సెలబ్రిటీస్ మ్యారేజెస్..మళ్లీ ఆ రోజులొస్తాయా?
అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌లతో కొత్త సంప్రదాయానికి తెరలేపడం చర్చనీయాంశంగా మారింది.
By: Ravindar Gorantla | 28 Feb 2026 12:30 PM ISTసెలబ్రిటీల వివాహాలు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ వారు చేస్తున్న హంగామా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొంత మంది స్టార్స్ యూకె, ఇటలీ వంటి దేశాల్లోని ప్రత్యేక ప్రాంతాలకు వెళ్లి కొంద మంది ప్రత్యేక ఏర్పాట్ల మధ్య వివాహాలు చేసుకుంటుంటే మరి కొంత మంది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లాంటి హిస్టారికల్ ప్లేసెస్‌లకు వెళ్లి లావిష్ అండ్ నెవర్ బిఫోర్ అనే స్థాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌లతో కొత్త సంప్రదాయానికి తెరలేపడం చర్చనీయాంశంగా మారింది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్, క్రేజీ స్టార్ రష్మికమందన్న ఫైనల్‌గా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం తెలుగు, కొడుగు సంప్రదాయాల మధ్య జరిగింది. ఆత్మీయులు, బంధువులు, ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొనగా అట్టహాసంగా, సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించినవీ నవదంపతులు వేసుకున్న బంగారు ఆభరణాలే. ముఖ్యంగా రష్మిక రస్టెడ్ ఆరెంజ్ కలర్ బనారస్ పట్టుచీరలో ఒంటి నిండా బంగారు నగలతో పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది.
రాజుల కాలం నాటి రోజుల్ని...
అత్యంత వైభవంగ జరిగిన ఈ వివాహ వేడుకలో రష్మిక మందన్న అచ్చు దేవకన్యలా కనిపిస్తే విజయ్ దేవరకొండ మహారాజుగా కనిపించాడు. అలనాటి రాజులని గుర్తు చేశాడు. ఈ పెళ్లిలో విజయ్ దేవరకొండ ధరించిన వస్త్రధారణ, నగలు అచ్చం రాజుల కాలం నాటి నగలను గుర్తు చేస్తున్నాయి. పట్టుపంచె, ఎర్రని అంగ వస్త్రంతో సింపుల్‌గా ఆకట్టుకున్నాడు. విజయ్ కంఠాభరణం, చేతికున్న కడియాలు, చెవుల దిద్దులను ఏనుగులు, సింహాలు, పువ్వులతో డిజైన్ చేసి అలనాటి రాజ కళ ఉట్టిపడేలా చేశారు. తను ధరించిన అంగవస్త్రంపైనా అలాంటి డిజైన్‌లే ఉన్నాయి.
హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ నగల దుకాణం దక్షిణభారత వాస్తు శిల్పాల పేరుతో వీటిని పది నెలల పాటు శ్రమించి రూపొందించింది. పూర్వ కాలంలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే వివాహాల్లో వరుడు వేషధారణ ఇంచుమించి ఇదే తరహాలో ఉండేదని కొన్ని పురాణాల్లో, చారిత్రక పుస్తకాల్లో కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ వివాహం ఇప్పుడు ఆనాటి జ్ఞాపకాల్ని, భారతీయ హిందూ వ్యవస్థలోని వివాహాలని గుర్తు చేస్తోందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో విజయ్ ధరించిన అభరాణాలు, పూన్వం భారతీయ హిందూ వివాహాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మళ్లీ ఆ రోజులొస్తాయా? అని అంతా చర్చించుకుంటున్నారు.
శిరీష్ ధరించిన నెక్లెస్‌పై ట్రోలింగ్...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహం నయనిక రెడ్డితో జరగనుంది. ఇటీవలే వీరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అక్టోబర్ 31న హైదరాబాద్‌లో ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనగా వీరి ఎంగేజ్‌మెంట్ అత్యంత వైభవంగా జరిగింది. తాజాగా శిరీష్ తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఎంగేజ్‌మెంట్‌లో శిరీష్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెడలో నెక్లెస్ ధరించి కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
శిరీష్ ధరించిన నక్లెస్ నెట్టింట చర్చకు దారి తీసింది. కొంత మంది ట్రోల్ చేస్తే మరి కొంత మంది ఎంగెజ్‌మెంట్‌లో చాలా స్పెషల్‌గా మీరే ఉన్నారని, మీలో రాజసం ఉట్టిపడుతోందని కొంత మంది ప్రశంసలు కురిపించారు. శిరీష్ మెడలో ధరించిన నెక్లెస్ విక్టోరియన్ కాలం నాటి వజ్రాల హారాన్ని గుర్తు చేస్తూ శిరీష్ డ్రెస్‌కు రాజరికపు ఆకర్షణని జోడించింది. చోకర్ తరహాలో ఉన్న ఈ నెక్లెస్‌ని మన భారతీయ రాజులు, అప్పట్లో మొఘల్ చక్రవర్తులు ధరించారు. ఆ రోజుల్లో మగవారు మెడలో చోకర్‌లు, నెక్లెస్‌లు ధరించడం ఒక సంప్రదాయంగా ఉండేది. ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ అలనాటి సంప్రదాయాన్ని పెళ్లి, ఎంగేజ్‌మెంట్‌లలో కొనసాగిస్తూ అలనాటి పద్దతుల్ని గుర్తు చేస్తుండటంతో మళ్లీ హిందూ పెళ్లిళ్లలో ఆ రోజులొస్తాయా? అనే చర్చ జరుగుతోంది.
