మళ్లీ ఆయన ప్రయత్నాలు ఫలించేనా?
నమ్మి అవకాశం ఇస్తే ముంచేయడం ఎలా అన్నది ఆ డైరెక్టర్ కి బాగా తెలుసు. ఇలా ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.
By: Srikanth Kontham | 10 Aug 2025 3:00 AM ISTనమ్మి అవకాశం ఇస్తే ముంచేయడం ఎలా అన్నది ఆ డైరెక్టర్ కి బాగా తెలుసు. ఇలా ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు. ఏకంగా ఐదు సార్లు జరిగింది. మధ్యలో ఓసారి మాత్రం ఓ సినిమా యావరేజ్ పాజిటివ్ రిజల్ట్ తో గట్టె క్కింది. మిగితా సినిమాలన్నీ ఒకే ఫలితాన్ని సాధించాయి. అందులో ఓ హీరో అయితే ఒక సారి కాదు. రెండు సార్లు ఎదురు దెబ్బ తిన్నాడు. ఇలా ఎలా సాధ్యమైంది? అంటే అతడిలో ఉన్న ఓ యూనిక్ క్వాలిటీ వల్ల. అతడో గొప్ప స్టోరీ టెల్లర్. కథ చెబుతూనే హీరోకి సినిమా చూపిస్తాడు. హీరో పాత్రని ఓరేంజ్ లో ఎలివేట్ చేస్తాడు.
స్టోరీలు వినిపించే ట్యాలెంట్ లేక:
అలాంటి ఎలివేషన్లే కొంప ముంచుతాయని సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది. సాధారణంగా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు స్టోరీలు సరిగ్గా నేరేట్ చేయలేరు. కొంత మంది సోసోగా నేరేట్ చేసినా దర్శకు లపై నమ్మకంతో హీరోలు ముందుకెళ్లిపోతారు. శేఖర్ కమ్ములా స్టోరీ బాగా రాసుకుంటారు. కానీ హీరోకి నేరేట్ చేయలేరు. కానీ సినిమా మాత్రం అద్బుతంగా తీయగలడని అతడి సక్సస్ లే చెబుతాయి. సుకుమార్ విధానం కూడా ఇలాగే ఉంటుంది. హీరోకి కథ చెప్పాలంటే గందరగోళానికి గురవుతుంటారు. ఇండ స్ట్రీలో చాలా మంది ఇలాగే ఉంటారు.
నమ్మి అవకాశం ఇస్తే:
హీరోలంతా వీళ్లపై నమ్మకంతో.. వాళ్ల సక్సెస్ ట్రాక్ చూసి లైన్ నచ్చ గానే ముందుకెళ్లిపోతారు. పూరి జగ న్నాధ్, త్రివిక్రమ్ అయితే హీరోలకు మంచి నేరేషన్ ఇస్తుంటారు. చెప్పింది చెప్పినట్లు తీస్తుంటారు. కానీ ఆ ఒక్కడు మాత్రం చెప్పింది ఒకటి చేసేది మరోటి. పూరి, గురూజీలను మంచి గొప్ప నేరేషన్ ఇస్తాడు. కానీ పైనల్ ఔట్ పుట్ మాత్రం మరోలా ఉంటుంది. ఆ డైరెక్టర్ కి సక్సెస్ రాకపోవడానికి ఇదే కారణంగా చెబు తుంటారంతా. దాదాపు పదేళ్ల తర్వాత ఓ స్టార్ ఎంతో నమ్మి అవకాశం ఇస్తే? ఆ హీరోకి కూడా భారీ డిజాస్టర్ ఇచ్చాడు.
ఎదురు చూపుకు ఫలితం దక్కేనా?
ఈ పదేళ్ల కాలంలో చాలా మంది హీరోల కోసం ప్రయత్నించాడు. కానీ ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ ఇచ్చినా ఒక్క హీరో నెత్తిన శటగోపం పెట్టాడు. తాజాగా అదే డైరెక్టర్ ఓ యువ హీరోని టార్గెట్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలాగో అతడిని ఒప్పించి ఈ మధ్యనే కథ చెప్పాడుట. స్టోరీ నచ్చడంతో హీరో కూడా చూద్దాం అన్నట్లు మాట్లాడాడుట. కానీ మళ్లీ రెండవ సారి కలిసే ప్రయత్నం చేస్తే టచ్ లోకి రావడం లేదని అతడి సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. మరి విదేశాలకు వెళ్లి టచ్ లోకి రాలేకపోతున్నాడా? బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఎస్కేప్ అవుతున్నాడా? తెలియాలి. ఆ డైరెక్టర్ మాత్రం అతడి ఫోన్ కాల్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడుట.
