Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కొత్త కాంబినేష‌న్లు ఇంట్రెస్టింగ్!

తెలుగు సినీ పరిశ్రమలో కంఫర్ట్ జోన్ దాటి పని చేసే రోజులు వచ్చాయి. ఒకప్పుడు మాస్ హీరోలు కేవలం ఫైట్లు, డ్యాన్సులకే పరిమితమయ్యేవారు.

By:  Srikanth Kontham   |   10 April 2026 7:36 PM IST
టాలీవుడ్ కొత్త కాంబినేష‌న్లు ఇంట్రెస్టింగ్!
X

తెలుగు సినీ పరిశ్రమలో కంఫర్ట్ జోన్ దాటి పని చేసే రోజులు వచ్చాయి. ఒకప్పుడు మాస్ హీరోలు కేవలం ఫైట్లు, డ్యాన్సులకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు వైవిధ్యమైన దర్శకులతో చేతులు కలుపుతూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ - `సాహో` ఫేమ్ సుజీత్ కలయికలో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక హై-వోల్టేజ్ సైన్స్ ఫిక్షన్ డ్రామా రానుండటం విశేషం. సుజీత్ మేకింగ్ స్టైల్, తేజ్ ఎనర్జీ తోడైతే వెండితెరపై ఒక విజువల్ వండర్ ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక త్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అడివి శేష్ ఈసారి తన పంథాను పూర్తిగా మార్చబోతున్నాడు. `లిటిల్ హార్ట్స్` ఫేమ్ సాయి మాతన్ దర్శకత్వంలో క్యూట్ లవ్ స్టోరీని పట్టాలెక్కించనున్నారు. సాధారణంగా గన్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లో కనిపించే శేష్ ఒక సున్నితమైన ప్రేమకథలో ఎలా కనిపిస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకున్న శేష్ ఇలాంటి సాఫ్ట్ జానర్‌ను ఎంచుకోవడం ఆయన కెరీర్‌లో ఒక సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పొచ్చు.

మరోవైపు మ్యాచో స్టార్ గోపీచంద్ - జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు సంకల్ప రెడ్డి కలయిక సినీ వర్గాల్లో అంతేఊ హాట్ టాపిక్‌. వీరిద్దరూ కలిసి 7వ శతాబ్దం నాటి పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెర‌కెక్కిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. `ఘాజీ`, `అంతరిక్షం` వంటి విలక్షణ చిత్రాలను తీసిన సంకల్ప రెడ్డి గోపీచంద్‌ను ఒక చారిత్రక వీరుడిగా ఎలా ఆవిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ కాంబినేషన్ స‌క్సెస్ అయితే? బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ కూడా తదుపరి చిత్రం కోసం `హాయ్ నాన్న` ఫేమ్ దర్శకుడు శౌర్యుతో చేతులు కలిపాడు. `ఖుషీ` తర్వాత విజయ్ చేయబోతున్న పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇదేనని తెలుస్తోంది. శౌర్యు తన మొదటి సినిమాతోనే ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. తాజాగా విజయ్ వంటి స్టార్ హీరోతో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ క్లాస్ - మాస్ ప్రేక్షకులను ఏకకాలంలో ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు శౌర్యు మార్క్ ఎమోషన్స్ తోడైతే మరో `గీత గోవిందం` లాంటి మ్యాజిక్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ కొత్త కాంబినేషన్ల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులకు వైవిధ్యాన్ని అందించడమే. ప్రస్తుతం ప్రేక్షకులు రొటీన్ కథలను తిరస్కరిస్తున్నారు. అందుకే హీరోలు సైతం తమ ఇమేజ్ గురించి ఆలోచించకుండా విభిన్నమైన మేకింగ్ స్టైల్ ఉన్న దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ నుండి విజయ్ దేవరకొండ వరకు అందరూ తమ కెరీర్‌లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్‌ను ఎంచుకుంటున్నారు. ఇది టాలీవుడ్ భవిష్యత్తుకు , కొత్త దర్శకులకు ఒక గొప్ప ఊతాన్ని ఇచ్చే పరిణామం.