Begin typing your search above and press return to search.

నిలిచిపోయిన మూవీ.. అసలు మ్యాటర్ ఇదా?

టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో, ప్రముఖ డైరెక్టర్ కాంబినేషన్ లో మూవీ రూపొందనుందని కొద్ది రోజులపాటు సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   19 Sept 2025 9:00 PM IST
నిలిచిపోయిన మూవీ.. అసలు మ్యాటర్ ఇదా?
X

టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో, ప్రముఖ డైరెక్టర్ కాంబినేషన్ లో మూవీ రూపొందనుందని కొద్ది రోజులపాటు సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ ఆ ప్రాజెక్టును రూపొందించనుందని, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని టాక్ వినిపించింది.

హీరోతో పాటు ఆయన తండ్రికి మూవీ స్క్రిప్ట్ నచ్చిందని ప్రచారం జరిగింది. రేపో మాపో అధికారిక ప్రకటన వస్తుందని, దసరా తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్తుందని టాక్ వినిపించింది. అదే సమయంలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో, మరో ఫ్లాప్ డైరెక్టర్ తో వర్క్ చేయడంపై తీవ్రంగా చర్చ జరిగింది.

గత కొన్ని రోజులుగా వారిద్దరికీ సరైన హిట్స్ పడలేదు. దీంతో సోషల్ మీడియాలో సినీ ప్రియులు ఇలాంటి టైమ్ లో ఇద్దరి కాంబినేషన్ లో మూవీ కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. అయితే రీసెంట్ గా సదరు హీరో.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని సమాచారం వచ్చింది. ఆ డైరెక్టర్ తో వర్క్ చేయడం లేదని తెలిసింది.

దానికి కారణం సినీ ప్రియుల అభిప్రాయాలు, సోషల్ మీడియాలో రెస్పాన్సే కారణమని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అసలు విషయం అది కాదని తెలుస్తోంది. నిజానికి.. హీరో రీసెంట్ గా భారీ పారితోషికం డిమాండ్ చేశారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ముందు లాభాల విధానంలో చేస్తానని ఒప్పుకున్న ఆయన.. ఆ తర్వాత రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట.

సడెన్ గా యంగ్ హీరో మాట మార్చారని తెలుస్తోంది. అందుకు మేకర్స్ అంగీకరించలేదని సమాచారం. ఆ తర్వాత హీరో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. అదే అసలు మ్యాటర్ అని వినికిడి. కానీ నెగిటివ్ సోషల్ మీడియా బజ్ కారణంగా హీరో ప్రాజెక్టు నుంచి వైదొలిగారని ఆయన టీమ్ ప్రచారం చేసిందని తెలుస్తోంది.

ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో హీరో తన మాట మీద నిలబడకుండా యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు డైరెక్టర్ అండ్ టీమ్.. కొత్త హీరో కోసం సెర్చ్ చేస్తున్నారని సమాచారం. దసరా తర్వాత సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మరి ఆ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో వేచి చూడాలి.