Begin typing your search above and press return to search.

సూరి మ‌రీ ఇంత సైలెంట్ అయితే ఎలా?

రెండు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి చేసిన సినిమాలు ఎన్ని? అంటే ప‌ది సినిమాలు మాత్ర‌మే.

By:  Srikanth Kontham   |   13 Sept 2025 11:50 AM IST
సూరి మ‌రీ ఇంత సైలెంట్ అయితే ఎలా?
X

రెండు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి చేసిన సినిమాలు ఎన్ని? అంటే ప‌ది సినిమాలు మాత్ర‌మే. `అత‌నొక్క‌డే` నుంచి `ఏజెంట్` వ‌ర‌కూ ఆయ‌న చేసిన‌వి పది చిత్రాలే. దీంతో సినిమాలు చేయ‌డంలో సురేంద‌ర్ రెడ్డి డెడ్ స్లో అని చెప్పొచ్చు. సురేంద‌ర్ రెడ్డితో పాటు వ‌చ్చిన ద‌ర్శ‌కులు చాలా సినిమాలు పూర్తి చేసారు. కానీ సూరి మాత్రం రెండు ద‌శాబ్దాలు పూర్తి చేసుకున్నా? అంతే స్లోగా ప‌ని చేస్తున్నారు. హిట్స్ ఉన్నా? లేక‌పోయినా ఆయ‌న సినిమాలు చేసే విధాన‌మే అంత‌. సాధార‌ణంగా ఫెయిలైన త‌ర్వాత అవ‌కాశాలు రాక చాలా మంద ద‌ర్శ‌కులు ఖాళీగా ఉంటారు.

ఏజెంట్ త‌ర్వాత మూడేళ్ల‌గా:

కానీ సూరి మాత్రం అందుకు భిన్నం. భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో ఉన్నా త‌దుప‌రి ప్రాజెక్ట్ విష‌యంలో ఏళ్ల‌కు ఏళ్లు స‌మయం తీసుకుంటారు. కెరీర్ ఆరంభం నుంచి ఆయ‌న ఇదే విధానంలో సినిమాలు చేసుకుంటూ వ‌స్తు న్నారు. చివ‌రిగా మూడేళ్ల క్రితం అక్కినేని వార‌సుడు అఖిల్ తో `ఏజెంట్` సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియాలో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ చివ‌రి నిమిష‌యంలో ఫ‌లితం ముందే గ‌మ‌నించిన సూరి రీజ‌న‌ల్ మార్కెట్ కే ప‌రిమితం చేసారు. ఆ సినిమా ప్లాప్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ సూరి ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ మొద‌లు పెట్ట‌లేదు.

ప‌వ‌న్ తో క‌మిట్ మెంట్ ఎంత‌వ‌ర‌కూ:

అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ సూరి తీసుక‌న్న గ్యాప్ వేరు...ఇప్పుడొస్తున్న గ్యాప్ వేరుగా ప‌రిశ్ర‌మ‌లో క‌నిపిస్తోంది. ఇప్పుడా య‌న తొంద‌ర ప‌డుతున్నా? హీరోలు తొంద‌ర‌ప‌డే ప‌రిస్థితి లేదు. క‌థ‌ల విష‌యంలో స్టార్ హీరోలంతా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టైర్-2 హీరోలు, మీడియం రేంజ్ హీరోలు కూడా ద‌ర్శ‌కుడి ట్రాక్ అన్ని ర‌కాలుగా చెక్ చేసి అవ‌కాశం ఇస్తున్నారు. స్టోరీ సెల‌క్ష‌న్ లో ఇన్నోవేటివ్ గా ఉంటున్నారు. అలాంటి క‌థ‌లొస్తే అనుభ‌వంతో ప‌ని లేకుం డా ఒకే చేస్తున్నారు. సూరి కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌మిట్ మెంట్ ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కేది ఎప్పుడు? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు.

సూరి మ‌న‌సులో ఏముందో?

సూరి అల‌స‌త్వం...పవ‌న్ బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అన్న దానిపై స‌రైన స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. వ‌చ్చే ఏడాది ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం త‌ప్ప అది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. అయితే సూరి మాత్రం మునుప‌టిలా డ‌ల్ గా ఉంటే ప‌న‌వ్వ‌దు. పోటీలో నెట్టుకు రావాలంటే తాను కూడా అంతే యాక్టివ్ గా ప‌ని చేయాల‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ప్ర‌ధానంగా డైరెక్ట‌ర్ల మ‌ధ్య పోటీ ఎక్కువ‌వుతోన్న త‌రుణంలో సూరి స్పీడ‌ప్ అవ్వాల‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఆయ‌న మ‌న‌సులో ఏముందో.