Begin typing your search above and press return to search.

కంటెంట్ ఉంటే అవన్నీ ఎందుకు?.. ఇకపై చెక్ పెట్టాల్సిందే!

కంటెంట్.. ఏ సినిమాకు అదే మెయిన్ ఎలిమెంట్.. అది మెప్పించేలా ఉంటే చాలు.. క్యాస్టింగ్, బడ్జెట్ సహా ఏ అంశంతో సంబంధం లేకుండా ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు.

By:  M Prashanth   |   21 Jan 2026 5:00 AM IST
కంటెంట్ ఉంటే అవన్నీ ఎందుకు?.. ఇకపై చెక్ పెట్టాల్సిందే!
X

కంటెంట్.. ఏ సినిమాకు అదే మెయిన్ ఎలిమెంట్.. అది మెప్పించేలా ఉంటే చాలు.. క్యాస్టింగ్, బడ్జెట్ సహా ఏ అంశంతో సంబంధం లేకుండా ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. కచ్చితంగా సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. అందుకే కంటెంట్ పై మూవీల మేకర్స్ సరిగ్గా ఫోకస్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలుస్తాయని చెప్పడంలో నో డౌట్. ఇది ఇప్పటికే.. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలా సార్లు జరిగింది.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కంటెంట్ పై దృష్టి పెట్టకపోవడంపై జోరుగా చర్చ సాగుతోంది. టాలీవుడ్ మేకర్స్ అంతా కచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంతా చెబుతున్నారు. అది కాకుండా బాక్సాఫీస్ వద్ద తప్పుడు ప్రచారాలతో మోసం చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదంగా మారుతుందని అంటున్నారు. అర్జెంట్ గా సెల్ఫ్ బుకింగ్ తోపాటు ఫేక్ పోస్టర్లకు చెక్ పెట్టాల్సిందేనని సూచిస్తున్నారు.

తప్పుడు ప్రచారాలతో ఎప్పుడైనా ప్రేక్షకులను మభ్య పెట్టవచ్చని మేకర్స్ భావిస్తే.. చివరికి నష్టపోయేది వాళ్ళు కచ్చితంగా అవుతారని హెచ్చరిస్తున్నారు. ఆ పద్ధతులు నటులు, నిర్మాతలపై నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులే నష్టపోతున్నారని వారు అంటున్నారు. ఇప్పుడు ఆ విషయంపై నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు.

నిజానికి టాలీవుడ్ లో సెల్ఫ్ బుకింగ్స్ పెరుగుతున్నాయని కొన్ని రోజులుగా వినిపిస్తున్న టాక్. పలు సినిమాలను భారీ హిట్లుగా చూపించేందుకు మేకర్స్.. ప్రధానంగా టికెట్ బుకింగ్ పోర్టల్స్‌ ను ఉపయోగించి ఫేక్ వసూళ్ల వ్యవహారం జరుపుతున్నారని సమాచారం. మెయిన్ సెంటర్స్ లో కొన్ని సీట్లను కావాలని బుక్ చేసి, అవి నిజమైన అమ్మకాలుగా ప్లాట్‌ ఫామ్‌ లో కనిపించేలా చేస్తున్నారట. ఇలా బుక్ చేసిన టికెట్లు గంటల వారీ ట్రెండ్స్‌ లోనూ చేరిపోతాయి.

దీంతో సినిమా డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు ఫేక్ సిగ్నల్ బయటకు వెళ్తుంది. అది టికెట్ల వరకే పరిమితం కావడం లేదు. ఆన్‌ లైన్ రేటింగ్స్, రివ్యూలను డబ్బులతో మేనేజ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పాజిటివ్ రేటింగ్స్ పెంచడం, నెగిటివ్ కామెంట్స్‌ తగ్గించడం ద్వారా సినిమాకు మంచి ఇమేజ్ తీసుకొస్తున్నారని, నిజమైన ప్రేక్షకుల అభిప్రాయాన్ని కవర్ చేస్తున్నారని చాలా మంది అభిప్రాయం.

అదే సమయంలో తప్పుడు కలెక్షన్ పోస్టర్లు ఎక్కువవుతున్నాయని అనేక మంది అంటున్నారు. అధికారికంగా విడుదల చేసిన లెక్కలు, ట్రేడ్ లెక్కల మధ్య భారీ తేడా కనిపిస్తుందని చెబుతున్నారు. బ్లాక్‌ బస్టర్ గా ప్రచారం చేసినా, కలెక్షన్లు మాత్రం అంత స్థాయిలో లేవని అంటున్నారు. ఇటీవల సంక్రాంతి చిత్రాల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి ఇకనైనా ఫేక్ బుకింగ్స్, ఫేక్ పోస్టర్లకు చెక్ పెట్టాలన్నది అనేక మంది అభిప్రాయం. మరి చూడాలి ఏం జరుగుతుందో..