Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోల‌తో డైరెక్ట‌ర్ల ర్యాపో!

టాలీవుడ్ అంటే కేవలం గ్లామర్ ప్రపంచమే కాదు. ఇక్కడ వృత్తిపరమైన బంధాలను దాటి బలమైన స్నేహాలు, ఆత్మీయతలు క‌నిపిస్తుంటాయి.

By:  Srikanth Kontham   |   17 March 2026 7:00 PM IST
టాలీవుడ్ హీరోల‌తో డైరెక్ట‌ర్ల ర్యాపో!
X

టాలీవుడ్ అంటే కేవలం గ్లామర్ ప్రపంచమే కాదు. ఇక్కడ వృత్తిపరమైన బంధాలను దాటి బలమైన స్నేహాలు, ఆత్మీయతలు క‌నిపిస్తుంటాయి. ముఖ్యంగా హీరోలు -దర్శకుల మధ్య ఉండే బాండింగ్ ఎంతో ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతుంది. సెట్స్‌పై పని ఒత్తిడిని పక్కన పెట్టి, ఒకరినొకరు అన్నదమ్ములుగా, బావలుగా భావించే సంస్కృతి పరిశ్రమలో కనిపిస్తుంది. వెండి తెర‌పై అద్భుతాలకు ఈ ర‌క‌మైన ర్యాపోని కూడా ఓ కార‌ణంగా చెప్పొచ్చు.ఇండస్ట్రీలో ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకోవడం ఒక క్రేజీ ట్రెండ్. ఇందులో బావ అనే పదం అత్యంత పాపులర్.

ప‌వర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు హరీష్ శంకర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హరీష్ పవన్‌ను తన అభిమాన హీరోగా మాత్రమే కాదు. ఒక ఆత్మీయుడిగా భావిస్తారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి అభిమానులు సైతం ముచ్చట ప‌డుతుంటారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ మధ్య మంచి బాండింగ్ ఉంది. `రంగస్థలం` సినిమా సమయంలో ఒకరికొకరు ఎంతో దగ్గరయ్యారు. చరణ్‌ను సుకుమార్ తన సొంత తమ్ముడిలా చూస్తారు. షూటింగ్ లేని సమయంలో కూడా వీరు కలుస్తుంటారు.

దర్శకధీరుడు రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తుంటే? ప్రభాస్ మాత్రం ఆయన్ని ఒక గురువులా, తన ఇంటి సభ్యుడిలా భావిస్తారు. చాలా మంది ద‌ర్శ‌కుల్ని ప్ర‌భాస్ కామ‌న్ గా డార్లింగ్ అని సంబోధిస్తస్తుంటారు. ఆ ర‌క‌మైన ర్యాపో ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ తో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ ల‌ మధ్య ఉండే ర్యాపో చాలా క్లాసిక్‌గా ఉంటుంది. వీరిద్దరూ కలిస్తే అక్కడ కేవలం సినిమా చర్చలే కాకుండా సాహిత్యం, జీవితం గురించి బోలెడన్ని ముచ్చట్లు ఉంటాయి. మహేష్ బాడీ లాంగ్వేజ్‌ను త్రివిక్రమ్ పట్టుకున్నంతగా మరెవరూ పట్టుకోలేరని ఇండ‌స్ట్రీలో చాలా మంది నమ్ము తుంటారు.

వీరిద్దరి మధ్య ఉన్న కంఫర్ట్ జోన్ వల్లే `అతడు`, `గుంటూరు కారం` లాంటి విజ‌యాలు సాద్య‌మ‌య్యాయి.మాస్ మహారాజా రవితేజ పూరీ జగన్నాధ్‌ల మధ్య ఉండే బాండింగ్ ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. వీరిద్దరూ కెరీర్ ప్రారంభం నుంచి కలిసి ప్రయాణించారు. రవితేజలోని ఎనర్జీని పూరీ తన డైలాగులతో ఎలా ఎలివేట్ చేస్తారో అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉండే చనువు చూస్తుంటే? పక్కా మాస్ స్నేహితులు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బాగా క్లోజ్ అయిన ద‌ర్శ‌కులంద‌రితో ర‌వితేజ అంతే సాన్నిహిత్యంగా మెలుగుతారు.

అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఉంద‌ని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటారు. ఒకరినొకరు అత్యంత గౌరవించుకుంటూనే, స్నేహితులుగా ఉంటారు. హ‌రీష్ శంక‌ర్ చాలా మంది హీరోల‌ను అన్న‌య్య‌గా సంబోధిస్తుంటారు. బాగా చ‌నువుగా ఉన్న వారిని బావ అని పిలుస్తుంటారు. ముగింపు గా చెప్పాలంటే? ఒక దర్శకుడు హీరోని ఎంత బాగా అర్థం చేసుకుంటే? ఆ సినిమా అంత పవర్‌ఫుల్‌గా వస్తుంది. ఈ వ్యక్తిగత ర్యాపో కేవలం పిలుపులకే పరిమితం కాకుండా? ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉండటం వరకు సాగుతుంది. టాలీవుడ్‌లో డైరెక్టర్-హీరో కెమిస్ట్రీ అనేది సినిమాలకు ప్రాణవాయువు లాంటిదిగా చెప్పొచ్చు.