Begin typing your search above and press return to search.

వారాల వ్యవధిలో ఒకే కుటుంబం నుండీ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న హీరోలు!

ఇలా ఒకే కుటుంబం నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెడితే. ఒకేసారి వారి సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉంటే మాత్రం.. అభిమానులలో కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ముందు ఎవరి సినిమా చూడాలి ? ఎవరి సినిమాను ఆదరించాలి? అనే అనుమానాలు వ్యక్తమౌతూ ఉంటాయి.

By:  Madhu Reddy   |   23 July 2026 11:36 AM IST
వారాల వ్యవధిలో ఒకే కుటుంబం నుండీ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న హీరోలు!
X

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో.. ఒకరు ఇండస్ట్రీలోకి వచ్చి చలామణి అవుతున్నారు అంటే.. ఇక ఆ కుటుంబం నుండి ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతుంటే.. మరొకవైపు నందమూరి, ఘట్టమనేని, అక్కినేని, మంచు, అల్లు ఇలా ఎన్నో పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన వారు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెడితే. ఒకేసారి వారి సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉంటే మాత్రం.. అభిమానులలో కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ముందు ఎవరి సినిమా చూడాలి ? ఎవరి సినిమాను ఆదరించాలి? అనే అనుమానాలు వ్యక్తమౌతూ ఉంటాయి.

వారాల వ్యవధిలో సినిమాలు విడుదలకు సిద్ధం..

వాస్తవానికి కంటెంట్ బాగుంటే సినిమా ఎలాగో సక్సెస్ అవుతుంది అది మరొక మాట. కాకపోతే ఒకే కుటుంబం నుండి ఇద్దరు హీరోలు కేవలం వారాల వ్యవధిలోనే తమ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తే మాత్రం అభిమానులను కాస్త గందరగోళానికి గురిచేసినట్లే అవుతుంది. ఇకపోతే ఇప్పుడు ఏకంగా రెండు కుటుంబాలకు చెందిన హీరోలు కేవలం వారాల వ్యవధిలోనే తమ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ముందు పెదనాన్న తర్వాతే అబ్బాయ్..

వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది రవితేజ. ఆయన సోదరుడు రఘు కొడుకు మాధవ్ భూపతి రాజు. రవితేజ చాలా రోజుల తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆ సక్సెస్ లభించలేదు. చివరిగా మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఏవి కూడా ఆయనకు విజయాన్ని అందించలేదు. ఇక ఇప్పుడు రూట్ మార్చి దైవాత్మికంతో కూడిన ఇరుముడి అనే సినిమా చేస్తున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఇక మరొకవైపు ఈయన సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతి రాజు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ రాబోతున్న చిత్రం మారెమ్మ. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ద్వారా మాధవ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అయితే మాధవ్ తన సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక దీన్ని బట్టి చూస్తే కేవలం 20 రోజుల వ్యవధిలో ఓకే కుటుంబం నుండి ఇద్దరు హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉండడం గమనార్హం.

డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్న దేవరకొండ బ్రదర్స్..

ఇకపోతే మరొకవైపు దేవరకొండ ఫ్యామిలీ నుండి ఇద్దరు సోదరులు కూడా తమ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అయితే వీరు కొంచెం స్మార్ట్ గా ఆలోచిస్తున్నారేమో అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న చిత్రం రణబాలి. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 11వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ముందుగానే ప్రకటించారు.

మరొకవైపు ఆదిత్య హాసన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సోదరుడు ప్రముఖ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ఎపిక్.ఈ సినిమాని ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా చిత్ర బృందం పలుమార్లు వాయిదా వేసింది. ఎలాగైనా సరే తన సినిమాను విడుదల చేయాలని సిద్ధమవుతున్న సమయంలో.. అటు సెప్టెంబర్ లో విజయ్ దేవరకొండ సినిమా విడుదల అవుతుండగా ఇటు ఆనంద్ దేవరకొండ తన సినిమాను విడుదలకు సిద్ధం చేస్తే ఇబ్బంది అవుతుందనే కారణంగా..పైగా రణబాలి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరగడం కారణంగానే.. ఆ సినిమాని వాయిదా వేస్తూ ఇప్పుడు ఆ సినిమా డేట్ ని ఎపిక్ తో భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే సోదరులు ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్ మీద తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారని చెప్పాలి. ఒకవేళ సెప్టెంబర్ 11న ఎపిక్ సినిమా వస్తే. ఆ తర్వాత కొన్ని వారాల గ్యాప్ లో రణబాలి కూడా రిలీజ్ అవుతుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి