విదేశీ నేపథ్యంతో టాలీవుడ్ సినిమాలు!
ఇది లొకేషన్ మార్పు మాత్రమే కాదు. కథా గమనంలోనే అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావాలనే టాలీవుడ్ తాపత్రయానికి నిదర్శనం. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న సినిమాల జాబితాను చూస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
By: Srikanth Kontham | 14 July 2026 7:00 PM ISTటాలీవుడ్ పరిధి ప్రపంచవ్యాప్తంగా అంతకంతకు విస్తరిస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలోని పల్లెలు, నగరాల నేపథ్యంలో సాగే కథలు ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దులను దాటి విదేశీ నేపథ్యాలను అన్వేషిస్తున్నాయి. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో దర్శక, నిర్మాతలు విభిన్నమైన లొకేషన్లను ఎంచుకుంటున్నారు. ఇది లొకేషన్ మార్పు మాత్రమే కాదు. కథా గమనంలోనే అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావాలనే టాలీవుడ్ తాపత్రయానికి నిదర్శనం. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న సినిమాల జాబితాను చూస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
కొరియా నేపథ్యంలో రూపొందుతున్న 'కొరియన్ కనకరాజు' చిత్రం ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతోంది. ఆ సంస్కృతి, జీవనశైలి, అక్కడి విజువల్ వండర్స్‌ను తెలుగు కథలతో ముడిపెట్టడం ద్వారా ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఇలాంటి ప్రయోగాలు నిర్మాణంలో సాంకేతిక విలువలను కూడా పెంచుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా ప్రాజెక్ట్ 'డ్రాగన్' కూడా ఆఫ్రికా నేపథ్యంలో సాగుతుందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సహజ సిద్ధమైన అడవులు, విభిన్నమైన భూభాగాలతో నిండిన ఆఫ్రికా ఖండం, యాక్షన్ సన్నివేశాలకు అద్భుతమైన వేదికగా నిలుస్తుంది.
యాక్షన్ మాత్రమే కాకుండా అక్కడ స్థానిక నేపథ్యాన్ని తారక్ పాత్రతో జోడించడం ద్వారా వైవిధ్యమైన ప్రెజెంటేషన్‌ను ప్రేక్షకులకు అందించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ కసరత్తులు చేస్తున్నారు. ఆప్రికా నేపథ్యంలో వచ్చే ప్రతీ సన్నివేశం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. అలాగే త్వరలో సెట్స్ కు వెళ్లనున్న 'ఓజీ 2' చిత్రం చాలా వరకూ జపాన్ నేపథ్యంలో సాగనుందనే సమాచారం అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. జపాన్ సంస్కృతి, క్రమశిక్షణ, అక్కడి లోతైన కథాంశాలు మన దర్శకులకు సరికొత్త స్ఫూర్తినిస్తున్నాయి.
జపాన్ నేపథ్యం అంటే అందమైన లొకేషన్లు మాత్రమే కాదు. అక్కడ ఉండే వాతావరణం హీరోల ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అభిమానులకు సరికొత్త విజువల్ ఫీస్ట్‌ని అందించనుంది. ఇలా విదేశీ నేపథ్యంలో సినిమాలు తీయడం వల్ల టాలీవుడ్ చిత్రాలకు ఉన్న మార్కెట్ విలువ కూడా పెరుగుతోంది. విదేశీ లొకేషన్లలో షూటింగ్ చేయడం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో తెలుగు సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే అక్కడి స్థానిక ప్రజలకు కూడా టాలీవుడ్ సినిమాలపై ఆసక్తి కలుగుతోంది. ఇది తెలుగు టెక్నీషియన్లకు అంతర్జాతీయ స్థాయి పనితనాన్ని ప్రదర్శించే అవకాశం కల్పిస్తోంది. లోకల్ కథాంశాలకు గ్లోబల్ టచ్ ఇస్తూ సినిమాలు నిర్మించడం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.
తెలుగు సినిమాలు విదేశీ తీరాలకు వెళ్లడం అనేది గొప్ప పరిణామం. ఒకప్పుడు కథలను చుట్టుపక్కల పరిసరాలకే పరిమితం చేసిన నిర్మాతలు ఇప్పుడు ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. తెలుగు క్రియేటివిటీకి హద్దులు లేవని నిరూపిస్తూ విదేశీ నేపథ్యాలతో కూడిన చిత్రాలు టాలీవుడ్‌ను గ్లోబల్ స్టేజీపై నిలబెడుతున్నాయి. ఈ కొత్త ప్రయాణం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి మైలురాళ్లను చేరువ చేస్తుందో చూడాలి.
