Begin typing your search above and press return to search.

వామ్మో నా వ‌ల్ల కాదంటున్న స్టార్ హీరో?

వామ్మో నా వ‌ల్ల కాదు బాబోయ్ అంటూ బావురు మంటూ బ్రేఖ్ తీసేసుకున్నాడ‌ట‌. స‌ద‌రు స్టార్ హీరో ఇలా ఇబ్బందిప‌డుతుండ‌టానికి కార‌ణం త‌న ప‌ప్పులు స‌ద‌రు డైరెక్ట‌ర్ వ‌ద్ద ఉడ‌క్క‌పోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది.

By:  Tupaki Entertainment Desk   |   22 Jan 2026 8:19 AM IST
వామ్మో నా వ‌ల్ల కాదంటున్న స్టార్ హీరో?
X

`ఎక్క‌డైనా బావ కానీ వంగ‌తోట కాడ కాదు` అన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఈ సామెత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ప‌ని ద‌గ్గ‌ర ప‌క్కా ప్రొఫెష‌న‌లిజాన్ని చూపించాలి. మిగ‌తా ద‌గ్గ‌ర ఎలా ఉన్నా ఫ‌ర‌వాలేదు. కానీ మ‌న టాలీవుడ్ స్టార్ హీరోల‌లో కొంత మంది చెప్పిందే వేదం.. అన్న‌దే డైలాగ్‌.. చేసిందే సీన్ అన్న‌ట్టుగా మారింది. బాబు సంస్కృతి నుంచి ఇప్ప‌డు బాడీ డ‌బుల్ సంస్కృతికి మారిన ద‌రిమిలా మాన స్టార్ల‌లో కొంత మంది వేస్తున్న వేశాలు.. చేస్తున్న చిలిపి చేష్ట‌లు అన్నీ ఇన్నీ కావు.

సినిమా అనౌన్స్ మెంట్ ద‌గ్గ‌రి నుంచి ఫ‌స్ట్ లుక్ దాకా.. కొబ్బ‌రి కాయ కొట్టే ద‌గ్గ‌రి నుంచి గుమ్మ‌డికాయ కొట్టేదాకా వాళ్లు చెప్పిందే వేదం.. వాళ్లు చెప్పిందే శాస‌నం. కొంత మంది హీరోలు మ‌రీ టూమ‌చ్‌గా బిహేవ్ చేస్తున్నార‌ట‌. సెట్‌లోకి అనుకున్న‌ప్పుడే రావ‌డం.. ఆల‌స్యంగా మేక‌ప్ వేసుకోవ‌డం.. తాను చెప్పిన షాట్‌లు మాత్ర‌మే తీయాల‌ని డిమాండ్ చేయ‌డం.. మిగ‌తా షాట్‌ల‌న్నీ బాడీ డ‌బుల్‌తో లాగించేసేయ్ అని ఈజీగా చెప్పేసి వెళ్లిపోవ‌డం చేస్తుంటార‌ట‌. ఇది మ‌న డైరెక్ట‌ర్ల వ‌ద్ద అయితే టేకిట్ గ్రాంటెడ్ గా సాగిపోతోంది కానీ బ‌య‌టికి వెళితే ఆ ప‌ప్పులు ఉడ‌క‌డం లేద‌ట‌.

ఇదే త‌ర‌హాలో డైరెక్ట‌ర్ల‌ని ఆడుకునే ఓ హీరో ఈ మ‌ధ్యే ఓ మోనార్క్ లాంటి డైరెక్ట‌ర్‌తో భారీ సినిమాని మొద‌లు పెట్టాడు. షూటింగ్ మొద‌లైంది. అయితే స‌ద‌రు హీరోకున్న అల‌వాటుతో కొన్ని క్లోజ‌ప్ సాట్‌లు, బెస్ట్ ఫిట్ షాట్స్ మాత్ర‌మే తీసుకోవాల‌ని, మిగ‌తా లాంగ్ షాట్స్‌, వైడ్ షాట్స్ అన్నీ బాడీ డ‌బుల్‌తో తీసుకోవాల‌ని డైరెక్ట‌ర్‌కు సూచించాడ‌ట‌. అన్న‌న్నా ఆ ప‌ప్పులు నా ద‌గ్గ‌ర ఉడ‌క‌వు.. ప్ర‌తీ షాట్ మీరు చేయాల్సిందే.. నేను తీయాల్సిందేన‌ని ఖ‌రాకండీగా చెప్పాడ‌ట‌. దీంతో చేసేది లేక మూడు రోజులు షూటింగ్ చేసిన స‌ద‌రు స్టార్ హీరోకు మూడు రోజుల‌కే ముక్కుల‌కు వ‌చ్చేసింద‌ట‌.

వామ్మో నా వ‌ల్ల కాదు బాబోయ్ అంటూ బావురు మంటూ బ్రేక్ తీసేసుకున్నాడ‌ట‌. స‌ద‌రు స్టార్ హీరో ఇలా ఇబ్బందిప‌డుతుండ‌టానికి కార‌ణం త‌న ప‌ప్పులు స‌ద‌రు డైరెక్ట‌ర్ వ‌ద్ద ఉడ‌క్క‌పోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌కే ఇలా బావురు మంటే మిగ‌తా సినిమాని ఎలా పూర్తి చేస్తాడా? అని ఇండ‌స్ట్రీలో ఇప్పుడు హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. హీరోనా బాడీ డ‌బుల్ లేనిదే సినిమా పూర్తి చేయ‌డు.. డైరెక్ట‌రేమో బాడీ డ‌బుల్ అంటే చేయ‌ను.. ప్ర‌తి షాట్ నువ్వు చేయాల్సిందే అని ప‌ట్టుబ‌డుతుంటాడు. వీరిద్ద‌రు క‌లిసి ఎప్పటికి సినిమా పూర్తి చేస్తారో అని అలా అవాక్క‌వుతున్నార‌ట‌.

హీరో మారి ఈ సారికి ఇలాగే కానిచ్చేద్దామ‌ని డైరెక్ట‌ర్ చెప్పింది చెప్పిన‌ట్టు చేస్తాడా?.. క‌ష్ట‌మైనా స‌రే ఓర్చుకుంటే ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తాడా? .. లేక బాబ్బాబు ఈ సారికి బాడీ డ‌బుల్‌తో కానిచ్చేసేయ్ అని డైరెక్ట‌ర్‌ని బ్ర‌తిమాలుకుంటాడా? అన్న‌ది రానున్న షెడ్యూల్‌లో తేలుతుంద‌ని, లేదంటే డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్టే విన‌క త‌ప్ప‌ని ప‌రిస్థిత‌ని హీరో గురించి తెలిసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయ‌ట‌.