూనే ఉంది.
రెండు దశాబ్దాలుగా హీరోగా చేస్తూ లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న నితిన్ కూడా మళ్లీ ఫ్లాప్ బాట పట్టాడు. భీష్మ తర్వాత నితిన్ సినిమాలన్నీ నిరాశపరుస్తూ వస్తున్నాయి. తమ్ముడు సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకోగా అది కూడా మిస్ ఫైర్ అయ్యింది. ఈ టైం లో నితిన్ తనకు ఇష్క్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ నే నమ్ముకున్నాడని తెలుస్తుంది. విక్రం తో నితిన్ ఇష్క్ 2 చేస్తాడా లేదా మరో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తారా అన్నది చూడాలి.
ఇక వీరిద్దరి బాటలోనే అల్లరి నరేష్ కూడా తన ఫ్లాప్ సినిమాలతో కెరీర్ రిస్క్ ఫేస్ లో ఉన్నాడు. రీసెంట్ గా 12 ఏ రైల్వే కాలనీ సినిమాతో వచ్చాడు అల్లరి నరేష్. ఆ సినిమా కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. నాందితో డిఫరెంట్ అటెంప్ట్ చేసిన అల్లరి నరేష్ ఆ సినిమాతో సక్సెస్ అందుకోగా ఆ తర్వాత సీరియస్ కథలు చేస్తూ వచ్చాడు కానీ అందులో ఏది సక్సెస్ అవ్వలేదు.
అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ కూడా..
12 ఏ రైల్వే కాలనీని సైలెంట్ గా పూర్తి చేసి రిలీజ్ ముందు ప్రమోషన్స్ చేసి ఈ ఫ్రైడే రిలీజ్ చేశారు. సినిమా మీద ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో 12A రైల్వే కాలనీ కూడా అల్లరి నరేష్ ని హిట్ ట్రాక్ ఎక్కించలేదు. నెక్స్ట్ అల్లరోడు ఆల్కహాల్ సినిమాతో వస్తున్నాడు. సితార బ్యానర్ లో వస్తున్న ఆ మూవీ ఏం చేస్తుందో చూడాలి.
రవితేజ, నితిన్, అల్లరి నరేష్ ఇలా ముగ్గురు హీరోలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సరైన సినిమాలతో వస్తే ఈ ముగ్గురు కచ్చితంగా మంచి సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. కానీ అది ఏ సినిమాతో అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. రాబోతున్న సినిమాలతో అయినా ఈ ముగ్గురు హీరోలు హిట్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి. వీరితో పాటు గోపీచంద్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. అతను కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలని మ్యాచో స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
