ఎవరెవరు అంత మంచోళ్లు?
డబ్బంటే ఎవరికీ చేదు. అందులోనూ సంపాదించే వాళ్లకు ఇంకా సంపాదించాలనే ఆశే ఉంటుంది. ఎంత సంపాదించినా? ఆశ చావదు...తనివీ తీరదు.
By: Srikanth Kontham | 1 Dec 2025 2:00 AM ISTడబ్బంటే ఎవరికీ చేదు. అందులోనూ సంపాదించే వాళ్లకు ఇంకా సంపాదించాలనే ఆశే ఉంటుంది. ఎంత సంపాదించినా? ఆశ చావదు...తనివీ తీరదు. డబ్బులో ఉండే కిక్ అలాంటిందని కొందరు ధనవంతులు చెబుతుంటారు. డబ్బు ఎక్కువగా ఎవరి దగ్గర ఉందంటే? సినిమా వాళ్ల దగ్గర..రాజకీయ నాయకుల దగ్గరే ఉందన్నది అందరిలో ఉన్న ఓ అభిప్రాయం. అందుకే ఆ రెండు రంగాల్లో ఎంతైనా సంపాదించొచ్చు అని అంతా అంటుంటారు. హీరోయిన్లు పారితోషికం ముక్కు పిండి వసూల్ చేస్తారంటారు? అలాగని హీరోలు కూడా తక్కువేం కాదు.
ఇస్తానంటే ఎవరు వద్దు అంటారు. తమ కష్టానికి తగ్గ ఫలితం తప్పక తీసుకోవాలనే ఎవరైనా చూస్తారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఆ తరహాలో ఉండడని నిర్మాత రవిశంకర్ అన్నారు. `రంగస్థలం` పారితోషికం ఒకేసారి కాకుండా ధపధపాలుగా తీసుకున్నారని తెలిపారు. 20 లక్షలు..30 లక్షలు ఇలా తీసుకునే వారన్నారు. సినిమా పూర్తయినా పెండింగ్ డబ్బులు తీసుకోండని అంటే? తర్వాత తీసుకుంటానని చెప్పి ఏడాది వరకూ తీసుకోలేదన్నారు. మరి రామ్ చరణ్ నిర్మాతల అందరి వద్ద ఇలాగే ఉంటారా? లేక కొందరి వద్దేనా? అన్నది క్లారిటీ రావాలి.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఆయన డబ్బు మనిషి కాదు. సినిమా ప్లాప్ అయితే నిర్మాతకు తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేస్తారు. రిలీజ్ అనంతరం మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదు అన్నట్లే ఉంటారు. `హరిహరవీరమల్లు` సినిమా రిలీజ్ ఆలస్యమయ్యే సరికి పవన్ పెండింగ్ పారితోషికం తీసుకోని సంగతి తెలిసిందే. అలాగే మరో సినిమా విషయంలో కూడా ఇలాంటి మినహాయింపులు ఇచ్చారు.
సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య లాంటి స్టార్లను మినహాయిస్తే? మహేష్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా కొంత మంది హీరోలున్నారు. వీరంతా పాన్ ఇండియా స్టార్లు. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్ల రూపా యలు అందుకుంటున్నారు. 50 కోట్లు..100 కోట్లు అంటూ మార్కెట్ ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు. మహేష్ కూడా నిర్మాతకు నష్టాలొచ్చాయంటే? పారితోషికంలో కొంత మినహాయింపు ఇస్తారనే సమాచారం ఉంది. ఇంకా మిగతా స్టార్లు ఈ విషయంలో నిర్మాతలకు అనుకూలంగానే ఉంటారని ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది.
