టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల కెరీర్ సవాళ్లు!
అటు పై నందమూరి బాలకృష్ణ తో తెరకెక్కించిన `అఖండ 2` కూడా భారీ దెబ్బ కొట్టింది. దీంతో తదుపరి ప్రాజెక్ట్ విషయంలో బోయపాటి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
By: Srikanth Kontham | 2 May 2026 6:00 PM ISTచిత్ర పరిశ్రమలో తిరుగులేని విజయాలతో దూసుకుపోయిన పలువురు అగ్ర దర్శకులు కొందరిప్పుడు క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నారు. బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు వారి మార్కెట్ విలువను ప్రభావితం చేస్తున్నాయి. అంతేనా? తదుపరి ప్రాజెక్టుల ఎంపికలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. దీంతో ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తోన్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా మేకింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఇప్పుడా దర్శకులపై ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే ఉనికిని చాటుకోవడానికి ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే..
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటి శ్రీను డిఫెన్స్‌లో పడ్డారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `స్కంద` బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం ఇమేజ్‌ను దెబ్బతీసింది. అటు పై నందమూరి బాలకృష్ణ తో తెరకెక్కించిన `అఖండ 2` కూడా భారీ దెబ్బ కొట్టింది. దీంతో తదుపరి ప్రాజెక్ట్ విషయంలో బోయపాటి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మాస్ పల్స్‌ను నమ్మి డేట్స్ ఇచ్చే స్టార్ హీరో కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే స్క్రిప్ట్ విషయంలో కొత్త ప్రయోగాలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిస్థితి అత్యంత కీలకంగా మారింది.
`లైగర్` తర్వాత వచ్చిన ``డబుల్ ఇస్మార్ట్` కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పూరీ గ్రాఫ్ పడిపోయింది. దీంతో పూరి కూడా స్టైల్ మార్చాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో? `స్లమ్ డాగ్` అనే సినిమా చేస్తున్నారు. సాధారణంగా పూరి టైటిల్స్ చాలా షార్ప్ గా క్యాచీగా ఉంటాయి. కానీ ఈసారి టైటిల్ తోనే తానో కొత్త కథని డైరెక్ట్ చేస్తున్నానని చెప్పకనే చెబుతున్నారు. ఈ ప్రయోగం పూరికి పూర్వ వైభవం తీసుకొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డికి `ఏజెంట్` పెద్ద బ్రేక్ వేసింది. అప్పటి నుంచి సూరి ఖాళీగానే ఉంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్ ఒకే అయింది కానీ పట్టాలెక్కేది ఎప్పుడు? అన్నది క్లారిటీ లేదు. అలాగే మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నారు. వరుస ప్లాప్ లు అతడిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన `ఉస్తాద్ భగత్ సింగ్` తోనైనా ఫాంలో కి వస్తాడు? అనుకుంటే ఫలితం తీవ్ర నిరాశనే మిగిల్చింది. దీందో ఇప్పట్లో హరీష్ కి మరో ఛాన్స్ సాద్యమైనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తదుపరి చిత్రాలతో వీరంతా బాక్సాఫీస్ లెక్కలు మారిస్తేనే? స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది.సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఓ గ్రాఫ్ లాంటింది. హిట్ పడితే మళ్ళీ అగ్రస్థానానికి చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అదంత సులభం కాదన్నది అంతే వాస్తవం.
