Begin typing your search above and press return to search.

ఒకే వారం.. మూడు సినిమాలు.. మూడు టార్గెట్లు!

ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం స్టార్ క్లాష్ కంటే ఆడియన్స్ సెగ్మెంటేషన్. వృషకర్మ‌ మిథికల్ థ్రిల్లర్, అడ్వెంచర్ టచ్‌తో ఒక ప్రత్యేకమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Sept 2026 11:00 PM IST
ఒకే వారం.. మూడు సినిమాలు.. మూడు టార్గెట్లు!
X

డిసెంబర్ ఫస్ట్ వీక్ టాలీవుడ్‌లో ఈసారి ఆసక్తికరమైన రిలీజ్ క్లాష్‌కు వేదికగా మారుతోంది. సాధారణంగా ఒకే డేట్‌కు రెండు సినిమాలు వస్తున్నాయంటే స్టార్ హీరోల మధ్య పోటీగా చూస్తాం. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. డిసెంబర్ 4న నాగచైతన్య వృషకర్మ ఇప్పటికే రిలీజ్‌ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మిథికల్, అడ్వెంచర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. అదే డేట్ కు దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న శ్రీ శ్రీ కూడా ఇదే సమయంలో ఆడియ‌న్స్ ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఇక నితిన్ నటిస్తున్న అలియాస్ రుక్మిణి డిసెంబర్ 3 లేదా ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం స్టార్ క్లాష్ కంటే ఆడియన్స్ సెగ్మెంటేషన్. వృషకర్మ‌ మిథికల్ థ్రిల్లర్, అడ్వెంచర్ టచ్‌తో ఒక ప్రత్యేకమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. మరోవైపు శ్రీ శ్రీలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కాంబినేషన్ కారణంగా మరో రకమైన స్టార్ అట్రాక్షన్ కనిపిస్తోంది. నితిన్ అలియాస్ రుక్మిణి మాత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారంలో ఉంది. అంటే మూడు సినిమాలు ఒకే మార్కెట్‌లో ఉన్నప్పటికీ వాటి కంటెంట్ పొజిషనింగ్ వేర్వేరుగా ఉండ‌టంతో ఎవ‌రి ఆడియ‌న్స్ వారికి ఉంటార‌నే అభిప్రాయ‌ముంది. అందుకే ఈ పోటీని కేవలం ఎవరి సినిమా ఎవరి కలెక్షన్లను దెబ్బతీస్తుంద‌నే కోణంలో చూడటం కంటే ఎవరు ఏ ఆడియ‌న్స్ ను థియేటర్‌కు తీసుకొస్తార‌నే కోణంలో చూడాల్సి ఉంటుంది.

అయితే ఆడియ‌న్స్ డివైడ్ అయినంత మాత్రాన బిజినెస్‌పై ప్రభావం ఉండదని చెప్పలేం. ఒకే వారం మూడు సినిమాలు వస్తే మొదటి ప్రాబ్ల‌మ్ స్క్రీన్ డిమాండ్. ముఖ్యంగా ఓపెనింగ్ రోజుల్లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు, ఎన్ని షోలు లభిస్తాయన్నది కీలకంగా మారుతుంది. స్టార్ పవర్, జానర్, సినిమాపై ఉన్న ప్రీ రిలీజ్ బజ్, నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ స్ట్రాటజీ వంటి అంశాలు థియేట్రికల్ ప్రాధాన్యతను ప్రభావితం చేయొచ్చు. పైగా ఒక సినిమా టాక్ స్ట్రాంగ్ గా వస్తే, మిగిలిన సినిమాలకు కేటాయించిన షోలు, స్క్రీన్లు కూడా మారే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చూస్తే డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో కనిపిస్తున్న ఈ పోటీని నేరుగా స్టార్ క్లాష్‌గా పిలవడం కంటే మూడు సినిమాలు.. మూడు ఆడియన్స్ సెగ్మెంట్లుగా చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఒకే టైమ్ లో మిథికల్ థ్రిల్లర్, స్టార్ కాంబినేషన్‌తో కూడిన సినిమా, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఆడియ‌న్స్ ముందుకు వస్తే.. ఎవరి ఓపెనింగ్ ఎలా ఉంటుంది? ఎవరి సినిమా ఏ సెగ్మెంట్‌ను బలంగా ఆకట్టుకుంటుంది? చివరకు స్క్రీన్ డిమాండ్‌ను ఎవరు నిలబెట్టుకుంటారు? అనే అంశాలే డిసెంబర్ రేసులో అసలు బిజినెస్ లెక్కలను నిర్ణయించే అంశాలుగా మారనున్నాయి.