Begin typing your search above and press return to search.

అత‌డి స‌వాల్ ని ప్ర‌త్య‌ర్దులు ఎలా తీసుకుంటున్నారు?

టాలీవుడ్‌లో ఓ యంగ్ డైరెక్టర్ కంటెంట్ విషయంలో చేసిన బహిరంగ సవాల్ చర్చనీయాంశంగా మారింది. తక్కువ బడ్జెట్‌లో బలమైన కథతో ప్రేక్షకులను మెప్పించగలనన్న ఆయన వ్యాఖ్యలపై ఇతర దర్శకులు కూడా దృష్టి పెట్టారు. ఇటీవలే ఆయన తెరకెక్కించిన సినిమా విజయం సాధించడంతో పెద్ద హీరోతో అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదనే చర్చ సాగుతోంది.

By:  Srikanth Kontham   |   26 Nov 2026 10:00 PM IST
అత‌డి స‌వాల్ ని ప్ర‌త్య‌ర్దులు ఎలా తీసుకుంటున్నారు?
X

టాలీవుడ్ లో ఇప్పుడో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తనదైన సహజ శైలి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఓ యంగ్ డైరెక్టర్ కంటెంట్ విషయంలో ఇటీవల విసిరిన బహిరంగ సవాల్ ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారింది. రొటీన్ ఫార్ములాలను పక్కన పెట్టి అసలైన సినిమా అంటే ఏంటో చూపిస్తానన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి శిబిరాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో పోటీ ఉన్నా? ఎవరికి వారు సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. కానీ ఈసారి ఆ దర్శకుడు నేరుగా సవాల్ విసరడంతో ఆయనతో పోటీ పడుతున్న మిగతా మేకర్స్, ప్రత్యర్థులు దీనిని ఎలా తీసుకుంటున్నారనేది ? ఆసక్తికరంగా మారింది.

కొందరు దీన్నీ ఆరోగ్యకరమైన పోటీగా భావిస్తుంటే? మరికొందరు మాత్రం తమ సామర్థ్యాన్ని ప్రశ్నించినట్లుగా చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ హంగులు.. భారీ బడ్జెట్‌లే విజయానికి కొలమానం అనుకునే వర్గాలకు ఈ సవాల్ ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితే. తక్కువ బడ్జెట్‌లోనే బలమైన కథతో ప్రేక్షకులను మెప్పించగలమనే నమ్మకాన్ని ఆ దర్శకుడు వ్యక్తం చేయడం మిగతా వారికి సవాలుగా మారుతుంది. మాటలతో కాకుండా రాబోయే ప్రాజెక్టుల విజయా లతోనే సమాధానం చెప్పాలని గట్టిగా భావిస్తున్నట్లు క‌నిపిస్తుంది.

మరోవైపు అదే జోనర్‌లో సినిమాలు తీస్తూ తమకంటూ మార్కెట్ ఏర్పరుచుకున్న ఇతర యువ దర్శకులు కూడా ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఆయనే అంత కాన్ఫిడెంట్‌గా ఉంటే మనం ఇంకెంత కొత్తగా ఆలోచిం చాలనే కోణంలో స్క్రిప్టులకు పదును పెడుతున్నారు. ఒక రకంగా ఈ సవాల్ ఇండస్ట్రీలో కొత్త తరహా ఆలోచనలకు తెరలేపిందని చెప్పొచ్చు. అయితే సవాల్ విసరడం సులభమే. కానీ దానిని తెరపై నిరూపించుకోవడం అంత తేలిక కాదని ప్రత్యర్థి వర్గాలు అభిప్రాయపడొచ్చు.

బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల తీర్పే అంతిమమని అక్కడ గెలిచినప్పుడే ఆ మాటలకు విలువ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో బయటకు నేరుగా స్పందించకపోయినా? లోలోపల మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమ వుతున్నారు. మరి అన్న మాట‌ను స‌ద‌రు ద‌ర్శ‌కుడు నిల‌బెట్టుకుంటాడా? ఈ విష‌యంలో ప్ర‌త్య‌ర్దుల వ్యూహాలు ఎలా ఉంటాయి? అన్న‌ది చూడాలి. అన్న‌ట్లు ఇటీవ‌లే ఆ ద‌ర్శ‌కుడు తీసిన సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో పెద్ద హీరో ఛాన్స్ ఇచ్చినా? ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.