Begin typing your search above and press return to search.

డిప్రెషన్ లో ఉన్న ఆ హీరో సంగతేంటి? కమ్ బ్యాక్ ఇస్తారా?

సినీ ఇండస్ట్రీ ఆ యంగ్ హీరోకు ఎనలేని క్రేజ్ ఉంది. కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.

By:  M Prashanth   |   18 Sept 2025 3:00 AM IST
డిప్రెషన్ లో ఉన్న ఆ హీరో సంగతేంటి? కమ్ బ్యాక్ ఇస్తారా?
X

సినీ ఇండస్ట్రీ ఆ యంగ్ హీరోకు ఎనలేని క్రేజ్ ఉంది. కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. వివిధ చిత్రాల్లో యాక్ట్ చేసిన తన నటనతో మెప్పించారు. ఎన్నో చిరస్మరణీయ పాత్రలు పోషించిన ఆ హీరో.. తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. మంచి ఫ్యాన్ బేస్ కూడా దక్కించుకున్నారు.

కానీ కొంత కాలంగా సరైన హిట్ ను సొంతం చేసుకోలేకపోతున్నారు. అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను అస్సలు మెప్పించలేకపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకోలేకపోతున్నారు. అదే సమయంలో ఆయన నటిస్తున్న మూడు సినిమాలు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంకా అవి పూర్తి కాలేదు.

అయితే గత ఏడాది సదరు హీరో వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఇప్పుడు ఆయన వైవాహిక జీవితం అనుకున్నట్లు సాగడం లేదు. ఇబ్బందులు ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. విడాకులు కూడా తీసుకుంటారని సినీ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

దానిపై స్పందించని ఆ హీరో.. రీసెంట్ గా తన అప్ కమింగ్ మూవీస్ షూటింగ్స్ అన్నీ వాయిదా వేసుకున్నారు. ఫారిన్ వెళ్లి అక్కడ నెల రోజులు ఉండి రెస్ట్ తీసుకున్నారు. రీసెంట్ గా మళ్లీ ఇండియా తిరిగి వచ్చారు. అదే సమయంలో చాలా స్లిమ్ గా అయినట్లు కనిపిస్తున్నారు. కొత్త లుక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు.

ఇప్పుడు మళ్లీ తన వర్క్ తో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నిలిచిపోయిన మూడు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేస్తానని మేకర్స్ కు హామీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా చిత్రీకరణను కంప్లీట్ చేయనున్నారు. మూడు సినిమాలతో వచ్చే ఏడాది సందడి చేయనున్నారు. నెలల గ్యాప్ లో మూడు సినిమాలు విడుదల కానున్నాయి.

అంతే కాదు కొత్త స్క్రిప్టులు కూడా వింటున్నారు. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేలా ప్లాన్ వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అప్ కమింగ్ మూవీస్ ను లైన్ లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. డిప్రెషన్ నుంచి బయటపడి.. మంచి సినిమాలు చేసి.. ఆడియన్స్ ను అలరించడమే టార్గెట్ గా పెట్టుకున్నారట. మరి ఏం చేస్తారో.. ఎలాంటి సినిమాలు చేస్తారో.. ఎంతటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.