వాళ్లిద్దరి హీరోలు ఎవరన్నది ఆసక్తికరం!
యంగ్ డైరెక్టర్స్ అనీల్ రావిపూడి, మారుతి పరిచయం అవసరం లేని పేర్లు. ఇండస్ట్రీలో సక్సెస్ పుల్ గా దూసుకు పోతున్న దర్శకులు.
By: Srikanth Kontham | 8 Jan 2026 2:00 PM ISTయంగ్ డైరెక్టర్స్ అనీల్ రావిపూడి, మారుతి పరిచయం అవసరం లేని పేర్లు. ఇండస్ట్రీలో సక్సెస్ పుల్ గా దూసుకు పోతున్న దర్శకులు. ఈ సంక్రాంతికి వాళ్లు డైరెక్ట్ చేసిన సినిమాలు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. చిరంజీవి నటించిన `మన శంకర వరప్రసాద్ గారు` తో అనీల్ రావిపూడి.. డార్లింగ్ ప్రభాస్ నటించిన `ది రాజాసాబ్` తో మారుతి సిద్దంగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చిత్రాలే. హిట్ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నది బయట నడుస్తోన్న చర్చ.
ఈ నేపథ్యంలో వీరిద్దరి తదుపరి హీరోలు ఎవరు? అన్నది ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారింది. అనీల్ ఏ హీరోని డైరెక్ట్ చేస్తాడు? మారుతి ఏ హీరోతో సినిమా చేస్తాడు? అంటూ అభిమానులు సహా ప్రేక్షకుల్లో అప్పుడే డిస్కషన్ మొదలైంది. మొన్నటి వరకూ సినిమా షూటింగ్ సహా రకరకాల బిజీలో ఉండటంతో? ఆ విషయంపై ఎవరూ దృష్టి పెట్టలేదు. పైనల్ గా రాజాసాబ్ మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతుండగా..మరో నాలుగు రోజుల్లో శంకర ప్రసాద్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో మారుతి, అనీల్ హాట్ టాపిక్ గా మారుతున్నారు.
ఇంత వరకూ అనీల్ ఏ హీరోతో సినిమా చేస్తాడు? అన్నది ఎక్కడా ప్రకటించలేదు. మారుతి కూడా తన హీరో ఎవరు అన్నది రివీల్ చేయలేదు. ఇప్పటికే స్టోరీలు సిద్దం చేసుకుని పెట్టుకునే ఉంటార అన్న గెస్సింగ్ ఉంది. రఫ్ గా కొంత మంది హీరోలు కూడా మైండ్ లో ఉండటం సహజం. కానీ ఆ వివరాలేవి మాత్రం మారుతి, అనీల్ ఎక్కడా లీక్ ఇవ్వలేదు. ఈ రెండు రిలీజ్ లు సక్సెస్ అయితే ఆ దర్శకులపై ఒత్తిడి పెరుగుతుంది. దర్శకులుగా బాధ్యత రెట్టింపు అవుతుంది. దీంతో హీరోల రేంజ్ కూడా అదే స్థాయిలో ఉండొచ్చు. టాప్ స్టార్లపైనే గురి పెట్టే అవకాశం ఉంటుంది.
కానీ విశేషం ఏంటంటే? టైర్ వన్ హీరోలంతా పుల్ బిజీగా ఉన్నారు. వాళ్లున్న బిజీలో డేట్లు ఇవ్వడం కూడా సాధ్యపడదు. ఏడాదిన్నర రెండేళ్ల పాటు వాళ్లవైపు చూసే పరిస్థితే లేదు. టైర్ 2, టైర్ 3 హీరోలు కూడా వేర్వేరు కమిట్ మెంట్లతో ఉన్నారు. ఇప్పటికే కొందరు హీరోలు ఆన్ సెట్స్ లో ఉన్నారు. వాటి తర్వాత లైనప్ కూడా క్లియర్ గా ఉంది. ఈ నేపథ్యంలో అనీల్..మారుతి హీరోలు ఎవరవుతారు? అన్నది సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.
