ఐదు కోట్ల సెట్ నచ్చక షూటింగ్ చేయనన్నారా?
ఇలా చాలా సినిమాలకు జరిగింది. ఇప్పటికీ అలాంటి సంఘటనలు దర్శక నిర్మాతలకు ఎదురవుతూనే ఉన్నాయి.
By: Tupaki Entertainment Desk | 22 Jan 2026 8:00 PM ISTటాలీవుడ్‌లో ప్రతి సినిమాకు ఏదో ఒక చిత్రం, విచిత్రం జరగడం కామన్‌గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ మారొచ్చు.. లేదా ప్రొడ్యూసరే మారిపోవచ్చు..ఫైనల్ షూటింగ్ డే వచ్చే సరికి ఏకంగా హీరో లేదా.. హీరోయినే మారిపోవచ్చు. ఇక్కడ ఏదైనా సాధ్యమే. ఇక స్టార్ హీరో సినిమా అయితే షూటింగ్ సెట్‌లో ఏదైనా మారొచ్చు.. చివరికి సెట్టే మారిపోవచ్చు. అది పనికిరాదని దాన్ని రాత్రికి రాత్రే తీసేసి మరో సెట్‌ని ఏర్పాటు చేయించొచ్చు. అది కోట్లు ఖర్చు పెట్టి చేసినా హీరోకు నచ్చలేదంటే మార్చేయాల్సిందే.
ఇలా చాలా సినిమాలకు జరిగింది. ఇప్పటికీ అలాంటి సంఘటనలు దర్శక నిర్మాతలకు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఇదే సంఘటన తాజాగా ఓ సీనియర్ హీరో సినిమాకు జరిగిందని తెలిసింది. అది కూడా ఓ సీనియర్ స్టార్ హీరోకు కావడం మరింత చర్చకు దారి తీసింది. ఇప్పుడు దీని గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. చాలా కాలంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న స్టార్ హీరో కొత్త పంథాలో సినిమాలు తీసే డైరెక్టర్‌తో ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతా రెడీ అయితే సదరు స్టార్ హీరో ప్రతి విషయంలోనూ ఇన్ వాల్వ్ అవుతూ వచ్చారట.
ఆర్టిస్ట్‌లు, కీలక టెక్నీషియన్స్, డ్యాన్స్ మాస్టర్స్ ఇలా ప్రతీదీ ఆయనే చూసుకున్నారట. అంత వరకు బాగానే ఉంది కానీ కీలక ఘట్టాల కోసం ప్రత్యేకంగా వేసిన ఓ భారీ ఇంటి సెట్ విషయంలోనే అసలు సమస్య తలెత్తిందంట. ఐదు కోట్లు ఖర్చు చేసి వేసిన భారీ సెట్.. సదరు హీరోగారికి పెద్దగా నచ్చలేదట. షూటింగ్ రోజే సెట్లోకి రావడం.. సెట్ తనకి నచ్చకపోవడంతో ఆ రోజు షూటింగ్ చేయకుండానే సెట్ మార్చేయండని సీరియస్ అయ్యారట. షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారట. దీంతో డైరెక్టర్ కంగారు పడిపోయాడట.
ఆ తరువాత హీరో చెప్పింది అర్థమై చేసేది లేక డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరో సెట్‌ని రెడీ చేయించారని, ఆ తరువాతే అందులో హీరోగారు షూటింగ్ చేశారని తెలిసింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే హీరోగారు పట్టుబట్టి ఐదు కోట్ల సెట్‌ని మార్చేయడం సదరు సినిమాకు ప్లస్సే అయిందని ఇన్ సైడ్ టాక్. కీలక ఘట్టాలని చిత్రీకరించడానికి అదే పర్‌ఫెక్ట్‌గా పని చేసిందని, ఇప్పుడా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని సదరు హీరో కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని చెబుతున్నారు.
అయితే సదరు హీరోలు సెట్‌లు, ఆర్టిస్ట్‌లు, లొకేషన్‌లు బాగా లేవని, మార్చేయాల్సిందేనని మార్పు కోసం, సక్సెస్ కోసం చెబితే ఓకే కానీ అదే పనిగా ఈగో సాటిస్‌ఫై చేసుకోవడం కోసం కావాలనే అది నచ్చలేదు..ఇది నచ్చలేదు.. లొకేషనే బాగాలేదని, స్టోరీలో ఈ బ్లాక్ అవసరం లేదని..ఇలా లేని పోని మార్పులు చెబుతుంటారని,, అలాంటి మార్నుల వల్ల పెద్ద పెద్ద సినిమాలే బాక్సాఫీస్ వద్ద అడ్రస్ లేకుండా పోయాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేగా మరి.
