అప్పట్లో కమర్షియల్ సినిమాలను ముందుకు తీసుకెళ్లిన నలుగురు దర్శకులు...
తెలుగు డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
By: Gopi Velupala | 11 Oct 2026 2:16 PM ISTతెలుగు డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాలు ఎక్కువగా వస్తుండేవి. అలాంటి మూవీస్ చూడడానికే తెలుగు ప్రేక్షకులు సైతం సిద్ధంగా ఉండేవారు. స్టార్ హీరోలు ఆర్ట్ సినిమాలు చేసిన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ మూవీస్ కి కేవలం విమర్శకుల ప్రశంసలు దక్కేవి కానీ కమర్షియల్ సక్సెస్ లను సాధించేవి కాదు...
2000 -2015 కమర్షియల్ డైరెక్టర్స్
అప్పట్లో ప్రేక్షకుడి అభిరుచిని తెలుసుకొని పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలతో సక్సెసులు సాధించిన దర్శకులు రాజమౌళి, పూరి జగన్నాథ్, వివి వినాయక్, త్రివిక్రమ్... వీళ్ళు నలుగురు 2000 - 2015 మధ్య పర్ఫెక్ట్ కమర్షియల్ టెంప్లేట్ లోనే సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించారు. నిజానికి వాళ్లు వైవిద్య భరితమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించిన కూడా అప్పుడున్న ప్రేక్షకుల అభిరుచి మేరకు కమర్షియల్ సినిమాలే చేసేవారు. అవైతేనే సేఫ్ జోన్ లో ఉండొచ్చని, తమకు సక్సెస్ దక్కుతుందని ప్రొడ్యూసర్లకు సినిమా మీద పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయనే కాన్ఫిడెంట్ ఉండేది. దానివల్లే రాజమౌళి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాలను చిత్రీకరిస్తే పూరి జగన్నాథ్ పంచు డైలాగుల మీద సినిమాని నడిపించేవాడు. త్రివిక్రమ్ ఎమోషనల్ గా కంటెంట్ ని ప్రేక్షకుడికి కనెక్ట్ చేస్తూ సమపాళ్లలో కామెడీని మిళితం చేసి ప్రేక్షకులను మెప్పించేవాడు. ఇక వివి వినాయక్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మాస్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేస్తూ సుమోలను గాల్లోకి లేపుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. మొత్తానికైతే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన ఈ నలుగురు దర్శకులు కాలక్రమేణ ప్రేక్షకుడి అభిరుచి మేరకు వాళ్ళ పంథా ను మార్చుకుంటూ వచ్చారు. ఒకప్పుడు స్టార్ హీరోలకు ఈ నలుగురు బెస్ట్ ఆప్షన్ గా ఉండేవారు. ప్రేక్షకులు సైతం వీళ్ళ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించేవారు... ఇప్పుడు రాజమౌళి, త్రివిక్రమ్ మాత్రమే యాక్టివ్ గా ముందుకు సాగుతున్నారు. పూరి జగన్నాథ్ అడపదడపా సినిమాలు చేసిన అవి పెద్దగా క్లిక్ అవ్వడం లేదు. విజయ్ సేతుపతి తో చేసిన 'స్లమ్ డాగ్' మూవీ రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ మూవీ సక్సెస్ సాధిస్తే పూరి మరోసారి స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశం దక్కుతొంది. వినాయక్ ప్రస్తుతం సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేసినట్టుగా కనిపించడం లేదు...
రాజమౌళి - త్రివిక్రమ్
రాజమౌళి ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాలక్రమేనా ప్రేక్షకుడి టేస్ట్ మేరకు తన కథల సెలెక్షన్ మార్చుకున్నాడు. వారణాసి సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్ల పక్కన తను ప్లేస్ సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టి ప్రపంచ స్థాయి మేకర్ గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు... ఇప్పటికీ రాజమౌళి తన సినిమాలో ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తాడు. సినిమా చూసే సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా సన్నివేశాలను తీర్చిదిద్ది హీరోకి భారీ ఎలివేషన్ ఇస్తాడు.
త్రివిక్రమ్
ప్రస్తుతం త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' సినిమా చేస్తున్నాడు. తొందరలోనే ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. దీని తర్వాత ఆయన ఎన్టీఆర్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా క్లారిటి గా ఉన్నాడు. ఎలాగైనా సరే ఈ సినిమాతో ఇండస్ట్రీలో రికార్డులను బ్రేక్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా ఫిలిం నగర్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి...
