Begin typing your search above and press return to search.

యానిమల్ తో బాబీ.. ఓజీ తో ఇమ్రాన్..?

బాలీవుడ్ స్టార్స్ కి తెలుగు దర్శకులు లక్కీగా మారుతున్నారు. అదెలా అంటే బాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ హిట్లు కొట్టి ఆ తర్వాత ఫాం కోల్పోయిన వారికి మన తెలుగు దర్శకులు క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నారు.

By:  Ramesh Boddu   |   3 Sept 2025 9:47 AM IST
Tollywood Directors Revive Bollywood Stars
X

బాలీవుడ్ స్టార్స్ కి తెలుగు దర్శకులు లక్కీగా మారుతున్నారు. అదెలా అంటే బాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ హిట్లు కొట్టి ఆ తర్వాత ఫాం కోల్పోయిన వారికి మన తెలుగు దర్శకులు క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నారు. అంతేనా ఆ ఛాన్స్ లతో వాళ్లకి సూపర్ హిట్ క్రేజ్ వస్తుంది. రెండేళ్ల క్రితం యానిమల్ సినిమాతో బాబీ డియోల్ కి రెండో లైఫ్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమా తో బాబీ డియోల్ పంట పండినట్టు అయ్యింది. అందులో అతని రోల్ సూపర్ గా క్లిక్ అయ్యింది. ఒకప్పుడు హీరోగా ఎన్నో మంచి సినిమాలు చేసిన బాబీ డియో దాదాపు 10, 15 ఏళ్లుగా సరైన ఫాం లో లేరు. ఎవరు పెద్దగా అవకాశాలు కూడా ఇవ్వట్లేదు.

యానిమల్ తర్వాత బాబీ డియోల్ కి తిరుగులేని క్రేజ్..

అలాంటి బాబీతో యానిమల్ చేసి సర్ ప్రైజ్ హిట్ ఇచ్చాడు. యానిమల్ తర్వాత బాబీ డియోల్ కి తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఐతే ఇప్పుడు అదే సేం సీన్ ఓజీతో ఇమ్రాన్ హష్మీకి రిపీట్ అయ్యేలా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఓమి పాత్రలో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. ఇప్పుడు ఏదో యాక్షన్ సినిమాల్లో అలా విలన్ రోల్స్ లో కనిపిస్తున్నాడు కానీ ఒక 20 ఏళ్ల క్రితం ఇమ్రాన్ హష్మి క్రేజీ రొమాంటిక్ హీరో అని తెలిసిందే. అతన్ని సుజిత్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కి విలన్ ని చేస్తున్నాడు.

ఓజీ సినిమాలో ఓమి రోల్ బాగా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ లో ఓమి పాత్రలో ఇమ్రాన్ లుక్స్ అదిరిపోయాయి. చూస్తుంటే ఓజీతో ఇమ్రాన్ సూపర్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు. ఒకప్పుడు సీరియల్ కిస్సర్ గా.. రొమాంటిక్ సినిమాలతో బీ టౌన్ ఆడియన్స్ ని అలరించిన ఇమ్రాన్ ఈమధ్య ఫాం లో లేడు. కానీ సుజిత్ ఓజీ సినిమా ఛాన్స్ ఇవ్వడంతో సౌత్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు.

ఓజీ లో ఓమి పాత్రలో ఇమ్రాన్..

ఓజీ టీజర్ లో ఇమ్రాన్ ని చూస్తే మాత్రం కచ్చితంగా ఇదేదో బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉందనిపిస్తుంది. అంతేకాదు యానిమల్ తో ఎలా అయితే బాబీ డియోల్ కి క్రేజ్ వచ్చిందో ఓజీతో ఇమ్రాన్ హష్మికి అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. ఓజీ లో ఓమి పాత్రలో ఇమ్రాన్ జస్ట్ శాంపిల్ తోనే అదరగొట్టేశాడు. ఇక సినిమా మొత్తం ఎలా చేశాడో చూడాలని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇదే కాదు ఓజీ తర్వాత అడివి శేష్ గూఢచారి 2 లో కూడా ఇమ్రాన్ హష్మి విలన్ గా చేస్తున్నాడు. ఓజీ తో సూపర్ హిట్ కొడితే జి 2 సినిమాకు కూడా అది కలిసి వస్తుందని చెప్పొచ్చు.