Begin typing your search above and press return to search.

హిట్లు లేక సతమతమవుతున్న డైరెక్టర్లు!

పరిశ్రమలో విజయాలు, అపజయాలు నాణేనికి రెండు బొమ్మల లాంటివి. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి స్టార్ హీరోలతో భారీ విజయాలు అందుకున్న పలువురు దర్శకులు సరైన హిట్ లేక సతమ తమవుతున్నారు.

By:  Srikanth Kontham   |   3 Aug 2026 11:56 PM IST
హిట్లు లేక సతమతమవుతున్న డైరెక్టర్లు!
X

పరిశ్రమలో విజయాలు, అపజయాలు నాణేనికి రెండు బొమ్మల లాంటివి. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి స్టార్ హీరోలతో భారీ విజయాలు అందుకున్న పలువురు దర్శకులు సరైన హిట్ లేక సతమ తమవుతున్నారు. వరుస పరాజయాల కారణంగా కొందరు దర్శకులు తదుపరి అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జాబితాలో హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, కిషోర్ తిరుమల, గౌతం తిన్ననూరి వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో కమర్షియల్ మాస్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన వీరంతా మునుపటి వైభవం కోసం వేచి చూస్తున్నారు.

మారుతోన్న ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా కథలను మలచడంలో వీరంతా కొంత తడబడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ చిత్రాల దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అలాగే విలక్షణ మాస్ ఎంటర్‌టైనర్లతో మెప్పిం చిన హరీష్ శంకర్ కూడా సరైన హిట్ కోసం శ్రమిస్తున్నారు. ఈ దర్శకుల నుంచి రిలీజ్ అయ్యే సినిమాలపై భారీ అంచనాలు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఫలితాలు తారుమారైనప్పుడు అది వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

మరోవైపు క్లాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిషోర్ తిరుమల కూడా బలమైన విజయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే `జెర్సీ` సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గౌతం తిన్ననూరి కూడా తదుపరి ప్రాజెక్ట్‌లతో పూర్వ వైభవాన్ని నిరూపించుకోవాల్సిన సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. కొత్త తరహా కథలతో వ‌స్తోన్న‌ యువ దర్శకుల పోటీతత్వం మధ్య సీనియర్ దర్శకులు సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది.

పరిశ్రమలో టాలెంట్ ఉన్నా? సరైన సమయంలో సరైన కథ పడకపోతే ఏ స్థాయి దర్శకులకైనా ఇబ్బందులు తప్ప‌వు. అయితే అనుభవం ఉన్న ఈ దర్శకులు పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని సరికొత్త కంటెంట్‌తో పునరాగమనం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నాడిని పట్టుకుని మళ్లీ ఎలాంటి విజయాలు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. హిట్లు లేక‌ వెనుకబడిన ఈ ప్రతిభావంతులైన దర్శకుల కెరీర్ మలుపులు టాలీవుడ్‌లో ఎప్పుడూ చర్చనీయాంశమే. సరైన హీరోతో, బలమైన స్క్రిప్ట్‌తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్న తరుణంలో కేవలం గత విజయాల మీదే ఆధారపడకుండా సరికొత్త ప్రయోగానికి సిద్ధమవడం ఈ దర్శకులకు కీలకం కానుంది. కాలానికి తగినట్లుగా కథల ఎంపికలో మార్పులు చేసు కుంటూ యువ దర్శకులతో పోటీపడేలా వినూత్న ప్రయత్నాలు చేస్తేనే టాలీవుడ్‌లో సత్తాను తిరిగి నిరూ పించుకోగలరు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వీరంతా తెరకెక్కించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయనేది చూడాలి.