Begin typing your search above and press return to search.

కొరియోగ్రాఫర్లు డైరెక్టర్ అయితే అదే ప్రాబ్లం...స్టార్ హీరోలు అందుకే వాళ్ళను పక్కన పెడుతున్నారా...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది టార్గెట్ సినిమాలను డైరెక్ట్ చేయడమే కావడం విశేషం. ఏ క్రాఫ్ట్ లో వారైనా సరే ఇప్పుడు డైరెక్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.

By:  Gopi Velupala   |   24 Sept 2026 1:00 AM IST
కొరియోగ్రాఫర్లు డైరెక్టర్ అయితే అదే ప్రాబ్లం...స్టార్ హీరోలు అందుకే వాళ్ళను పక్కన పెడుతున్నారా...
X

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది టార్గెట్ సినిమాలను డైరెక్ట్ చేయడమే కావడం విశేషం. ఏ క్రాఫ్ట్ లో వారైనా సరే ఇప్పుడు డైరెక్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కారణం ఏంటంటే డైరెక్టర్ అయితే కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా ఉండొచ్చని వాళ్ల నిర్ణయం మేరకే సినిమా జరుగుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే సినిమాలు సక్సెస్ అయితే వాళ్లకు విపరీతమైన క్రేజ్ రావడమే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా ఎక్కువ మొత్తంలో చార్జ్ చేయొచ్చనే ఉద్దేశ్యంతో చాలామంది టెక్నీషియన్లు దర్శకులుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇందులో కొరియోగ్రాఫర్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఆసక్తి చూపిస్తుండటం విశేషం... ఇప్పటికే ప్రభుదేవా, రాఘవ లారెన్స్, అమ్మ రాజశేఖర్ లాంటి కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారిపోయారు. ఇక ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సైతం ఒక సినిమాను డైరెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తుండటం విశేషం. గతంలో ప్రభాస్ తో ఆయన సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ అతనికి డేట్స్ ఇచ్చాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇక ఇదిలా ఉంటే కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి...

వాళ్లు కొరియోగ్రాఫర్లుగా ఉన్నప్పుడు సాంగ్స్ కంపోజ్ చేసే సందర్భంలో స్టెప్ లను దర్శకులను అనుసరించి అలాగే హీరోల యొక్క నిర్ణయాలను తీసుకుని కంపోజ్ చేస్తుంటారు. ఇక వాళ్లే దర్శకులైతే వాళ్లకి నచ్చినట్టుగానే కొరియోగ్రఫీ చేసుకుంటారు. ఇక అప్పుడు హీరోల మాట కూడా వినాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాబట్టి హీరోలు సైతం వాళ్ళ నిర్ణయానికి తలవంచకు తప్పదనే ఉద్దేశ్యంతోనే హీరోలు కొరియోగ్రాఫర్లకు డేట్స్ ఇవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి...

ఇక డాన్స్ విషయంలో మన హీరోలు కొంతవరకు తడబడుతున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను మినహాయిస్తే మిగిలిన స్టార్ హీరోలు ఎవరు కూడా పెద్దగా డ్యాన్స్ లు వేసేవారు లేకపోవడం వల్ల తమకు అనుగుణంగానే కొరియోగ్రాఫర్ల చేత స్టెప్పులను వేయించుకుంటూ ఉంటారు. మొత్తానికైతే కొరియోగ్రాఫర్లకి సినిమాలు ఇవ్వకపోవడానికి ఇదొక రీజన్ అనే చెప్పాలి. మరి కొంతమంది స్టార్ హీరోలు మాత్రం కొరియోగ్రాఫర్లు అంటే ఇటు వాళ్ళ సినిమాను డైరెక్షన్ చేసుకుంటూనే ఇతర సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తుంటారని వాళ్ళు రెండు పడవల మీద ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి వాళ్లకి సినిమాలు ఇస్తే ఎంతవరకు సేఫ్ అనే ధోరణిలో కూడా కొంత మంది హీరోలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది...