నెక్స్ట్ లెవెల్ టార్గెట్.. ఈ నలుగురిపైనే టాలీవుడ్ భవిష్యత్తు?
తెలుగు సినిమా ఇప్పుడు గోల్డెన్ ఫేజ్‌లో ఉంది. మన సినిమాలు దేశ సరిహద్దులు దాటి, గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి.
By: M Prashanth | 26 Oct 2025 10:16 AM ISTతెలుగు సినిమా ఇప్పుడు గోల్డెన్ ఫేజ్‌లో ఉంది. మన సినిమాలు దేశ సరిహద్దులు దాటి, గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. 'బాహుబలి' మొదలుపెట్టిన ఈ ప్రయాణం పుష్ప, RRR, 'కల్కి'లతో నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. అయితే, ఇండస్ట్రీ పెద్దలు ఇక్కడితో ఆగేలా లేరు. రానున్న రోజుల్లో టాలీవుడ్ స్థాయిని, మార్కెట్‌ను మరింత విస్తరించేలా, ఇండియన్ సినిమాపై మన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసేలా కొన్ని భారీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి.
ప్రస్తుతం అందరి ఫోకస్ ఈ నాలుగు క్రేజీయెస్ట్ ప్రాజెక్టులపైనే ఉంది.
కల్కి 2: సినిమాటిక్ యూనివర్స్
స్పిరిట్
AA22
SSMB29
ఇవి కేవలం భారీ బడ్జెట్ సినిమాలు కావు, ఇండియన్ సినిమా చరిత్రలోనే కొత్త బెంచ్‌మార్కులను సెట్ చేయగల సత్తా ఉన్న ప్రాజెక్టులు. కానీ, ఇదే సమయంలో, వీటిపై ఉన్న అంచనాలు, ఒత్తిడి కూడా ఊహకందని స్థాయిలో ఉన్నాయి. ప్రతీ ప్రాజెక్ట్ ఒక అగ్నిపరీక్ష లాంటిదే. రాజమౌళి 'RRR'తో ఆస్కార్ అందుకున్న తర్వాత, SSMB29తో అంతకుమించిన విజయాన్ని అందుకోవాలనే ప్రెజర్ ఆయనపై ఉంది.
'యానిమల్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా, 'స్పిరిట్'తో ఆ సక్సెస్‌ను నిలబెట్టుకోవాలి, అదీ ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్‌తో. 'జవాన్' తర్వాత అట్లీకి AA22 మరో పెద్ద టెస్ట్. ఇక నాగ్ అశ్విన్ 'కల్కి'తో ఒక యూనివర్స్‌ను లాంచ్ చేసినా, దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత 'కల్కి సినిమాటిక్ యూనివర్స్'పై ఉంది.
దర్శకులపైనే కాదు, హీరోలపైనా ఒత్తిడి మామూలుగా లేదు. మహేష్ బాబు కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, అదీ రాజమౌళితో. ప్రభాస్ 'స్పిరిట్'తో తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి బలంగా నిరూపించుకోవాలి. అల్లు అర్జున్ 'పుష్ప' తర్వాత AA22తో పాన్ ఇండియా మార్కెట్‌లో తన పట్టును మరింత బిగించాలి. ఈ నలుగురు హీరోలు మోస్తున్న బాధ్యత చాలా పెద్దది.
ఇన్ని వందల కోట్లు, ఇంతమంది స్టార్ల క్రేజ్.. అన్నీ బాగానే ఉన్నాయి కానీ, చివరికి నిలబెట్టేది కంటెంటే. కేవలం స్కేల్, స్టార్ పవర్ ఉంటే సరిపోదని 'వార్ 2', 'కూలీ' లాంటి సినిమాలు రీసెంట్‌గా ప్రూవ్ చేశాయి. ఈ నాలుగు ప్రాజెక్టులు కేవలం గ్రాండియర్‌తోనే కాకుండా, బలమైన కథ, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఎంతవరకు కట్టిపడేస్తాయనే దానిపైనే వాటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
మొత్తం మీద, ఈ నాలుగు సినిమాలు టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ వేవ్‌కు ట్రాక్ లాంటివి. ఇవి గనక అంచనాలను అందుకుని, ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తే, ఇండియన్ సినిమాలో తెలుగు జెండా మరింత గర్వంగా ఎగరడం ఖాయం. కానీ, ఆ విజయం అంత సులభం కాదు. మరి ఈ ప్రెజర్ గేమ్‌లో ఎవరు నిలుస్తారో, ఎవరు తడబడతారో చూడాలి.
