Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్‌ వంశీ పైడిప‌ల్లి రెడీ..మ‌రి శ్రీ‌ను వైట్ల‌!

కెరీర్ ప్రారంభం నుంచి వ‌రుసగా స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని, సూప‌ర్ హిట్‌ల‌ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, శ్రీ‌ను వైట్ల‌.

By:  Ravindar Gorantla   |   7 March 2026 12:13 PM IST
డైరెక్ట‌ర్‌ వంశీ పైడిప‌ల్లి రెడీ..మ‌రి శ్రీ‌ను వైట్ల‌!
X

కెరీర్ ప్రారంభం నుంచి వ‌రుసగా స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని, సూప‌ర్ హిట్‌ల‌ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, శ్రీ‌ను వైట్ల‌. ఇందులో వంశీ పైడిప‌ల్లి గ‌త మూడేళ్లుకు పైనే గ్యాప్ తీసుకున్నారు అన‌డం కంటే ఆయ‌న‌కు గ్యాప్ వ‌చ్చింది అన‌డం క‌రెక్టేమో. కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి రూపొందించిన భారీ మూవీ `వార‌సుడు`. త‌మిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయ‌డం తెలిసిందే. 2023, జ‌న‌వ‌రి 11న సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ.300 కోట్లు రాబ‌ట్టింది.

విజ‌య్ స్టార్‌డ‌మ్ కార‌ణంగా యావ‌రేజ్ టాక్‌ని సొంతం చేసుకున్నా `వార‌సుడు` బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. అయితే బ‌డ్జెట్‌ని బ‌ట్టి చూస్తే మాత్రం ఇదేమంత పెద్ద ఫిగ‌ర్ కాదు. లాస్ రాకుండా అత్తెస‌రు లాభాల‌తో దిల్ రాజు బ‌య‌ట‌ప‌డ్డార‌న్న‌మాట‌. ఈ మూవీ వ‌చ్చి దాదాపు మూడేళ్ల‌కు పైనే అవుతోంది. అప్ప‌టి నుంచి స్టార్‌ల‌తో సినిమా చేయాల‌ని ట్రై చేస్తూ ఉన్నారు వంశీ పైడిప‌ల్లి. అయితే ఏ హీరో కూడా ఖాళీగా లేక‌పోవ‌డం వ‌రుస భారీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉండ‌టంతో వంశీ పైడిప‌ల్లికి వెయిట్ చేయ‌క త‌ప్ప‌లేదు.

మూడేళ్ల‌కు పైనే ఎదురు చూసినా టాలీవుడ్ స్టార్ ఎవ‌రూ ఖాలీగా లేక‌పోవ‌డంతో ఫైన‌ల్‌గా వంశీ పైడిప‌ల్లి బాలీవుడ్ బాట‌ప‌ట్టాడు. అక్క‌డ స‌ల్మాన్ ఖాన్‌ని ఒప్పించి ఫైన‌ల్‌గా ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజ్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వంశీ పైడిప‌ల్లి ఈ ప్రాజెక్ట్‌ని ఏప్రిల్‌లో లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నాడ‌ని తెలిసింది. తెలుగులో స్టార్లుఖాళీ గా లేక‌పోవ‌డంతో మూడేళ్లకు పైగా ఎదురు చూసి ఫైన‌ల్‌గా బాలీవుడ్ స్టార్‌తో సినిమా చేస్తుండ‌గం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే వంశీ పైడిప‌ల్లి - స‌ల్మాన్‌ఖాన్ మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

ఇక `దూకుడు`వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని అందించిన డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల కూడా ఇదే త‌ర‌హా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. బాద్‌షా నుంచి విశ్వం వ‌ర‌కు చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌క‌పోవ‌డంతో శ్రీ‌ను వైట్ల ప్ర‌భావం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. స్టార్ హీరోలెవ‌రూ ఆయ‌న‌కు డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేక‌పోవ‌డంతో గ‌త కొంత కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారాయ‌న‌. ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌కు మంచి హీరో దొరికాడు. త‌నే శ‌ర్వానంద్‌.

రీసెంట్‌గా `నారీ నారీ న‌డుమ మురారి` మూవీతో స‌క్సెస్‌ని సొంతం చేసుకున్న శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. `బైక‌ర్‌` ఇప్ప‌టికే పూర్తి కావ‌డంతో సంప‌త్ నంద్ డైరెక్ష‌న్‌లో `భోగి` మూవీకి శ్రీ‌కారం చుట్టాడు. ఇదే ఊపుతో శ్రీ‌ను వైట్ల‌తో సినిమా చేయ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో రానుంది. ఇప్ప‌టికే రావాలి. మ‌రి ఆల‌స్యం ఎందుకు అవుతుందో తెలియాల్సి ఉంది.