హీరోలంతా నిర్మాతలకు రిలీఫ్ ఇస్తున్నట్లేనా?
అంటే సినిమా బాగా ఆడితే హీరోకు లాభం.. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే నిర్మాతపై మొదట్లో ఉండే ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గుతుంది.
By: M Prashanth | 29 Sept 2026 1:57 PM ISTహీరోల రెమ్యూనరేషన్ల విషయంలో ఇండస్ట్రీలో మెల్లగా మార్పు కనిపిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారీ పారితోషికాల బదులు ప్రాఫిట్ షేర్ వైపు కొందరు హీరోలు ఇంట్రెస్ట్ చూపుతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో సినిమా రిలీజ్ కు ముందే ప్రొడ్యూసర్ పై ఉండే ఫైనాన్షియల్ బర్డన్ కొంత తగ్గే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రీసెంట్ గా నిర్మాత చైతన్య రెడ్డి హీరోల రెమ్యూనరేషన్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక సినిమాకు కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో.. ఇప్పుడు అంత మొత్తం కాకుండా కొంత తగ్గించుకుని, సినిమా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకునే విధానాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పారు. అయితే సినిమా మొదలుపెట్టినప్పుడే హీరోకు భారీ మొత్తాన్ని చెల్లించడం నిర్మాతలకు పెద్ద భారం.
ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల్లో హీరో పారితోషికం కూడా ఖర్చులో మెయిన్ గా ఉంటుంది. ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్ లో కొంత తగ్గింపు, దానికి బదులుగా సినిమా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవడం నిర్మాతకు కొంత రిలీఫ్ ఇచ్చే ప్రాసెస్ గా మారుతోంది. అయితే సినిమా భారీగా వసూళ్లు సాధిస్తే హీరోకు కూడా బెనిఫిట్ ఉంటుంది. సాధారణ రెమ్యూనరేషన్ తో పోలిస్తే ప్రాఫిట్ షేర్ ద్వారా ఎక్కువ మొత్తమే వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే సినిమా బాగా ఆడితే హీరోకు లాభం.. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే నిర్మాతపై మొదట్లో ఉండే ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. అదే నిర్మాతల యాంగిల్ లో చూస్తే ఆ విధానం వల్ల సినిమా విడుదలకు ముందు భారం కొంత తగ్గుతున్నట్లే. హీరోకు భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో మిగతా నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్, రిలీజ్ కు సంబంధించిన ఖర్చులను నిర్వహించడం కొంత ఈజీ అవుతుంది.
అదే సమయంలో హీరో కూడా సినిమాపై మరింత ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సినిమా విజయం, వసూళ్లు తన ఇన్కమ్ పై డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే హీరోలు సినిమాకు తమ వంతుగా పూర్తి ఎఫర్ట్ పెడుతున్నారని చైతన్య రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ప్రతి హీరో ఇదే ప్రాసెస్ ను ఫాలో అవుతున్నారని ఎవరూ చెప్పలేం.
స్టార్ హీరోల పారితోషికాలు, ప్రాఫిట్ షేర్లు, అగ్రిమెంట్లు ఒక్కో సినిమాకు ఒక్కోలా ఉంటాయి. నిర్మాత, హీరో మధ్య జరిగే అగ్రిమెంట్ పైనే అసలు లెక్కలు ఆధారపడి ఉంటాయి. అలా హీరోల రెమ్యూనరేషన్ విధానంలో వస్తున్న ఆ ఛేంజ్ నిర్మాతలకు కొంత రిలీఫ్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది. అదే సమయంలో సినిమా సక్సెస్ అయితే హీరోకు కూడా భారీగా లాభపడే ఛాన్స్ వస్తోంది. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో ఫిక్స్ డ్ రెమ్యూనరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ మోడల్ పై కూడా ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
