చిన్నోళ్లకు సాధ్యమైంది..పెద్దోళ్లకు సాద్యం కాలేదే!
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని మరోసారి టాలీవుడ్ లో ప్రూవ్ అయింది. ఇటీవలే రిలీజ్ అయిన `మిరాయ్`, `కిష్కింధపురి` లాంటి సినిమాలు సక్సెస్ దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 15 Sept 2025 11:31 AM ISTకంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని మరోసారి టాలీవుడ్ లో ప్రూవ్ అయింది. ఇటీవలే రిలీజ్ అయిన `మిరాయ్`, `కిష్కింధపురి` లాంటి సినిమాలు సక్సెస్ దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నటించింది పెద్ద స్టార్లు కాదు. చిన్న నటులతో తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రాలే బెస్ట్ క్వాలిటీతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ` మిరాయ్` చిత్రంలో విజువల్ ఎఫెక్స్ట్ క్వాలిటీ బాగుంది. తక్కువ బడ్జెట్ లో మంచి ఔట్ పుట్ తీసుకున్నారు. ఈ సినిమా బడ్జెట్ చూస్తే 40-50 కోట్లే ఉంటుంది. క్వాలిటీ లో మాత్రం 100 కోట్ల బడ్జెట్ సినిమాలా కనిపిస్తుంది.
టెక్నీషియన్ కావడంతోనే సాధ్యం:
ఇదంతా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని వల్లే సాధ్యమైంది. తాను సినిమాటోగ్రాఫర్ కావడంతో? విజువల్ గా సినిమాని ఎక్కడ హైలైట్ చేయాలి? ఖర్చు ఎక్కువగా ఎక్కడ అవుతుంది? ఎలాంటి సన్నివేశాలపై దృష్టి పెట్టాలి అన్న దానిపై దృష్టి పెట్టి పనిచేసాడు కాబట్టే సాధ్యమైంది. బడ్జెట్ ను కూడా తెలివిగా అదుపు చేయగలిగారు. లేదంటే ఇలాంటి కథలకు బడ్జెట్ అంతకంతకు పెరిగిపోతుంది. మరో యువ హీరో సాయి శ్రీనివాస్ నమ్మకం కూడా `కిష్కిందపురి`తో నిలబడింది. ఇండస్ట్రీలో వరుస వైఫల్యాల్లో ఉన్న శ్రీనివాస్ కి సరైన సమయంలో పడిన హిట్ ఇది.
బెస్ట్ క్వాలిటీ చిత్రాలివే:
ఈ విజయం కొంత కాలం శ్రీనివాస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా 10 కోట్ల లోపే ఉంటుంది. కంటెంట్ బలంగా ఉండటంతోనే ప్రేక్షకుల్ని థియేటర్ వరకూ రప్పించగలుగుతుంది. వీటికంటే ముందే `గామీ` చిత్రాన్ని 2 కోట్లలో తీసి 20 కోట్ల క్వాలిటీ ఉన్న సినిమాగా అందించారు. ఆ తర్వాత `హనుమాన్` కూడా 25 కోట్లలో నిర్మించారు. ఈ సినిమా కంటెంట్ సహా సక్సెస్ చూస్తే 400 కోట్ల రేంజ్ కి చేరింది. మరి ఇలాంటి సక్సెస్ ..ఇలాంటి క్వాలిటీ చిత్రాన్ని కొంత మంది పెద్ద డైరెక్టర్లు ఏ కారణంగా అందించలేక పోతున్నట్లు? అన్నది ఇప్పుడు నెట్టింట జరుగుతోన్న ప్రధాన చర్చ.
కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయి?
కొరటాల `ఆచార్య` చిత్రాన్ని ఏ రేంజ్ లో తీసారో తెలిసిందే. కానీ అందులో కంటెంట్ వీక్ గా ఉంది. విజువల్ గా మరింత రిచ్ గా చూపించొచ్చు. కానీ అది జరగలేదు. అంతకు ముందు `ఆదిపురుష్` కోసం వందల కోట్లు ఖర్చు చేసారు. కానీ పెట్టిన పెట్టుబడి ఎక్కడా కనిపించలేదు. ప్రతీగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురైన చిత్రంగా మిగిలిపోయింది. ఈ మధ్యనే రిలీజ్ అయిన మరో రెండు కళాఖండాలు `హరిహర వీరమల్లు`, `వార్ 2`. రెండు చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినవే.
క్వాలిటీ కంటెంట్ వాళ్లకే సాధ్యం:
కానీ వీరమల్లు లో నాణ్యత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. విజువల్ గా పీక్స్ లో చూపించాల్సిన కథని పాతాళానికి తొక్కేసారు. అటుపై రిలీజ్ అయిన `వార్ 2` విజువల్ ఎఫెక్స్ట్ అయితే ఏకంగా ట్రోలింగ్ కే గురయ్యాయి. ఇవన్నీ వందల కోట్ల పెట్టుబడి పెట్టిన చిత్రాలే. కానీ పెట్టిన కోట్లు క్వాలిటీ రూపంలో ఎక్కడా కనిపించలేదు. చాలా మంది దర్శకుల విషయంలో ఇది క్లియర్ గా కనిపిస్తుంది. దర్శక దిగ్గజం రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ, అషుతోష్ గోవారికర్, నితీష్ తివారీ సహా మరికొంత మంది డైరెక్టర్ల సినిమాల్లోనే పెట్టుబడికి తగ్గ క్వాలిటీ కనిపిస్తుంది.
