టాలీవుడ్ హీరోలకు పాన్-ఇండియా సవాల్!
స్థానిక కథలకే అంతర్జాతీయంగా క్రేజ్ ఎక్కువ అనేది నేటి సినిమా ట్రెండ్. ఒకప్పటిలా అందరికీ నచ్చాలని లండన్ బ్యాక్‌డ్రాప్‌లోనో?
By: Srikanth Kontham | 27 Jun 2026 6:00 AM ISTటాలీవుడ్ నేడు ప్రాంతీయ సరిహద్దులను దాటి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. అయితే తెలుగు హీరో హిందీతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేసినప్పుడు మైండ్ బ్లోయింగ్ విజువల్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లపైనే పూర్తిగా ఆధారపడటం దీర్ఘ కాలం పాటు వర్కవుట్ కాకపోవచ్చు. ఎందుకంటే హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఓటిటిల పుణ్యమా? అని అలవాటైపోయాయి. ఈ నేపథ్యంలో కథల్లోని అచ్చమైన తెలుగు నేటివిటీని ఇక్కడి మట్టి వాసనను కోల్పోకుండా గ్లోబల్ ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడం అనేది ప్రస్తుత తరం హీరోలకు - దర్శకులకు అతిపెద్ద సవాల్‌గా మారింది.
విదేశీ .. ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సంస్కృతిని మార్చాల్సిన అవసరం లేదు. దానికి యూనివర్శల్ ఎమోషన్స్ జోడిస్తే సరిపోతుందని కొన్ని విజయాలు నిరూపించాయి. కథాంశం ఏదైనప్పటికీ అందులో బంధాలు, భావోద్వేగాలు, మానవీయ విలువలు ప్రపంచంలో ఏ మూలన ఉన్న ప్రేక్షకుడికైనా ఒకేలా కనెక్ట్ అవుతాయి. పల్లెటూరి నేపథ్యం, కుటుంబ వ్యవస్థ, ఆచార వ్యవహారాలను కథలో అంతర్భాగంగా చూపిస్తూనే వాటి వెనుక ఉన్న ఎమోషనల్ డ్రైవ్‌ను బలంగా ప్రెజెంట్ చేయగలిగితే భాషా సరిహద్దులను సులభంగా దాటేస్తుంది. తెలుగు హీరోలు స్టైలిష్ లుక్స్‌కే పరిమితం కాకుండా రూటెడ్ క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయినప్పుడే గ్లోబల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి లభిస్తుంది.
స్థానిక కథలకే అంతర్జాతీయంగా క్రేజ్ ఎక్కువ అనేది నేటి సినిమా ట్రెండ్. ఒకప్పటిలా అందరికీ నచ్చాలని లండన్ బ్యాక్‌డ్రాప్‌లోనో? విదేశీ లొకేషన్లలోనో? కథలు రాస్తే గ్లోబల్ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. తెలంగాణ గిరిజన సంస్కృతి, రాయలసీమ ఫ్యాక్షనిజం వెనుక ఉన్న మానవీయ కోణాలు .. ఆంధ్రా తీరప్రాంత మత్స్యకారుల జీవితాల వంటి విభిన్నమైన తెలుగు నేటివిటీ అంశాలను గ్లోబల్ స్టాండర్డ్స్‌తో స్క్రీన్ ప్లే చేసి చూపించాల్సి ఉంటుంది. ఈ తరహా హైపర్-లోకల్ కథలు బాలీవుడ్ .. అంతర్జాతీయ ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఆ వైవిధ్యమే తెలుగు హీరోలను గ్లోబల్ స్టార్స్‌గా నిలబెడుతుంది.
ఈ సవాల్‌ను అధిగమించడంలో తెలుగు హీరోల క్యారెక్టరైజేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం లార్జర్-దెన్-లైఫ్ పాత్రల కంటే కథలో నెటివిటీని ప్రతిబింబించేలా కొంత నెగెటివ్ షేడ్స్ .. బలహీనతలు ఉన్న హ్యూమన్ క్యారెక్టర్స్ వైపు హీరోలు మొగ్గు చూపాలి. జానపద కళలు, పండుగలు, పురాణాల స్ఫూర్తిని ఆధునిక కథనాలకు జోడించి పాత్రలను డిజైన్ చేసినప్పుడు వాటికి తిరుగులేని అప్పీల్ వస్తుంది. అప్పుడు విజువల్స్ అనేవి కథను నడిపించే ఇంధనంగా మారుతాయే తప్ప అవే ప్రధానం కాబోవు అన్నది విశ్లేషకుల మాట.
విజువల్స్ - యాక్షన్ అనేవి ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడానికి ఒక ఆకర్షణ మాత్రమే. కానీ థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడిని కట్టిపడేసి సినిమాను లాంగ్ రన్ లో నిలబెట్టేది అచ్చమైన కథ, అందులోని నేటివిటీ మాత్రమే. టాలీవుడ్ హీరోలు అంతర్జాతీయ వేదికలపై జెండా పాతాలంటే మన కథల మూలాలను వదలకుండా గ్లోబల్ మేకింగ్ స్టాండర్డ్స్‌ను అందుకోవడమే ఏకైక మార్గం. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను సాధించిన రోజే తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్‌లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోగలదన్నది కాదనలేని నిజం.
