Begin typing your search above and press return to search.

ఆన్‌స్క్రీన్ ఫ్లాప్.. ఆఫ్‌స్క్రీన్ సూపర్ హిట్!

ఆన్‌స్క్రీన్‌పై ఫ్లాప్ అయినప్పటికీ, ఆఫ్‌స్క్రీన్‌లో సూపర్ హిట్ అయిన ఆ క్రేజీ రియల్ లైఫ్ జంటల ముచ్చట్లు మీకోసం..

By:  Madhu Reddy   |   13 July 2026 11:00 PM IST
ఆన్‌స్క్రీన్ ఫ్లాప్.. ఆఫ్‌స్క్రీన్ సూపర్ హిట్!
X

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం, ఆ తర్వాత వారు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఆశ్చర్యకరంగా టాలీవుడ్‌లో కొంతమంది స్టార్స్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. కానీ, ఆ సినిమాలే వారి జీవిత భాగస్వాములను వారికి పరిచయం చేశాయి. ఆన్‌స్క్రీన్‌పై ఫ్లాప్ అయినప్పటికీ, ఆఫ్‌స్క్రీన్‌లో సూపర్ హిట్ అయిన ఆ క్రేజీ రియల్ లైఫ్ జంటల ముచ్చట్లు మీకోసం..

జీవిత - రాజశేఖర్:

టాలీవుడ్ సీనియర్ కపుల్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవితలది ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ. వీరిద్దరూ 'తలంబ్రాలు' సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఆ సినిమా టైమ్‌లోనే వీరిద్దరి ఆలోచనలు కలవడంతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1991లో పెళ్లి చేసుకున్న ఈ సీనియర్ జంట ఇప్పటికీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్‌గా కొనసాగుతున్నారు.

మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్:

టాలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్రేజీ కపుల్ ఎవరంటే మహేష్ బాబు, నమ్రత జంట అని కచ్చితంగా చెప్పొచ్చు. వీరిద్దరూ కలిసి 'వంశీ' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని, ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లవ్ స్టోరీ కూడా ఇలాంటిదే. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా 'మిస్టర్' అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. కానీ ఈ సినిమా సెట్స్‌లోనే వీరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇక దాదాపు నాలుగేళ్ల పాటు తమ ప్రేమను సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట, ఆ తర్వాత ఘనంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ అన్యోన్య దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

నారా రోహిత్ - సిరి లెల్లా:

నటుడు నారా రోహిత్ కూడా తన సినిమా హీరోయిన్నే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. రోహిత్, సిరి లెల్లా జంటగా 'ప్రతినిధి 2' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేక ఫ్లాప్ లిస్ట్‌లో చేరింది. అయితే ఈ సినిమా పరిచయంతోనే ఒకటైన ఈ ఇద్దరూ, గతేడాది వివాహ బంధంతో అధికారికంగా తమ రియల్ లైఫ్ జర్నీని స్టార్ట్ చేశారు.

వరుణ్ సందేశ్ - వితికా షేరు:

ఇక వరుణ్ సందేశ్ 'కొత్త బంగారు లోకం' సినిమాతో ఒకప్పుడు యూత్‌లో ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడుతున్న సమయంలో వితికాతో కలిసి 'పడ్డానండీ ప్రేమలో మరి' అనే సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయినా, వీరిద్దరూ మాత్రం నిజంగానే ఒకరి ప్రేమలో ఒకరు పడిపోయి పెళ్లి పీటలెక్కారు.

రితేష్ దేశ్ ముఖ్ - జెనీలియా:

తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరిద్దరూ కలిసి నటించిన 'తుజే మేరీ సనమ్' అనే హిందీ చిత్రం యావరేజ్‌గా ఆడింది. ఆ సినిమాతో మొదలైన వీరి బంధం పెళ్లి వరకు తీసుకెళ్లింది. ఇక ప్రస్తుతం ఈ జంట బాలీవుడ్‌లోనే మోస్ట్ హ్యాపియెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకుంది.

సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, మనసు కలిస్తే జీవితం ఎంత అందంగా ఉంటుందో ఈ సెలబ్రిటీ జంటలను చూస్తే అర్థమవుతుంది. వెండితెరపై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఒకరికొకరు తోడుగా ఉంటూ వందకు వంద మార్కులతో సూపర్ హిట్ జంటలుగా దూసుకుపోతున్నారు.